మొబైల్ గేమర్స్‌కు గుడ్ న్యూస్, కొత్త వెర్షన్‌లో PUBG Mobile


గేమింగ్ విభాగంలో పెను సంచలనం రేపుతోన్న 'ప్లేయర్ అన్‌నౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్’ (పీయూబీజీ) సరికొత్త అప్‌డేట్‌ను అందుకోబోతోంది. ఈ గేమ్‌కు సంబంధించిన మొబైల్ వెర్షన్‌ను టెన్సెంట్ గేమ్స్ కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేయబోతోంది. కొత్త అప్‌డేట్‌లో భాగంగా Sanhok మ్యాప్ గేమ్‌లో యాడ్ కాబోతోంది. ఈ మ్యాప్ ఇప్పటికే ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ కోసం అభివృద్థి చేసిన పీయూబీజీ బేటా వెర్షన్‌లో లభ్యమవుతోంది.

కొత్త మ్యాప్‌ను యాడ్ చేసే క్రమంలో....

కొత్త మ్యాప్‌ను యాడ్ చేసే క్రమంలో సెప్టంబర్ 11 అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు గేమ్ మెయింటేనెన్స్‌లో ఉంటుందని టెన్సెంట్ గేమ్స్ నుంచి ఇప్పటికే యూజర్లకు నోటిఫికేషన్స్ అందాయి. Sanhok మ్యాప్‌తో కూడిన కొత్త వెర్షన్ సెప్టంబర్ 12వ తేదీ నుంచి యూజర్లకు అందుబాటులో ఉంటుంది.

ఇప్పటికే ఈ గేమ్‌కు సంబంధించిన పీసీ వెర్షన్‌...

ఇప్పటికే ఈ మ్యాప్‌ను గేమ్‌కు సంబంధించిన పీసీ వెర్షన్‌ అలానే ఎక్స్‌బాక్స్ వెర్షన్‌లలో టెన్సెంట్ గేమ్స్ అందుబాటులో ఉంచింది. ఈ కొత్త మ్యాప్ డిజైన్ గతంలో అందుబాటులో ఉన్న Erangel, Miramar మ్యాప్‌లతో పోలిస్తే మరింత చిన్నగానే ఇదే సమయంలో ఫాస్ట్ పేసుడ్ గేమ్‌ ప్లేను ఆఫర్ చేస్తుందట.

అధునాతన వెపన్స్‌తో పాటు రెండు సరికొత్త వెహికల్స్‌ను కూడా....

అధునాతన వెపన్స్‌తో పాటు రెండు సరికొత్త వెహికల్స్‌ను కూడా ఈ మ్యాప్‌లో యాడ్ చేసినట్లు టెన్సెంట్ గేమ్స్ వెల్లడించింది. మ్యాప్‌లో యాడ్ అయిన అధునాత వెపన్స్‌లో QBZ అనే ఆటోమెటిక్ రైఫిల్‌తో పాటు ఫ్లేర్ గన్ అందుబాటులో ఉంటుంది. ప్లేయర్స్ వీటిని బ్యాటిల్ గ్రౌండ్స్‌లో వినియోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఇక వెహికల్స్ విషయానికి వచ్చేసరికి బుల్లెట్‌ప్రూఫ్ UAZ వెహికల్‌లో నలుగురు ప్లేయర్స్ ఒకేసారి కూర్చొని ప్రయాణించే వీలుంటుందట. ఇక రెండవ వెహికల్ అయిన మజిల్ కార్ హార్డ్-టాప్‌తో కన్వర్టబుల్ వెర్షన్స్‌లో లభ్యమవుతుంది. ఈ కారులో కూడా నలుగురు ప్లేయర్స్ ప్రయాణించవచ్చట.


Samsung Galaxy A3

Have a great day!
Read more...

English Summary

PUBG Mobile will soon get Sanhok map, new weapons, and vehicles.To Know More About Visit telugu.gizbot.com