వన్ ప్లస్ సర్వీసింగ్ సెంటర్లలో వన్ ప్లస్ కాఫీ ఎక్సపీరియెన్స్ అదేంటో తెలుసుకోండి


ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ పాడైపోయినప్పుడు ఏ సర్వీస్ సెంటర్ కి వెళ్లిన ఫోన్ సర్వీస్ బాగానే చేస్తారు కానీ అక్కడ గంటా లేదా రెండు గంటలు వేచి ఉండాలి అంటే బోర్ కొడుతుంటుంది .ఈ నేపథ్యంలో వన్ ప్లస్ సంస్థ వారి వినియోగదారులను సంతృప్తి చెందడానికి ఒక సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది.

వన్ ప్లస్ కాఫీ ఎక్సపీరియెన్స్ అనే కొత్త కాన్సెప్ట్ ను ప్రవేశ పెట్టింది.ఫోన్ తో ఏమైనా ప్రాబ్లెమ్ వచ్చి ఒక్కసారి వన్ ప్లస్ సర్వీస్ సెంటర్ కి వెళ్లి వస్తే చాలు మీకు ఓ సరికొత్త అనుభూతిని అందించబోతుంది.

ఒక గంట లోపు సర్వీస్....

ఒక వేల మీరు సర్వీస్ సెంటర్ కి వెళ్లి మీ వన్ ప్లస్ ఫోన్ ను రిపేర్ చేయించుకోవాలంటే ఒక గంట లోపు సర్వీస్ చేసి తిరిగి ఇచ్చేస్తారు.

బోర్ కొట్టకుండా...

ఒక గంట సర్వీస్ సెంటర్ లో ఉండాలి అన్నకూడా బోర్ కొడుతుంది అయితే దానికి చెక్ పెట్టేందుకు వన్ ప్లస్ సంస్థ ఒక సరి కొత్త ఆలోచనతో ముందుకి వచ్చింది.మీరు రిలాక్స్ అవ్వడానికి కాఫీ, కాలిగా ఉండకుండా చదువుకోవడానికి బుక్స్ ,బోర్ కొడితే స్పెషల్ రిక్రియేషన్ రూమ్స్ లో ఆడుకోవడానికి గేమ్స్ అలాగే వినడానికి మంచి మ్యూజిక్ సిస్టం ను సర్వీస్ సెంటర్ లో అందిస్తుంది.

ఫ్రీ పిక్ అప్ మరియు డ్రాప్ సర్వీస్....

మీ వన్ ప్లస్ ఫోన్ ప్రాబ్లెమ్ వచ్చినప్పుడు ఒక్కసారి వన్ ప్లస్ సర్వీస్ సెంటర్ కి కాల్ చేస్తే చాలు మీరు చెప్పిన లొకేషన్ కి వచ్చి ఫోన్ తీసుకొని వెళ్లి రిపేర్ చేయించి తిరిగి మీరు చెప్పిన ప్రదేశానికి వచ్చి ఫోన్ డెలివరీ చేస్తారు.

 

 

ప్రస్తుతం ఈ సర్వీస్ సెంటర్లు...

ప్రస్తుతానికి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పూణే మరియు ఢిల్లీలతో పాటు దేశవ్యాప్తంగా 16 వన్ ప్లస్ సర్వీస్ సెంటర్స్ కలిగి ఉన్నాయి .

మరో రెండు సెంటర్లు ...

బెంగుళూరు మరియు జైపూర్లలో వారాంతానికి మరో రెండు సర్వీస్ సెంటర్లు రాబోతున్నాయి.దీంతో మొత్తం 18 వన్ ప్లస్ సర్వీస్ సెంటర్లలో సేవలు అందించనున్నాయి.


ONEPLUS ONE

Have a great day!
Read more...

English Summary

OnePlus Exclusive Service Centres: Premium smartphone users deserve premium service support.To Know More About Visit telugu.gizbot.com