Home
News

DishSMRT Hub & D2h ఆండ్రాయిడ్ STBల OTTల‌లో కొత్తగా చేరిన హంగమా ప్లే

డిటిహెచ్ రంగంలో రెండవ అతిపెద్ద ఆపరేటర్ గా పేరు గల డిష్ టివి యొక్క డిజిటల్ మీడియా పోర్ట్‌ఫోలియో మరింత బలోపేతం అయింది. ఇది ఇప్పుడు కొత్తగా హంగమా డిజిటల్ మీడియాతో భాగస్వామ్యంను కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆండ్రాయిడ్ ఆధారిత హైబ్రిడ్ STBలు DishSMRT హబ్ మరియు డి2హెచ్ స్ట్రీమ్ లను ఎంచుకున్న వారికి ఇప్పుడు వీడియో-ఆన్-డిమాండ్ ప్లాట్‌ఫామ్ హంగామా ప్లే యొక్క యాక్సిస్ ను ఉచితంగా అందిస్తున్నది. ఆండ్రాయిడ్ TV STB లతో డిష్ టీవీ మరియు D2h వినియోగదారులు ఇప్పుడు హంగమా ప్లే యొక్క ప్రీమియంను యాక్సిస్ చేయగలరు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిష్ టీవీ-హంగామా ప్లే పార్టర్నర్ షిప్

డిష్ టీవీ-హంగామా ప్లే పార్టర్నర్ షిప్

డిష్ టివి మరియు డి 2 హెచ్ ఇప్పుడు కొత్తగా హంగామా ప్లే OTT తో భాగస్వామ్యంను కలిగి ఉంది. ఈ హంగమా ప్లే యొక్క ఒరిజినల్స్ హిందీ, ఇంగ్లీష్ మరియు ప్రాంతీయ భాషలతో కలుపుకొని మొత్తంగా 5000+ పైగా సినిమాలు, 1500+ షార్ట్ ఫిలిమ్స్, 7500 గంటలకు పైగా కిడ్స్ మరియు టెలివిజన్ కంటెంట్ మరియు 150,000 కంటే ఎక్కువ షార్ట్ ఫార్మాట్ వీడియోలను కలిగి ఉన్నాయి.

 

హంగమా ప్లే సబ్స్క్రిప్షన్ ధరల వివరాలు

హంగమా ప్లే సబ్స్క్రిప్షన్ ధరల వివరాలు

డిష్ టీవీ వినియోగదారులకు హంగమా ప్లే యొక్క సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందించడం లేదు అని గుర్తుంచుకోండి. ఇప్పటికే ఉన్న d2h స్ట్రీమ్ మరియు డిష్ SMRT హబ్ యూజర్లు తమ STB లలో హంగామా ప్లే యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనుమతిని ఇస్తుంది. అలాగే వారు తమ STBల ద్వారానే నేరుగా హంగామా ప్లే యొక్క ప్లాన్ లను కొనుగోలు చేయవచ్చు. వీక్లీ, మంత్లీ, 6నెలలు మరియు ఒక సంవత్సరం యొక్క సబ్స్క్రిప్షన్ ధరలు వరుసగా రూ.29, రూ.99, రూ .249 మరియు రూ .799 గా ఉన్నాయి.

డిష్‌SMRT & డి2హెచ్ స్ట్రీమ్ ధరల వివరాలు

డిష్‌SMRT & డి2హెచ్ స్ట్రీమ్ ధరల వివరాలు

డిష్‌SMRT మరియు డి2హెచ్ స్ట్రీమ్ యొక్క సెట్-టాప్-బాక్స్ లను కొత్త కస్టమర్లు ఇప్పుడు రూ.3,999 ధర వద్ద కొనుగోలు చెయవచ్చు. అలాగే హెచ్‌డి సెట్-టాప్ బాక్స్‌ల నుండి అప్‌గ్రేడ్ అవుతున్న ప్రస్తుత చందాదారులు దీనిని కేవలం రూ.2,499 ధర వద్ద పొందవచ్చు.

DishSMRT హబ్ మరియు D2h స్ట్రీమ్ STBలు అందిస్తున్న ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌లు

DishSMRT హబ్ మరియు D2h స్ట్రీమ్ STBలు అందిస్తున్న ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌లు

డిష్ టీవీ మరియు డి 2 హెచ్ యొక్క ఆండ్రాయిడ్ STBలు ఇప్పుడు తన వినియోగదారులకు అనేక యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తున్నాయి. ఈ STBలు అంతర్నిర్మిత గూగుల్ అసిస్టెంట్ మద్దతును కూడా కలిగి ఉన్నాయి. దీనికి తోడుగా అంతర్నిర్మిత Chromecast ఫీచర్ కూడా ఉంది. Watcho, యూట్యూబ్, వూట్, ఈరోస్ నౌ, ZEE5, ALT బాలాజీ, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి మరెన్నో ప్రసిద్ధ OTT ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్ ను చందాదారులు నేరుగా ప్రసారం చేయవచ్చు. ఈ STBలను కలిగి ఉన్న వారికి స్మార్ట్ టివి అవసరం కూడా లేదు. DishSMRT హబ్ మరియు D2h స్ట్రీమ్ ఆండ్రాయిడ్ బాక్స్ రెండూ ఏ టీవీలోనైనా రన్ అవుతాయి. పైన పేర్కొన్న అన్ని వినోదాత్మక ప్లాట్‌ఫామ్‌లకు చందాదారులకు యాక్సిస్ ను ఇస్తాయి.

 

 

Best Mobiles in India

English summary
DishSMRT Hub and D2h Stream Android Set-Top Boxes Brings Hungama Play App
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X