Home
News

మోటోరోలా ఫోల్డింగ్‌ ఫోన్లు Razr 40, ఆల్ట్రా విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు

Motorola Razr 40 మరియు Motorola Razr 40 ఆల్ట్రా విడుదల అయ్యాయి. ఊహించినట్లుగానే అద్భుతమైన డిజైన్‌, మెరుగైన ఫీచర్లతో లాంచ్‌ అయ్యాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా 144Hz రీఫ్రెష్‌ రేట్ 6.9 అంగుళాల OLED LTPO ఫోల్డింగ్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌ ధరలు, ఇతర స్పెసిఫికేషన్ల వివరాలు మీకోసం.

మోటోరోలా Razr 40 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13పై పనిచేస్తుంది. 6.9 అంగుళాల (1080*2640) pOLED ఫోర్టబుల్‌ డిస్‌ప్లే... 165Hz రీఫ్రెష్‌ రేట్‌ మరియు 1200 nits బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. HDR10+ సపోర్ట్‌ చేస్తుంది. మరియు 3.6 అంగుళాల ఔటర్‌ కవర్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఈ ఔటర్‌ డిస్‌ప్లేలో వాతావరణ సహా ఇతర నోటిఫికేషన్లు కనిపిస్తాయి. మరియు ఈ ఫోల్డింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8+ జెన్‌ 1 SoC ఆధారంగా పనిచేస్తుంది.

Motorola Foldable phones

మోటోరోలో Razr 40 ఆల్ట్రా డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ 12MP మెయిన్ సెన్సార్‌ కెమెరా మరియు 13MP సెకండరీ ఆల్ట్రావైడ్ యాంగిల్‌ సెన్సార్‌ కెమెరాలు కలిగి ఉంటుంది. మరియు ఫోన్ ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌ 3800mAh బ్యాటరీ సామర్థ్యంతో రానుంది. 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.

మోటోరోలా Razr 40 స్మార్ట్‌ఫోన్‌ కూడా ఆల్ట్రా మాదిరిగానే సాఫ్ట్‌వేర్‌, డిస్‌ప్లేలను కలిగి ఉంటుంది. కానీ ఈ ఫోన్‌ స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 1 SoC ఆధారంగా పనిచేస్తుంది. Razr 40 డ్యూయర్‌ కెమెరాలను కలిగి ఉంది. 64MP ప్రైమరీ సెన్సార్‌ మరియు 12MP ఆల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఫోన్‌ ముందువైపు 32MP కెమెరాను ఏర్పాటుచేశారు. మరియు ఈ ఫోన్‌ 4200mAh బ్యాటరీ సామర్థ్యం మరియు 30W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్లను ప్రస్తుతం చైనాలో లాంచ్‌ చేశారు. త్వరలోనే భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్‌లోకి విడుదల కానుందని సమాచారం. మోటోరోలా Razr 40 ఆల్ట్రా ఫోన్‌ 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ ధర CNY 5,699 (భారత కరెన్సీలో రూ.66,000), 12GB ర్యామ్‌, 512GB అంతర్గత స్టోరేజీ ధర CNY 6,399 (భారత కరెన్సీలో 74,200) కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఫెంగ్యా బ్లాక్‌, ఐస్‌ క్రిస్టల్‌ బ్లూ, మెజెంటా షేడ్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

మోటోరోలా Razr 40 ఫోల్డింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీ ధర ధర CNY 3,999 (భారత కరెన్సీలో రూ.46,000), 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ ధర CNY 4,299 (భారత కరెన్సీలో రూ.49,000), 12GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ ధర CNY 4,699 (భారత కరెన్సీలో రూ.54,500)కు కొనుగోలు చేయవచ్చు. అజుర్‌ గ్రే, చెర్రీపౌడర్‌, బ్రైట్‌ మూన్‌ వైట్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Motorola entered into Foldable phone market with its Razr 40, Razr 40 ultra launched in china
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X