Home
News

Amazon Prime వీడియోలో కొత్తగా 'వాచ్ పార్టీ' ఫీచర్!!! 100 మందికి మద్దతు...

కరోనా మహమ్మారి వ్యాప్తి తరువాత జనాలు ఇంటి వద్ద నుండి బయటకు పోవడానికి ఇప్పటికి కూడా సంకోచిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు వినోదం కోసం ఎక్కువగా OTT యాప్ ల మీద ఆధారపడుతున్నారు. ఈ OTT సబ్స్క్రిప్షన్ లలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న వాటిలో అమెజాన్ ప్రైమ్ కూడా ఉంది. ఈ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పుడు భారతదేశంలో 'వాచ్ పార్టీ' అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఫీచర్ దాని పేరుకు తగ్గట్టుగానే పార్టీని సృష్టించడానికి అనుమతిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో వాచ్ పార్టీ ఫీచర్

అమెజాన్ ప్రైమ్ వీడియో వాచ్ పార్టీ ఫీచర్

అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొత్తగా విడుదలైన 'వాచ్ పార్టీ' ఫీచర్ సాయంతో వినియోగదారులు ఎవరైనా సరే పార్టీ పేరుతో ఒక గ్రూపును సృష్టించి ఇతరులను పార్టీలో చేరమని ఆహ్వానించవచ్చు. తద్వారా మీరు మీ యొక్క స్నేహితులతో కలిసి సినిమాలు లేదా టీవీ షోలను చూడవచ్చు. ఇందులో అంతర్నిర్మిత చాట్ ఫీచర్ కూడా ఉండడంతో సినిమాలు చూస్తున్న సమయంలో మరొకరితో చాటింగ్ కూడా చేయడానికి వీలును కల్పిస్తున్నది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పుడు ప్రాంతీయ భాషలలో విడుదలలో కూడా విడుదల కావడంతో OTTలలో దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌కు గట్టి పోటీని ఇస్తున్నది. ఒక నెలకు రూ.129 ధర వద్ద మరియు ఒక సంవత్సరానికి రూ.999 ధర వద్ద అమెజాన్ ప్రైమ్ చందాను మరియు ప్రైమ్ షిప్పింగ్ సర్వీస్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోల చందాను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా పొందవచ్చు.

 

అమెజాన్ ప్రైమ్ వీడియోలో వాచ్ పార్టీ ఫీచర్‌ను ఉపయోగించే విధానం

అమెజాన్ ప్రైమ్ వీడియోలో వాచ్ పార్టీ ఫీచర్‌ను ఉపయోగించే విధానం

అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొత్తగా విడుదల అయిన "వాచ్ పార్టీ" ఫీచర్ కేవలం డెస్క్‌టాప్‌లకు మాత్రమే పరిమితం అని గమనించాలి. అలాగే ఇందుకోసం ఎటువంటి అదనపు మొత్తాన్ని కూడా చెల్లించకుండా కూడా లభిస్తుంది. దీని యొక్క సహాయంతో అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్ తమకు నచ్చిన సినిమా లేదా టీవీ షోని ఎంచుకొని అందులో నేరుగా పార్టీని సృష్టించవచ్చు. పార్టీని సృష్టించిన తర్వాత మీరు వాచ్ పార్టీని కాపీ చేయవచ్చు లేదా ప్రైమ్ వీడియో వెబ్‌సైట్ నుండి నేరుగా ఇతరులకు షేర్ చేయవచ్చు.

అమెజాన్ ప్రైమ్ వాచ్ పార్టీలో చాటింగ్ ఫీచర్

అమెజాన్ ప్రైమ్ వాచ్ పార్టీలో చాటింగ్ ఫీచర్

అమెజాన్ ప్రైమ్ వీడియోలో వాచ్ పార్టీని సృష్టించే వ్యక్తిని హోస్ట్ అని పిలుస్తారు. ఈ వాచ్ పార్టీలో పాల్గొనే వారందరికీ ఖచ్చితంగా అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ ను కలిగి ఉండాలి. హోస్ట్ చేసే వారికి ఈ పార్టీలో పూర్తి యాక్సిస్ ను కలిగి ఉంటారు. అలాగే ఇందులో పాల్గొనేవారు హోస్ట్ చేసే వారితో సహా ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరిని చూడవచ్చు మరియు చాట్ చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో వాచ్ పార్టీలో పాల్గొనడానికి 100 వరకు మద్దతును ఇస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon Prime Video Streaming Platform Release 'Watch Party' Feature in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X