ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇప్పుడు చాలా సాధారణం అయిన విషయం , ఈ సాంకేతిక పరిజ్ఞానంతో nbsp;రాకపోతే మనలో చాలామంది స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయరు.ఎక్కువగా nbsp;ప్రయాణాలు చేసే వారు nbsp;మరియు స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా వాడేవారికి ఈ ఫాస్ట్ ఛార్జింగ్ అత్యవసరం. ఫాస్ట్ ఛార్జింగ్ లో తక్కువ సమయం లో మీకు రోజు మొత్తానికి సరిపడా బ్యాటరీ ని ఛార్జ్ చేయగల సామర్థ్యము ఉండటం మూలంగా మంచి ఉపయోగం ఉంటుంది. మీ స్మార్ట్ ఫోన్ ను నిమిషాల వ్యవధిలో కనీసం నాలుగింట ఒక వంతు శక్తినివ్వడం ఒక గొప్ప విషయమే కానీ, ఎంత గొప్ప టెక్నాలజీ అయిన హానికరంగా ఉపయోగించడానికి వీలుంది.అలాగే ఈ ఫాస్ట్ చార్జర్లులు కూడా మీ ఫోన్లకు మరియు ఇతర పరికరాలకు హానికరంగా ఉపయోగించ వచ్చు.మరి అది ఎలా పనిచేస్తుందో మీరు తెలుసుకోండి. ZDNet నివేదిక ప్రకారం, బ్యాడ్ పవర్ అని పిలువబడే ఒక లోపం కారణంగా కొన్ని ఫాస్ట్ ఛార్జర్ లలో ఫర్మ్ వేర్ ను సవరించగలదు. బ్యాడ్ పవర్ ఫాస్ట్ ఛార్జర్ ను పాడు చేస్తుంది మరియు ఛార్జింగ్ ప్రాసెస్ కోసం వోల్టేజ్ పై చిప్ యొక్క ఫర్మ్ వేర్ మరియు ఛార్జింగ్ పరికరాన్ని అనుసంధానించడం లో విఫలమవుతుంది. ఈ ఫాస్ట్ ఛార్జర్ లలో కొన్ని 20 వోల్ట్ ల తో ఛార్జ్ చేయగలవు, కొన్ని పరికరాలు 5 వోల్ట్ లను మాత్రమే సురక్షితంగా అంగీకరించగలవు. మీ పరికరాన్ని సురక్షితంగా ఛార్జ్ చేయగలిగే వోల్టాగే కంటే ఎక్కువ వోల్టేజ్ ను ఓవర్ లోడ్ చేయడం ద్వారా మీ పరికరాల్లో మంటలు చెలరేగే అవకాశం ఉంది.ఈ విషయాన్నీ తనిఖీ చేయడానికి, ఛార్జర్ యొక్క ఫర్మ్ వేర్ ను పాడు చేయడానికి పరిశోధకులు మొబైల్ ఫోన్ గా ఉన్న ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించారు. ఈ సందర్భంలో సరైన ‘హానికరమైన ప్రోగ్రామ్ లు, బాడ్ పవర్ సోకిన ఫోన్లు, ల్యాప్ టాప్ లు మొదలైనవి ఛార్జర్ యొక్క ఫర్మ్ వేర్ ను చెడగొట్టాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. డేటాను దొంగిలించే ఇతర మాల్వేర్ మరియు ransomware లాగా బ్యాడ్ పవర్ అనేది దూకుడుగా అనిపించదు. కాని ఇది మీ పరికరాన్ని భౌతికంగా నాశనం చేసేంత వేగంగా ఛార్జర్ ను పాడు చేస్తుంది.టెస్టింగ్ లో పరీక్షించిన 35 ఫాస్ట్ ఛార్జర్లు లో , కనీసం 18 బ్యాడ్ పవర్ కు గురయ్యే అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ 18 లో 11 వాటిలో ‘డిజిటల్ టెర్మినల్స్ ద్వారా పాడైపోవచ్చు. కానీ ఈ ఛార్జర్లు ఏ కంపెనీలకు చెందినవని అని మాత్రం పరిశోధకులు వెల్లడించలేదు. బ్యాడ్ పవర్ కారణముగా మీ పరికరాలు పేలిపోకుండా నిరోధించడానికి, తయారీదారులు తక్కువ వోల్టేజ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు తోడ్పడే పరికరాలకు అదనపు ఫ్యూజ్లను జోడించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.వినియోగదారులు తమ ఫోన్ ఛార్జర్లు మరియు పవర్ బ్యాంకులు ఇతర పరికరాలతో పంచుకోవద్దని పరిశోధకులు సూచిస్తున్నారు.