జియో దెబ్బ, ఇంటర్నెట్‌ని భారతీయులు పరుగులు పెట్టిస్తున్నారు


ఇండియాలో 4జీ పుణ్యమా అని ఇంటర్నెట్ వాడకం శృతిమించిపోతోంది. ఇండియాలోని వినియోగదారులు ఇంటర్నెట్ వాడకంలో ఏకంగా అమెరికాను మించిపోయారు. యూజర్‌ బేస్‌లో ప్రపంచవ్యాప్తంగా 12 శాతం వాటాతో ఇండియా ఏకంగా 2వ స్థానంలో ఉందని '2019 మారీ మీకర్‌’ రిపోర్ట్‌ ద్వారా వెల్లడైంది.

Advertisement

చైనా 21 శాతం వాటాతో ప్రపంచంలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించగా అమెరికా యూజర్‌ బేస్‌ 8 శాతంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. ఇంటర్‌నెట్‌ ట్రెండ్స్‌పై ఈ నివేదిక రూపొందగా.. అమెరికా వెలుపల జరిగిన అత్యంత వినూత్నమైన ఇంటర్‌నెట్‌ కంపెనీగా 'రిలయన్స్‌ జియో’ చరిత్ర సృష్టించింది. ఈ కంపెనీ చొరవతోనే భారత్‌లో ఇంటర్‌నెట్‌ వినియోగం గణనీయంగా పెరిగినట్లు 2019 మారీ మీకర్‌’ రిపోర్‌ పేర్కొంది.

Advertisement

ప్రపంచ జనాభాలో ఇది సగానికి కంటే ఎక్కువ

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 380 కోట్ల మందికి చేరింది. కాగా ప్రపంచ జనాభాలో ఇది సగానికి కంటే ఎక్కువ. నెట్‌ వినియోగదారుల సంఖ్య స్థిరంగా పెరుగుతున్నా, గతంతో పోలిస్తే వృద్ధి నెమ్మదిస్తోంది. 2016తో పోలిస్తే, 2017లో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య ఏడు శాతం వృద్ధి చెందగా, 2018లో వృద్ధి ఆరు శాతానికి పరిమితమైంది.

అవమానించే కంటెంట్‌పై సెన్సార్‌షిప్‌

ప్రపంచ ఇంటర్నెట్‌ వినియోగదారులలో చైనా వాటా 21 శాతం కాగా, భారత వినియోగదార్ల వాటా 12 శాతం ఉంటే.. అగ్రరాజ్యం అమెరికాలో ఇంటర్నెట్ వాడకం దారులు 8 శాతం మంది ఉన్నారు.

ఇంటర్నెట్‌పై అమలులో ఉన్న నియంత్రణ భారత్‌లో మధ్యశ్రేణిలో ఉంటాయని మేరీ మీకర్ తన నివేదికలో పేర్కొంది. అవమానించే కంటెంట్‌పై సెన్సార్‌షిప్‌ ఉంటుందని తెలిపింది.

 

రిలయన్స్ జియోకు అత్యధిక చందాదారులు

ఈ ఘనత దక్కడంలో, అధికవేగం డేటా సేవల (4జీ)ను, తక్కువ ధరల్లో అందుబాటులోకి తెచ్చిన రిలయన్స్‌ జియో పాత్ర ఎంతో కీలకం అని తేలింది. ఉచిత కాల్స్‌, డేటాకు తక్కుధ రుసుములు వసూలు చేయడంతో, ఏడాది లోపే రిలయన్స్ జియోకు అత్యధిక చందాదారులు జత కలిశారు. అంతే కాదు రిలయన్స్ జియో సాయంతో డేటా వినియోగం రెండింతలైంది.

జియో స్టోర్లను

తమ ఆన్‌లైన్‌ పోర్టల్‌ నుంచి సరుకు చేరవేసేందుకు, వస్తువుల సమీకరణకు కేంద్రాలుగా జియో స్టోర్లను వినియోగించుకోవాలన్నది రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రణాళికగా తెలుస్తోంది. మొత్తం 95 శాతం జనాభాకు చేరువ కావాలన్నది రిలయన్స్ ఆశయంగా పెట్టుకుంది. రిలయన్స్ ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లు 11 వేలు ఉన్నాయి. వీటిలో ఐదు వేల నగరాల పరిధిలో 5100కి పైగా జియో పాయింట్ స్టోర్లుగా వినియోగిస్తోంది.

Best Mobiles in India

English Summary

India Now Has 12% Of The World’s 3.8 Bn Internet Users: Mary Meeker