ఇండియాలో లాక్ డౌన్ వ్యవధిని మరో 19 రోజులపాటు పొడిగించినందున వాణిజ్య రంగానికి ఉపశమనం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ లలో ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయని హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ఇవి మాత్రమే కాకుండా స్టేషనరీ వస్తువులను కూడా ఈ ప్లాట్ ఫామ్ ల ద్వారా ప్రజలు వాటిని ఆర్డర్ చేసి పొందవచ్చు. అయితే ప్రభుత్వం అవసరమైన మరియు అవసరం లేని వస్తువుల మధ్య తేడాను గుర్తించలేదు. నెమ్మదిగా ప్రభుత్వం వాణిజ్య రంగాలకు కూడా లాక్ డౌన్ విముక్తి అందించి ఆర్థికంగా మెరుగుపడాలని భావిస్తున్నారు. ఇ-కామర్స్ కార్యకలాపాలను ప్రభుత్వం అనుమతించినప్పటికీ వైరస్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు ప్రభుత్వం కఠినమైన సామాజిక దూర నిబంధనలను అనుసరిస్తుంది. అలాగే డెలివరీలో పాల్గొనే వాహనాలు ప్యాకేజీలను పంపిణీ చేయడానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. కొన్ని ఆంక్షలతో ట్రక్కుల రవాణాను కూడా ప్రభుత్వం అనుమతించింది. ట్రక్ డ్రైవర్లు వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ట్రక్ లో డ్రైవర్ కు సహాయకుడిగా మరో ముగ్గురు కంటే ఎక్కువ మంది అనుమతించబడరు. అలాగే హైవేలలోని షాపులు మరియు ఆహార దుకాణాలు మరియు రిపేర్ షాపులను కూడా కొన్ని కఠినమైన సామాజిక దూర మార్గదర్శకాలతో పనిచేయడానికి ప్రభుత్వం అనుమతిని ఇస్తున్నది. సామాజిక దూర మార్గదర్శకాలను పాటించకపోతే స్థానిక అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటారు. మొత్తం వాణిజ్య రంగాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ చర్య కారణంగా రోజువారీ వేతన సంపాదకులు అధికంగా ప్రయోజనాలు పొందుతారు. అధిక సంఖ్యలో ఉద్యోగులు డెలివరీ సేవల్లో నిమగ్నమై ఉన్నందున అటువంటి కార్మికుల కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నది. ప్రభుత్వం నెమ్మదిగా ఇతర రిటైల్ రంగాల మీద కూడా పరిమితులను తొలగించాలని చూస్తున్నది. తద్వారా ఆర్థిక వ్యవస్థ మళ్లీ అభివృద్ధి చెందడమే కాకుండా ప్రజలకు బాహ్య ఇబ్బందులతో అవసరమైన వస్తువులు లభిస్తాయి. ప్రభుత్వం ఈ రంగాన్ని ఓపెన్ చూసేటప్పటికి ముందు జాగ్రత్త చర్యలకు సంబంధించిన కఠినమైన మార్గదర్శకాన్ని రూపొందిస్తారు. ఇది ఉద్యోగుల భద్రతా ప్రయోజనం కోసం పాటించడం తప్పనిసరి. అలాగే COVID-19 హాట్ స్పాట్ ప్రాంతాలకు డెలివరీలను ప్రభుత్వం అనుమతించకపోవచ్చు.