బిఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ చూశారా, దుమ్మురేపుతోంది

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ భార‌త్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవ‌ల‌ను ఘనంగా ప్రారంభించింది.


ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ భార‌త్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవ‌ల‌ను ఘనంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా రోజుకు 35 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. కేవ‌లం రూ.1.1 కే 1 జీబీ డేటాను అందించనుంది. ఇప్పటికే ఎయిర్‌టెల్‌తోపాటు త్వ‌ర‌లో రానున్న రిల‌య‌న్స్ జియో బ్రాడ్ బ్యాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బిఎస్ఎన్ఎల్ ఈ ఆఫ‌ర్‌ను వినియోగ‌దారుల‌కు అందివ్వ‌నుంది. ఈ ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ గ‌రిష్ట స్పీడ్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తుంది. కాగా జియో త‌న గిగాఫైబ‌ర్ సేవ‌ల‌ను దేశవ్యాప్తంగా 1400 సిటీల‌లో ప్రారంభించ‌నున్న విష‌యం విదిత‌మే. మ‌రోవైపు ఎయిర్‌టెల్ కూడా ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌కు పోటీగా త‌న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల‌ను మార్చ‌డంతోపాటు క‌స్ట‌మ‌ర్ల‌కు భారీ ఎత్తున ఆఫ‌ర్ల‌ను అందించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలిసింది.

Advertisement

లేటుగా వచ్చినా సరే లేటెస్ట్ యానువల్ ప్లాన్ తో దూసుకొచ్చిన ఎయిర్‌టెల్

రూ.2295 ప్లాన్

వినియోగదారులు రూ.2295తో రీఛార్జ్ చేసుకుంటే పై ప్రయోజనాలను పొందుతారు. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో తప్ప ఎక్కడైనా ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్లో 24 గంటలు అన్ లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే లోకల్ నేషనల్ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు.

Advertisement
వార్షిక ప్లాన్

వినియోగదారులు నెల నెల ప్లాన్ వార్షిక ప్లాన్ గా కూడా మార్చుకోవచ్చు. దీని ధర రూ. 22, 950గా ఉంది. 10 నెలల పేమెంట్ ను ఒక్కసారి చెల్లిస్లే అదనంగా రెండు నెలలు చెల్లించనవసరం లేకుండా ఉచితంగా డేటాను పొందవచ్చు.

2 ఇయర్స్ ప్లాన్

ఈ ఫ్లాన్ తో పాటు వినియోగదారులు రెండు సంవత్సరాల ప్లాన్ కూడా ఎంచుకోవచ్చు. రెండు సంవత్సరాలకు ఒకేసారి రూ.43,605 చెల్లిస్తే సరిపోతుంది. అలాగే మూడు సంవత్సరాలకు రూ. 64,260 చెల్లిస్తే సరిపోతుంది.ఈ రెండు ప్లాన్లలో వినియోగదారుడు 5 నెలలు, 8 నెలలు పాటు ఉచిత డేటాను పొందవచ్చు.

అన్ లిమిటెడ్

ఈ కొత్త ప్లాన్లో అన్ లిమిటెడ్ డౌన్లోడ్ అప్ లోడ్ సౌలభ్యం ఉంది. అలాగే 1జిబి ఈమెయిల్ స్పేస్ ని అందుకుంటారు. కాగా గతవారంలో కంపెనీ రూ.549 ప్లాన్ లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్లాన్లో రోజుకు 3జిబి డేటాను అందుకుంటారు. అలాగే ఆదివారం నాడు అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది.

Best Mobiles in India

English Summary

BSNL’s new broadband plan offers 35GB data per day more News at Gibot Telugu