ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్స్ డేస్ 2020 సేల్స్.... ఆఫర్స్ చూడ తరమా....


వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ప్రముఖ ఈ-కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ 2020 సంవత్సరంలో మొదటిసారిగా వినియోగదారుల కోసం రిపబ్లిక్ డే సేల్స్ పేరుతో అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఎలక్ట్రానిక్స్‌ ఉత్పతులను గొప్ప తగ్గింపు ధరలకు అందించింది.

ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్స్ సేల్స్

ఇండియాలో రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్స్ పేరుతో ఈ సేల్స్ ను జనవరి 26 వరకు కొనసాగిస్తున్నది. ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్స్ 2020 సేల్స్ లో భాగంగా ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులు అయిన ప్రసిద్ధ ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్ హోమ్ ఉత్పత్తులు, ఉపకరణాలు మరియు మరిన్నింటిపై 80 శాతం వరకు తగ్గింపును ఇస్తుంది.అయితే ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్స్ డేస్ సేల్స్ లో మొబైల్ ఫోన్‌ల మీద ఎటువంటి తగ్గింపులు లభించవు.

షియోమి Mi A3అభిమానులకు శుభవార్త... భారీగా తగ్గిన ధర

ల్యాప్‌టాప్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్స్ డేస్ 2020 సేల్స్ లో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, కెమెరాలు, గేమింగ్ కన్సోల్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్స్‌ వస్తువులపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఏసర్, ఆసుస్ వంటి ఇతర బ్రాండ్ల యొక్క సన్నని మరియు తేలికపాటి ల్యాప్‌టాప్‌లను రూ.33,990 ధరల వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్స్ లో ఫ్లిప్‌కార్ట్ చాలా రకాల ల్యాప్‌టాప్ మోడళ్ల మీద బండిల్ చేసిన ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది.

బ్రహ్మాండమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఒప్పో F15 మొదటి సేల్స్

ఆడియో ఉత్పత్తులపై డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్ సేల్స్ లో హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్లు మరియు ఇతర ఆడియో ఉత్పత్తులపై డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల నుండి వైర్డు హెడ్‌ఫోన్‌ల వరకు ఈ వారం గ్రాండ్ గాడ్జెట్స్ డేస్ సేల్స్ లో మీరు ఏవైనా హెడ్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరతో పొందవచ్చు. ఈ సేల్స్ లో శామ్‌సంగ్, బోట్, ఫిలిప్స్ మరియు ఇతర సంస్థల ప్రముఖ సౌండర్‌ హెడ్‌ఫోన్‌లపై గొప్ప డిస్కౌంట్ లను అందిస్తున్నాయి.

ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా మొబైల్ చందాదారులకు బ్యాడ్ న్యూస్

టాబ్లెట్‌ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్స్ డేస్ 2020 సేల్స్ సందర్భంగా ఆండ్రాయిడ్ ఆధారిత ఎంట్రీ లెవల్ ఆల్కాటెల్ 3T టాబ్లెట్‌ను రూ.8,999 (MRP రూ.11,999) ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ టాబ్లెట్ వై-ఫై మరియు 4G కనెక్టివిటీ రెండింటికి మద్దతు ఇస్తుంది. ఈ అమ్మకంలో హానర్ ప్యాడ్ 5, హువాయి M5 లైట్, లెనోవా టాబ్ 4, శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ A 8.0 మరియు హానర్ మీడియాప్యాడ్ T3 వంటి వాటి మీద గొప్ప డిస్కౌంట్లు ఉన్నాయి.

స్మార్ట్‌వాచ్‌ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్స్ డేస్ 2020 సేల్స్ సందర్భంగా స్మార్ట్‌వాచ్‌ల కొనుగోలు మీద 50 శాతం వరకు తగ్గింపును ఇస్తున్నది. ఆపిల్ వాచ్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌ను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ వినియోగదారులు 4,000 రూపాయల ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్స్ లో ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన పేమెంట్స్ పద్ధతులతో నో-కాస్ట్ EMI ఎంపికను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.

ఆపిల్ వాచ్‌లో డెలిట్ చేసిన యాప్‌లను తిరిగి ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

డెస్క్‌టాప్‌ ఆఫర్స్

మీరు క్రొత్త ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌ను చూస్తుంటే ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్స్ డేస్ సేల్స్ లో ఎంచుకున్న ల్యాప్‌టాప్‌లు మరియు డెస్క్‌టాప్‌లపై 40 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. వీటిలో రోజువారీ ఉపయోగం కోసం సన్నని మరియు తేలికపాటి ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ ల్యాప్‌టాప్‌లు మరియు ఎంచుకున్న డెస్క్‌టాప్ మోడళ్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యొక్క సేల్స్ పేజీలోని అన్ని ఆఫర్‌లను మీరు చూడవచ్చు.

Most Read Articles

Best Mobiles in India
Read More About: news technology flipkart gadgets

Have a great day!
Read more...

English Summary

Flipkart Grand Gadgets Days 2020 Sales: Everything You Should Know