ఆండ్రాయిడ్ క్యూ విడుదలైంది, డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ ప్రాసెస్ మీకోసం

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ త‌న నూత‌న ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆండ్రాయిడ్ క్యూ (Q)ను విడుదల చేసింది. గూగుల్ I/O 2019 డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఆండ్రాయిడ్ 10 క్యూ రిలీజైంది. గూగుల్ Android Qలో సరికొత్త


సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ త‌న నూత‌న ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆండ్రాయిడ్ క్యూ (Q)ను విడుదల చేసింది. గూగుల్ I/O 2019 డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఆండ్రాయిడ్ 10 క్యూ రిలీజైంది. గూగుల్ Android Qలో సరికొత్తగా ఫీచర్స్ ఉన్నాయి. స్మార్ట్ రిప్లై, స్మార్ట్ సజెషన్స్, లైవ్ క్యాప్షన్, డిజిటల్ వెల్‌బీయింగ్, డార్క్ థీమ్ లాంటి ప్రత్యేకతలతో పాటు కొత్త ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ లో సిస్టమ్ వైడ్ డార్క్ థీమ్‌ను కూడా ఇచ్చారు. దీంతో పాటు ఆండ్రాయిడ్ క్యూ 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ క్యూ బీటా వర్షన్ గూగుల్ ఫోన్లల్లో లభిస్తుంది.
Android Qకు ప్రస్తుతం అర్హత పొందిన ఫోన్ల లిస్ట్

Advertisement


Asus ZenFone 5Z, Essential Phone, Huawei Mate 20 Pro, LG G8 ThinQ, Nokia 8.1, OnePlus 6, OnePlus 6T, OnePlus 7 series, Oppo Reno, Realme 3 Pro, Sony Xperia XZ3, Tecno Spark 3 Pro, Vivo X27, Vivo Nex S, Vivo Nex A, Xiaomi Mi 9 and the Xiaomi Mi Mix 3 5G, Pixel, Pixel XL, Pixel 2, Pixel 2 XL, Pixel 3, Pixel 3 XL, Pixel 3a, Pixel 3a XL.

డౌన్‌లోడ్ ఇలా

మీ ఫోన్ పైన చెప్పిన వాటిల్లో ఉంటే మీరు ఆండ్రాయిడ్ క్యూ బీటా వర్షన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ పిక్సెల్ ఫోన్ యూజర్లకు ఆటోమేటిగ్గా అప్‌డేట్ నోటిఫికేషన్ వస్తుంది. నాన్-గూగుల్ ఫోన్స్ అయితే ఆండ్రాయిడ్ డెవలపర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆండ్రాయిడ్ డెవలపర్ వెబ్‌సైట్‌ https://developer.android.com/preview/devicesలోకి వెళ్లండి. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లాక స్క్రోల్ డౌన్ చేసి మీ దగ్గర ఉన్న ఫోన్ ఏదో చెక్ చేసి చూడండి. అక్కడ కనిపించే 'Get the Beta' బటన్‌పైన క్లిక్ చేయండి.

Advertisement
వన్ ప్లస్ ఫోన్ వినయోగదారులయితే

మీరు ఎన్‌రోల్ చేసిన తర్వాత మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. అక్కడ కనిపించే సూచనలను ఫాలో అవుతూ మీరు దాన్ని ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్ ప్లస్ ఫోన్ వినయోగదారులయితే Settings > System > System Updates > Click top right icon > Local upgrade > Click on the corresponding installation package > upgradeలోకి వెళ్లండి. ఈ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత మీ మొబైల్ రీస్టార్ట్ చేయండి. ఆండ్రాయిడ్ క్యూ ఇన్ స్టాల్ అవుతుంది.

స్పెషల్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ క్యూలో ఫేస్ రిక‌గ్నిష‌న్‌కు మ‌రింత సెక్యూరిటీని జోడించారు. దీని వ‌ల్ల యూజ‌ర్‌కు చెందిన ఫొటో కాకుండా ముఖాన్ని స్కాన్ చేస్తేనే డివైస్ అన్‌లాక్ అవుతుంది. అలాగే ఆండ్రాయిడ్ క్యూ ఓఎస్‌లో సిస్ట‌మ్ లెవ‌ల్ స్క్రీన్ రికార్డింగ్ ఫీచ‌ర్‌ను అందివ్వ‌నున్నారు. ఇక ప‌వ‌ర్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేయ‌డం ద్వారా ఎమ‌ర్జెన్సీ కాల్స్ చేసుకునే విధంగా సిస్ట‌మ్ యూఐ ని తీర్చిదిద్దారు. దీంతోపాటు ఫోన్‌లో ఉండే సెన్సార్ల‌ను ఆన్‌/ఆఫ్ చేసుకునే విధంగా ఫీచ‌ర్ ఇవ్వ‌నున్నారు. అలాగే నోటిఫికేష‌న్ల‌ను పూర్తిగా బ్లాక్ చేయ‌డం లేదా సైలెంట్ గా షో చేసే విధంగా సెట్ చేసుకునే ఫీచ‌ర్ల‌ను ఆండ్రాయిడ్ క్యూ ఓఎస్‌లో అందివ్వ‌నున్నారు.

Enhanced PiP mode

నోటిఫికేష‌న్ల‌ను పూర్తిగా బ్లాక్ చేయ‌డం లేదా సైలెంట్ గా షో చేసే విధంగా సెట్ చేసుకునే ఫీచ‌ర్ల‌ను ఆండ్రాయిడ్ క్యూ ఓఎస్‌లో అందివ్వ‌నున్నారు. కొత్త ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ లో సిస్టమ్ వైడ్ డార్క్ థీమ్‌ను ఇవ్వ‌నున్నారు. కాగా ఇప్పటికే డార్క్ మోడ్ ధీమ్ లో పలు రకాల ఫీచర్లను అందించిన సంగతి తెలిసిందే.

More permissions

ఈ ఫీచర్ ద్వారా మీరు గూగుల్ క్లిప్ బోర్డులో ఏం యాప్స్ సేవ్ చేసుకోవాలనే విషయం అడుగుతుంది. తద్వారా మీరు మీకు నచ్చిన యాప్స్ ఇందులో సేవ్ చేసుకోవచ్చు.ఆండ్రాయిడ్ క్యూ ఓఎస్‌లో సిస్ట‌మ్ లెవ‌ల్ స్క్రీన్ రికార్డింగ్ ఫీచ‌ర్‌ను అందివ్వ‌నున్నారు. ఇక ప‌వ‌ర్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేయ‌డం ద్వారా ఎమ‌ర్జెన్సీ కాల్స్ చేసుకునే విధంగా సిస్ట‌మ్ యూఐ ని తీర్చిదిద్దారు. దీంతోపాటు ఫోన్‌లో ఉండే సెన్సార్ల‌ను ఆన్‌/ఆఫ్ చేసుకునే విధంగా ఫీచ‌ర్ ఇవ్వ‌నున్నారు.

Best Mobiles in India

English Summary

How to install Android Q on your smartphone right now