Home
News

ఆకాశం నుండి భూమిపై పడ్డ వింత వస్తువు.సైంటిస్ట్ లు ఏంచెబుతున్నారు? 

By Maheswara

ఈ 2020 సంవత్సరం లో భూమి ఎన్నో వింతలు విద్వంసాలు జరుగుతున్నాయి. సంవత్సరం మొదలు అయినప్పటి నుండి కూడా మీరు గమనించే ఉంటారు.అలాంటిదే రెండు రోజుల ముందు కూడా మన దేశంలో రాజస్థాన్ లో జరిగింది.రాజస్థాన్ లోని సంచోరే టౌన్ లో హఠాత్తుగా ఆకాశం నుండి పెద్ద శబ్దం చేస్తూ ఒక వింత వస్తువు ఊడిపడింది.

ప్రాథమిక సమాచారం

ప్రాథమిక సమాచారం

అక్కడి స్థానిక ప్రజలు అదేంటో తెలియక వెంటనే దగ్గర్లో ని ప్రభుత్వ అధికారులకు ,పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు.అధికారులు నమోదు చేసిన ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ వస్తువు 2.78 కేజీ బరువుతో ఉంది, మరియు చాలా పెద్ద శబ్దం చేస్తూ ఆకాశం నుండి పడింది, దాని శబ్దం దాదాపు 3 కిలోమీటర్ల వరకు వినిపించిందని సమాచారం.

స్థానిక మేజిస్ట్రేట్ మరియు పోలీస్ అధికారులు

స్థానిక మేజిస్ట్రేట్ మరియు పోలీస్ అధికారులు

భూమి పై పడ్డ స్థలం లో ఒక అడుగు లోతున గొయ్యి ఏర్పడింది.అంతే కాక అది పడేటప్పుడు పెద్ద పేలుడు వచ్చినప్పుడు వచ్చే శబ్దం లాంటిది వచ్చిందని స్థానికులు వివరించారు. స్థానిక మేజిస్ట్రేట్ మరియు పోలీస్ అధికారులు అక్కడికి చేరుకునే టప్పటికి ఆ వస్తువు ఇంకా వేడిగా పొగలు కక్కుతూ ఉంది.అది చల్లారేంతవరకు ఉంది దాని ప్యాక్ చేసి దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.

ప్రైవేట్ ల్యాబ్ లో టెస్ట్ చేసిన రిపోర్ట్ ల ప్రకారం

ప్రైవేట్ ల్యాబ్ లో టెస్ట్ చేసిన రిపోర్ట్ ల ప్రకారం

స్థానిక ప్రైవేట్ ల్యాబ్ లో టెస్ట్ చేసిన రిపోర్ట్ ల ప్రకారం అది ఒక ఉల్కా కు సంబందించిన ముక్క అని, అందులో  జెర్మేనియం ,ప్లాటినం ,నికెల్ మరియు ఐరన్ లోహల మిశ్రమాలు కలయిక తో ఉందని తెలిపారు.దీని విలువ కొన్ని కోట్లరూపాయలు ఉండవచ్చు.ఇంకా పైఅధికారుల ,సైంటిస్ట్ లు పరిశీలించి రిపోర్టులు వెలువరించాలి అని తెలిపారు.

అహ్మదాబాద్ లో ని భౌగోళిక సర్వే ఆఫీస్

అహ్మదాబాద్ లో ని భౌగోళిక సర్వే ఆఫీస్

అహ్మదాబాద్ లో ని భౌగోళిక సర్వే ఆఫీస్ లో ని అధికారులతో మాట్లాడిన తర్వాత ఆ వస్తువును ఇంకా టెస్టులు చేయాల్సి ఉందని తెలిపారు .ప్రస్తుతానికి ఆ వస్తువు స్థానికంగా ఉన్నా సంచోరే పోలీస్ స్టేషన్ లోనే ఉందని తెలియచేసారు.
దీని పై మరింత సమాచారం అందిన వెంటనే తెలియచేస్తాము.

Best Mobiles in India

English summary
mysterious object fell from sky in Rajasthan,what scientists are telling 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X