ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో దొంగ ఓట్లకు చెక్ ! తెలంగాణ ఎన్నికల్లో వాడకం


తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్స్ ఫీవర్ నడుస్తున్నది. ఈ ఎన్నికలలో దొంగ ఓట్ల సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను ఉపయోగించనున్నది. ఈ యాప్‌తో పోలింగ్ కేంద్రాలలో ఓటర్లను త్వరగా ధృవీకరించవచ్చు మరియు రియల్ టైమ్ అంతేంటికేషన్ను పొందగలదు.

ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ

ఎన్నికల సమయంలో నిజమైన ఓటర్లు పోలింగ్ కేంద్రానికి రాకపోవచ్చు లేదా టెండర్డ్ ఓటు కోసం డిమాండ్ చేయకపోవచ్చు. అటువంటి ఓటర్ల యొక్క ఓటును మరొక వారు దొంగతనంగా వేయకుండా ఉండడానికి TSEC ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్ వంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్తింపజేయడం ద్వారా ఓటరును గుర్తించడం మరియు ధృవీకరించే ప్రక్రియ త్వరగా జరుగుతుంది. ఇది పూర్తిగా డిజిటల్ వ్యవస్థతో నడపబడుతున్నందున వంచన కేసులను గణనీయంగా తగ్గించటానికి సహాయపడుతుంది.

రోజుకు 3GB డేటాతో వోడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు..... ఆఫర్స్ అదుర్స్

మునిసిపాలిటీ ఎన్నికలు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కొంపల్లి మునిసిపాలిటీలో ఎంపిక చేసిన 10 పోలింగ్ స్టేషన్లలో ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను మొదటిసారిగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న సెక్యూరిటీ విధానాలకు అదనంగా ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్‌ ఓటరు యొక్క గుర్తింపును ధృవీకరించడానికి అదనపు సాధనంగా ఉపయోగపడుతుంది.

షియోమి Mi రౌటర్ 4C రిలీజ్.... అధిక వేగం, గొప్ప ఇంటర్నెట్ కనెక్టివిటీ ఫీచర్స్

ఫేస్ రికగ్నిషన్ యాప్‌

ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్‌ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ప్రాథమికంగా ఒక పోలింగ్ అధికారి ఓటరు యొక్క ఐడిని ధృవీకరిస్తారు. ఆ తరువాత ఓటరు యొక్క ఫోటోను తీసుకొని ఫేస్ రికగ్నిషన్ యాప్ సహాయంతో తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ సర్వర్‌లకు అప్‌లోడ్ చేస్తారు.

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్... ఫీచర్స్ ఇవే!!!

ఈ సర్వర్‌లో లోతుగా సెర్చ్ చేసి అతను ముందుగా ఓటు హక్కును వినియోగించాడా లేదా అసలు ఓటు హక్కుకు అర్హుడు అవుతాడా లేదా అన్న సమాచారంను తెలుపుతుంది. తరువాత అప్లికేషన్ తగిన మెసెజ్ తో ఓటర్లలో వెరిఫై చేయబడి మ్యాచ్ ఆధారంగా ధృవీకరణ ఫలితాన్ని ప్రదర్శిస్తుంది అని PTI నివేదించింది.

గ్లాన్స్ లాక్‌స్క్రీన్: షాపింగ్‌ కంటెంట్ ప్లాట్‌ఫాంతో అద్భుతమైన ఫీచర్

ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్‌ ద్వారా తీయబడిన ఫోటోలు ఎక్కడ స్టోర్ చేయబడవు మరియు మరే ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించబడవు. అవి పోలింగ్ స్టేషన్‌లో ఉపయోగించిన మొబైల్ ఫోన్ మెమరీ మరియు TSEC (తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్) సర్వర్ నుండి కూడా తొలగించబడతాయి. దీని కోసం పైలట్ ప్రాజెక్టు అమలుకు ముందు TSEC ఈ చర్యకు బాధ్యత వహించాలి అని SEC తెలిపింది. 120 మునిసిపాలిటీలు, తొమ్మిది మునిసిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ జనవరి 22 న జరుగుతుంది. అలాగే జనవరి 25 న ఫలితాలు వెలువడతాయి.

Most Read Articles

Best Mobiles in India

Have a great day!
Read more...

English Summary

Face Recognition App To Be Used in Telangana Municipal Polls To Check On Frauds