మనుషుల భావోద్వేగాలను గుర్తించే డివైస్ ను తయారు చేస్తున్న అమెజాన్

మానవ భావోద్వేగాలను చదవడానికి మరియు అర్థం చేసుకోవటానికి తయారు చేసిన యంత్రం ఇప్పటి వరకు అసమర్థంగా ఉంది ఇది ఈ యంత్రం యొక్క అతి పెద్ద లోపంగా ఉంది. కానీ ఇది మారిపోవచ్చు.


మనుషుల భావోద్వేగాలను చదవడానికి మరియు అర్థం చేసుకోవటానికి తయారు చేసిన యంత్రం ఇప్పటి వరకు అసమర్థంగా ఉంది ఇది ఈ యంత్రం యొక్క అతి పెద్ద లోపంగా ఉంది. కానీ ఇది మారిపోవచ్చు.

Advertisement

అమెజాన్ కంపెనీ వాయిస్-ఉత్తేజితంతో మానవ భావోద్వేగాలను గుర్తించే మణికట్టుకు ధరించగల ఒక గాడ్జెట్ను అభివృద్ధి చేస్తోంది అని బ్లూమ్ బర్గ్ గురువారం నివేదించింది. బ్లూమ్ బర్గ్ గాడ్జెట్ కు సంబంధించిన అంతర్గత పత్రాలను సమీక్షించింది మరియు ఈ డివైస్ ఆరోగ్య మరియు సంరక్షణ ఉత్పత్తిగా వర్ణించబడింది.

Advertisement

ఈ డివైస్ మణికట్టుకు ధరించగలిగి ఉంటుంది. ఇది స్మార్ట్ఫోన్ యాప్ మరియు మైక్రోఫోన్ల జతతో పని చేస్తుంది అని చెప్పారు.ఈ డివైస్ ను ధరించినవారి స్వరం లోని ధ్వనిని బట్టి వ్యక్తి యొక్క భావోద్వేగ స్థితిని కనుగొంటుంది.

ఈ టెక్నాలజీ ఇతర వ్యక్తులతో సంబాసిస్తున్నపుడు వారి పరస్పర చర్యను ఎలా మెరుగుపరచాలో డివైస్ ధరించేవారికి సలహా ఇస్తుంది. వాణిజ్యపరంగా ఈ డివైస్ ఇంకా అస్పష్టంగా ఉంది.

ఈ బీటా పరీక్ష జరుగుతోంది కానీ హార్డ్ వేర్ లేదా సాఫ్ట్ వేర్ లేదా రెండింటి లోపాల కారణంగా మనిషి భావోద్వేగాలను గుర్తించగలిగే డివైస్ ఇంకా అస్పష్టంగా ఉంది. అమెజాన్ యాజమాన్యం Lab126లో పరిశోధన మరియు అభివృద్ధి కంప్యూటర్ హార్డ్వేర్ కంపెనీతో కలిసి ఈ డివైస్ ని అభివృద్ధి చేస్తోంది. ల్యాబ్126లో అమెజాన్ యొక్క ఇతర ఉత్పత్తులు కిండ్ల్, ఫైర్ ఫోన్ మరియు ఎకో స్మార్ట్ స్పీకర్ లాంటివి తయారుచేస్తున్నారు. అమెజాన్ అలెక్సా వాయిస్ సాఫ్ట్వేర్ టీమ్ తో కూడా కలిసి పనిచేస్తోంది.

Advertisement

రెండు సంవత్సరాల క్రితం అమెజాన్ వారు మనిషి భావోద్వేగ పరిస్థితిని ఉత్సాహపరిచేందుకు మరియు సరైన సూచనలు చేయడానికి ప్రజల స్వర ఆకృతులను ఉపయోగించుకునే విధానాన్ని వివరించారు.ఇప్పుడు ఈ డివైస్ కు ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు చెబుతున్నారు.

డివైస్ మరియు దాని సాంకేతికత అది సృష్టించగల వ్యక్తిగత డేటా యొక్క అదనపు మొత్తం గురించి వివాదాస్పదంగా ఉంటుంది మరియు సంస్థ యొక్క మార్కెటింగ్ వ్యూహాల ప్రయోజనం కోసం భావోద్వేగ ఉత్పాదకాలను ఉపయోగించడం ఎలా సాధ్యమవుతుందో చూడాలి.

మైక్రోసాఫ్ట్, గూగుల్ మరియు ఐబిఎమ్ వంటి ఇతర టెక్ జెయింట్స్ కూడా మానవుల మానసిక స్థితిని గుర్తించ గల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాయి.

Best Mobiles in India

Advertisement

English Summary

amazons next device human emotion