స్మార్ట్ టీవీల విభాగంలోకి OnePlus, మార్కెట్ వేడెక్కబోతోందా..?

లీడింగ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటైన వన్‌ప్లస్ (OnePlus), 2013లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ సంస్థను పీట్ లావు (సీఈఓ), కార్ల్ పీ అనే ఇద్దరు వ్యక్తులు ప్రారంభించారు.


లీడింగ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటైన వన్‌ప్లస్ (OnePlus), 2013లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ సంస్థను పీట్ లావు (సీఈఓ), కార్ల్ పీ అనే ఇద్దరు వ్యక్తులు ప్రారంభించారు. స్మార్ట్‌ఫోన్‌లో విభాగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఈ బ్రాండ్ యాపిల్, సామ్‌సంగ్ వంటి దిగ్గజ బ్రాండ్‌లకు సవాళ్లను విసరుతోంది. స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ చైనా దిగ్గజం ఇతర టెక్నాలజీ సెగ్మెంట్‌లలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలిని చూస్తోంది.

Advertisement

‘నెవర్ సెటిల్’ అనే ట్యాగ్‌లైన్‌తో

వన్‌ప్లస్ సంస్థల సీఈఓ పీట్ లావు (Pete Lau) కంపెనీ అఫీషియల్ ఫోరమ్ ద్వారా రివీల్ చేసిన వివరాల ప్రకారం వన్‌ప్లస్, స్మార్ట్‌టీవీల విభాగంలోకి వ్యాపారంలోకి అడుగుపెట్టబోతోంది. ‘నెవర్ సెటిల్' అనే ట్యాగ్‌లైన్‌తో టెక్ ప్రియులను ఆకర్షిస్తోన్న వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు వివిధ వెరైటీలలో హెడ్‌ఫోన్స్, మొబైల్ ఫోన్ యాక్సెసరీస్, బ్యాక్‌ప్యాక్స్, క్యాప్స్ ఇంకా టీషర్ట్స్‌ను మార్కెట్లో ఆఫర్ చేస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి వన్‌ప్లస్ టీవీ కూడా చేరబోతోంది.

 

 

Advertisement
2014లో భారత్‌లోకి..

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వన్‌ప్లస్ 2014లో అడుగుపెట్టింది. ఇదే ఏఢాది ఫిన్ ల్యాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హాంకాంగ్, హంగేరీ, యూకే వంటి యూరోపియన్ దేశాల్లోనూ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. వన్‌ప్లస్ తొలత తన స్మార్ట్‌ఫోన్‌లను ఇన్విటేషన్ పద్థతిలో విక్రయించింది. ఆ తరువాత నుంచి ఫ్లాష్‌సేల్ పద్థతిలో తన స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించటం మొదులు పెట్టింది. మిడ్ రేంజ్ బడ్జెట్‌లో ఈ బ్రాండ్ నుంచి లాంచ్ అయిన హై-ఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు భారత్‌తో పాటు ప్రపంచమార్కెట్లలో ప్రశంసలు లభించాయి. ఐడీసీ లెక్కల ప్ర్రకారం 2017 నాలుగవ క్వార్టర్‌కు గాను 47శాతం ఆండ్రాయిడ్ మార్కెట్ షేర్‌ను వన్‌ప్లస్ సొంతం చేసుకుంది.

 

 

అత్యాధునిక టెక్నాలజీతో..

స్మార్ట్ టీవీలకు మార్కెట్లో అంతకంతకు డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో వన్‌ప్లస్‌ తన స్మార్ట్‌టీవీ లైనప్‌ను అత్యాధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. తాము పరిచయం చేయబోతోన్న స్మార్ట్‌టీవీ టెక్నాలజీ తదుపరి లెవల్ ఇంటెలిజెంట్ కనెక్టువిటీతో, బెస్ట్ క్వాలిటీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రొవైడ్ చేయగలుగుతుందని పీట్ లాయు తెలిపారు.

 

 

కొత్త లెవల్ ఇమేజ్ క్వాలిటీ ఇంకా ఆడియో ఎక్స్‌పీరియన్స్..

ప్రీమియమ్ ఫ్లాగ్‌షిప్ డిజైన్‌తో తాము అభివృద్థి చేస్తోన్న కొత్త ప్రొడక్ట్ ఇమేజ్ క్వాలిటీ ఇంకా ఆడియో ఎక్స్‌పీరియన్స్ పరంగా కొత్త అనుభూతులను పంచబోతోందని పీట్ లాయు తన పోస్టులో పేర్కొన్నారు. తమ స్మార్ట్‌టీవీల ద్వారా బెస్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రొవైడ్ చేసే క్రమంలో తమ టీమ్ ఇంకా కమ్యూనిటీ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, డిజైన్ ఇంకా ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ విభాగాల్లో అనేక కొత్త విషయాలను తెలుసుకోగలిగిందని ఆయన తెలిపారు.

 

 

అఫీషియల్ ఫోరమ్‌ సపోర్టుతో ముందుకు..

వన్‌ప్లస్ అఫీషియల్ ఫోరమ్‌కు 50 లక్షలకు పైగా సబ్‌స్ర్కైబర్ బేస్ ఉండటంతో కొత్త ఉత్పత్తులకు సంబంధించిన సజెషన్స్ అలానే ఫీడ్‌బ్యాక్స్‌ను యూజర్స్ వద్ద నుంచే కంపెనీ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో OxygenOS పై బిల్ట్ చేయబోతోన్న స్మార్ట్‌టీవీలకు సంబంధించి పేర్లను ఎంపిక చేసే క్రమంలో సరికొత్త కాంటెస్ట్‌లను కూడా వన్‌ప్లస్ నిర్విహిస్తోంది. వన్‌ప్లస్ అఫీషియల్ ఫోరమ్‌ సభ్యులు ఈ టీవీ ప్రొడక్టుకు సంబంధించి ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నట్లయితే అక్టోబర్ 17లో వాటిని సబ్మిట్ చేయవల్సి ఉంటుంది. వీటితో 10 బెస్ట్ సజెషన్స్‌ను ఎంపిక చేసి వారికి బుల్లెట్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను వన్ ప్లస్ బహుమతిగా ఇవ్వబోతోందట.

 

 

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెంట్ సపోర్టుతో...

AI/TV ఇంటిగిరేషన్‌తో కూడిన పలు స్మార్ట్ టీవీలను మార్కెట్లో మనం చూసాం. అమెజాన్ తన ఫైర్ ఎడిషన్ టీవీలను తోషిబా బిల్డ్ చేస్తోన్న విషయం తెలిసిందే. అలెక్సా వాయిస్ ఇంటిగ్రేషన్‌తో వస్తోన్న ఈ టీవీలను మరింత ఎఫెక్టివ్‌గా వినియోగించుకునే వీలుంటుంది. ఇదే సమయంలో కోమ్‌క్రాస్ట్ వంటి డివైస్‌లలో కూడా గూగుల్ అసిస్టెంట్ ఇంటిగ్రేట్ అయి వస్తోంది. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ కూడా తమ స్మార్ట్‌టీవీలలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లను నిక్షిప్తం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి ఆరంభ దశలో ఉండటంతో టీవీలకు సంబంధించి ఎటువంటి వివరాలను సంస్థ రివీల్ చేయలేదు.

Best Mobiles in India

English Summary

OnePlus has a new flagship killer for the TV industry.To Know More About Visit telugu.gizbot.com