BSNL Vs Jio: కొత్త చందాదారుల చేరికలో అందరిని అధిగమించిన బిఎస్‌ఎన్‌ఎల్


ఇండియా యొక్క టెలికామ్ ఆపరేటర్లలో ఒక్కప్పుడు రారాజుగా ఎదిగిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్) తరువాతి కాలంలో ప్రైవేట్ టెల్కోల కారణంగా వెనుకకు పడిపోయింది. గత రెండు సంవత్సరాల కాలంలో బిఎస్‌ఎన్‌ఎల్ కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది. చివరికి ప్రభుత్వం జోక్యంతో బిఎస్‌ఎన్‌ఎల్ తన పూర్వ వైభవాన్ని అందుకుంటున్నది.

Advertisement

ప్రైవేట్ టెల్కోలలో మరి ముఖ్యంగా జియో సంస్థ మొదలైనప్పటి నుంచి బిఎస్‌ఎన్‌ఎల్ తన చందాదారులను పూర్తిగా కోల్పోయింది. ఇప్పుడు మళ్ళి తన చందాదారులు పెరగడం మొదలవుతున్నది. ప్రభుత్వ అద్వర్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్) 2019 డిసెంబర్‌లో భారతదేశంలోని ఇతర టెలికం ఆపరేటర్లకన్నా ఎక్కువ మంది చందాదారులను చేర్చుకున్నది.

 

 

Rs.1,299 Annual Prepaid ప్లాన్ యొక్క వాలిడిటీని తగ్గించిన రిలయన్స్ జియో

Advertisement
ప్రీపెయిడ్ టారిఫ్

2019 డిసెంబర్‌లో ప్రీపెయిడ్ టారిఫ్ పెంపు తరువాత బిఎస్‌ఎన్‌ఎల్ చందాదారుల చేరిక చార్టులో నాయకత్వం వహిస్తుందని అందరూ ఉహించారు. ఇప్పుడు ట్రాయ్ విడుదల చేసిన చందా డేటా చార్టు ప్రకారం ఇదే నిజమయింది. డిసెంబర్ నెలలో బిఎస్ఎన్ఎల్ 4.2 లక్షల మంది కొత్త వినియోగదారులను చేర్చుకున్నది. రిలయన్స్ జియో 82,308 మంది కొత్త కస్టమర్ల చేరికతో రెండవ స్థానంలో నిలిచింది.

 

 

New HD కనెక్షన్ సెట్-టాప్ బాక్స్‌లలో టాప్ ఎవరో తెలుసా...

చందాదారుల సంఖ్య

రిలయన్స్ జియో ప్రారంభమైనప్పటి తరువాత ఐదు మిలియన్ల కంటే తక్కువ వినియోగదారులను చేర్చుకోవడం ఇదే మొదటిసారి. రాబోయే రెండు త్రైమాసికాలలో 500 మిలియన్ల చందాదారుల సంఖ్యను చేరుకోవాలనే జియో లక్ష్యంపై ఇప్పుడు చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే వొడాఫోన్ ఐడియా ఈ నెలలో అత్యధిక మంది సభ్యులను కోల్పోయింది. తరువాత భారతి ఎయిర్‌టెల్ మరియు ఎమ్‌టిఎన్ఎల్ ఉన్నాయి.

 

 

Netflix యాప్ లో "టాప్ 10" ఫీచర్‌...

కొత్త చందాదారుల చేరికలలో జియోను ఓడించిన బిఎస్ఎన్ఎల్

రిలయన్స్ జియో సెప్టెంబరు 2016 లో తన సేవలను ప్రారంభించినప్పటి నుండి దాదాపు ప్రతి నెల విజేతగా అవతరించింది. ఈ సంస్థ ప్రతి నెలా సగటున ఐదు మిలియన్లకు పైగా వినియోగదారులను చేర్చుకుంటున్నది. అయితే తాజా ప్రీపెయిడ్ టారిఫ్ పెంపు మరియు ఐయుసి వంటి వాటి కారణంగా పరిస్థితి చిన్నాభిన్నం అయ్యింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ టెల్కో 2019 డిసెంబర్‌లో కేవలం 82,308 మంది కొత్త వినియోగదారులను చేర్చుకున్నది. అయినప్పటికీ ఇది ఇప్పటికీ 32.14% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది.

 

 

wireless earphoneలను కొనుగోలు చేస్తున్నారా? వీటిని గుర్తుపెట్టుకోండి!!!!

బిఎస్‌ఎన్‌ఎల్ మార్కెట్ వాటా

ప్రభుత్వ యాజమాన్యంలోని బిఎస్‌ఎన్‌ఎల్ 2019 డిసెంబర్‌ నెలలో 427,089 మంది కొత్త వినియోగదారులను తనలో చేర్చుకొని జియోను తొలిసారిగా ఓడించి ప్రస్తుతం 10.26% మార్కెట్ వాటాను పొందింది. డిసెంబర్ 2019 ప్రారంభంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ప్రీపెయిడ్ టారిఫ్ ధరలను 40% వరకు పెంచారు. కాని బిఎస్ఎన్ఎల్ ఎంచుకున్న సర్కిళ్లలో చెల్లుబాటును తగ్గించడం మినహా తన ధరలలో పెద్ద మార్పులు చేయలేదు. డిసెంబరులో ప్రీపెయిడ్ ధరలను పెంచకూడదనే నిర్ణయం రిలయన్స్ జియో కంటే ఎక్కువ మంది కొత్త కస్టమర్లను పట్టుకోవటానికి బిఎస్ఎన్ఎల్ సహాయపడింది.

 

 

113 మిల్లియన్ డాలర్ల ఫండ్ సేకరించిన స్విగ్గీ

వోడాఫోన్ ఐడియా పరిస్థితి

2019 డిసెంబర్‌లో సుమారు 3.6 మిలియన్ల మంది వినియోగదారులను కోల్పోయి వోడాఫోన్ ఐడియా యొక్క పరిస్థితి మరింత దిగజారింది. భారతి ఎయిర్‌టెల్ కూడా 2019 చివరి నెలలో 11,000 మంది సభ్యులను కోల్పోయింది. కాబట్టి భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియాపై కూడా సుంకం పెంపు ప్రభావాన్ని చూడవచ్చు. నవంబర్ 2019 లో వోడాఫోన్ ఐడియా 30 మిలియన్లకు పైగా కస్టమర్లను కోల్పోయింది. ఇది మొత్తం వినియోగదారుల సంఖ్యను గణనీయమైన తేడాతో తగ్గించింది. మరియు టెల్కోకు చందాదారుల నష్టాలు కొనసాగుతున్నాయి.

మొత్తం మార్కెట్ వాటా

మొత్తం విషయానికొస్తే రిలయన్స్ జియో ఇప్పటికీ 32.14% మార్కెట్ వాటాతో భారతదేశంలో ప్రముఖ టెలికాం ఆపరేటర్ లలో మొదటి స్థానంలో ఉంది. తరువాత స్థానంలో వోడాఫోన్ ఐడియా 28.89%, భారతి ఎయిర్టెల్ 28.43% మార్కెట్ వాటాతో నిలిచాయి. బిఎస్ఎన్ఎల్ 10.26% మార్కెట్ వాటాతో భారతదేశం యొక్క నాల్గవ అతిపెద్ద టెల్కోగా కొనసాగుతోంది.

 

 

Best Mobiles in India

English Summary

BSNL Subscribers Increase Leaving Behind Jio