Home
News

డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగం.. స్నేహితుడి మాదిరిగా వీడియో కాల్‌ చేసి రూ.40 వేలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్‌ఫేక్‌ టెక్నాలజీ కారణంగా ఎదురవుతున్న చెడు పరిణామాలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. ఈ వారం మొదట్లో డీప్‌ఫేక్‌ టెక్నాలజీని ఉపయోగించి ప్రముఖ నటి రష్మిక మందన్న నకిలి వీడియోను క్రియేట్‌ చేశారు. ఈ వీడియో బాగా వైరల్‌ అయింది. ఈ నకిలీ వీడియోపై నటి రష్మిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

నకిలీ వీడియో వైరల్‌ మారడంతో ప్రముఖలు రష్మికకు మద్దతుగా నిలిచారు. టెక్నాలజీ దుర్వినియోగంపై ఆందోళన వక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం సోషల్‌ మీడియా సంస్థలకు కీలక రిమైండర్‌ను పంపింది. ఇందులో టెక్నాలజీ దుర్వినియోంపై ఆందోళన వ్యక్తం చేసింది. మరియు చట్ట ప్రకారం శిక్షలను ప్రస్తావించింది.

coal india ex executive loses rs40000

డీప్‌ఫేక్‌ టెక్నాలజీ దుర్వినియోగం : అయితే తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. డీప్‌ఫేక్‌ టెక్నాలజీతో స్నేహితుడి వలే వీడియో కాల్ చేసి, తనకు కొంత డబ్బు అవసరం ఉందని, వెంటనే పంపాలని కోరాడు. అయితే ఈ కాల్ నిజమని నమ్మిన ఓ వ్యక్తి రూ.40 వేల రూపాయలు పొగొట్టుకున్నాడు. ఈ తాజా ఘటనలో డీప్‌ఫేక్‌ టెక్నాలజీ దుర్వినియోగంపై మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది.

కోల్‌ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్‌ రాధాకృష్ణన్‌కు జులై 9న ఉదయం వరుసగా కొన్ని వాట్సాప్‌ మెసేజ్‌లు వచ్చాయి. తాను వేణుకుమార్‌గా పరిచయం చేసుకున్నాడు. రాధాకృష్ణన్‌, వేణుకుమార్‌ కోల్ ఇండియాలో పనిచేస్తున్న సమయం నుంచి స్నేహితులుగా తెలుస్తోంది. ఈ కాల్‌లో భాగంగా కుటుంబ సహా ఇతర విషయాలు పంచుకున్నారు అనంతరంతన సోదరికి ఆపరేషన్‌ చేసేందుకు రూ.40 వేలు కావాలని వేణుకుమార్‌ కోరాడు.

తొలుత రాధాకృష్ణన్‌ కొంత అనుమానం వ్యక్తం చేసినా... వీడియో కాల్‌ చేయడంతో అనుమానం నివృత్తి అయింది. దీంతో వెంటనే గూగుల్‌ పే ద్వారా రూ.40 వేల నగదును బదిలీ చేశాడు. అయితే మరో 35 రూపాయలు కావాలని మరోసారి ఫోన్‌ చేయగా.. రాధాకృష్ణన్‌కు అనుమానం వచ్చింది. దీంతో తన వద్దనున్న వేణుకుమార్‌ ఫోన్‌ నంబర్‌కు కాల్ చేశారు. దీంతో ఇదంతా మోసంగా తెలుసుకున్న రాధాకృష్ణన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సుమారు 4 నెలల విచారణ అనంతరం కోజికొడ్‌ పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్‌ చేశారు. ఈ నిందితుడు గుజరాత్‌కు చెందిన వాడిగా గుర్తించారు. అయితే అహ్మదాబాద్‌కు చెందిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు వివరాలు వెల్లడించారు. కోల్ ఇండియా మాజీ ఉద్యోగుల వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి నిందితులు.. రాధాకృష్ణన్‌ సహా అతని స్నేహితుల వివరాలను సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు.

డీప్‌ఫేక్‌ టెక్నాలజీ ఆధారంగా రాధాకృష్ణన్‌ స్నేహితుడి మాదిరిగా మాట్లాడారు. దీంతో నిజమని నమ్మన రాధాకృష్ణన్‌ నగదును బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే రాధాకృష్ణన్‌ను అందుకున్న నగదు అహ్మదాబాద్‌లోని ఓ బ్యాంకు ఖాతాకు బదిలీ అయిందని. ఆ సమాచారం ఆధారంగా నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ సంవత్సరం జులై నెలలో కేరళకు చెందిన ఓ వ్యక్తిని డీప్‌ ఫేక్ టెక్నాలజీ ఆధారంగా వీడియో కాల్‌ చేసి సుమారు 40 వేల రూపాయలు వరకు దోచుకున్నారు. స్నేహితుడి వలే వీడియో కాల్‌ చేసి, అత్యవసరంగా కొంత డబ్బు కావాలని కోరారు.

అనుమానం వచ్చిన బాధితుడు వీడియో కాల్‌ చేయాలని కోరగా.. డీప్‌ఫేక్‌ టెక్నాలజీ ద్వారా వీడియో, ఆడియోను మేనేజ్‌ చేశారు. దీంతో తన స్నేహితుడే అని నమ్మిన బాధితుడు 40 వేల రూపాయలను వారి బ్యాంక్‌ ఖాతాకు పంపించాడు. చివరికి నిజం తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు.

డీప్‌ఫేక్ టెక్నాలజీ: ఈ ఘటనతో డీప్‌ ఫేక్ టెక్నాలజీ మరోసారి తెరపైకి వచ్చింది. డీప్‌ ఫేక్‌ అంటే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అల్గారిథమ్‌లను ఉపయోగించి నకిలీ కంటెంట్‌ను రూపొందించడం. అయితే ఈ వీడియోలు సదరు వ్యక్తులకు అత్యంత సామీప్యంగా ఉంటాయి. ఈ డీప్‌ఫేక్‌ టెక్నాలజీ ద్వారా నకిలీ ఫోటో, వీడియో, ఆడియోలను రూపొందించవచ్చు.

Best Mobiles in India

English summary
coal india ex executive loses rs 40000 after he got deepfake based video call
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X