రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లను వాడేవారికి గొప్ప శుభవార్త!!!!


రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్న వారికి కంపెనీ ఇప్పుడు మరొక మంచి శుభవార్తను అందిస్తున్నది. త్వరలో రియల్‌మి యొక్క అన్ని స్మార్ట్‌ఫోన్‌లకు VoWiFi లేదా Wi-Fi కాలింగ్ మద్దతును క్రమ క్రమంగా ఒకదాని తరువాత మరొక దానికి అందివ్వనున్నది. ఈ నెలలోనే కొత్త అప్‌డేట్ రియల్‌మి X2 ప్రో ద్వారా ప్రారంభమవుతుందని కంపెనీ CEO మాధవ్ శేత్ తెలిపారు.

Advertisement

VoWiFi లేదా Wi-Fi కాలింగ్ మద్దతు

VoWiFi లేదా Wi-Fi కాలింగ్ మద్దతు రియల్‌మి X2 ప్రోతో ప్రారంభించి మిగిలిన అన్ని రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లకు వై-ఫై కాలింగ్ సపోర్ట్ లభిస్తుందని CEO మాధవ్ షెత్ ధృవీకరించారు. ఇతర రియల్‌మి ఫోన్‌లు ఫిబ్రవరి మరియు మార్చిలో అప్‌డేట్ ను పొందనున్నాయి. ముందుగా ఫిబ్రవరి నెలలో రియల్‌మి ఎక్స్‌2, రియల్‌మి XT, రియల్‌మి X, రియల్‌మి 5 ప్రో, రియల్‌మి 3 ప్రో, రియల్‌మి 5, రియల్‌మి 5i, రియల్‌మి 5S స్మార్ట్‌ఫోన్‌లకు Wi-Fi కాలింగ్ మద్దతు విడుదల అవుతుంది. మార్చి నెలలో రియల్‌మి 2 ప్రో, రియల్‌మి U1, రియల్‌మి1, రియల్‌మి 2, రియల్‌మి 3, రియల్‌మి 3i, రియల్‌మి C1, రియల్‌మి C2 వంటి స్మార్ట్‌ఫోన్‌లకు కొత్త అప్‌డేట్ పొందనున్నది.

 

 

ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్స్ డేస్ 2020 సేల్స్.... ఆఫర్స్ చూడ తరమా....

Advertisement
రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ల VoWiFi అప్‌డేట్ లిస్ట్

జనవరి 2020

-Realme X2 Pro

ఫిబ్రవరి 2020

-Realme 5 Pro
-Realme 3 Pro
-Realme 5, 5i, 5s
-Realme X2
-Realme XT
-Realme X

 

 

బ్రహ్మాండమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఒప్పో F15 మొదటి సేల్స్

మార్చి 2020

-Realme 1
-Realme 2/C1
-Realme C2
-Realme 3/3i
-Realme 2 Pro
-Realme U1

క్వాల్కమ్ సమ్మిట్‌

ఇటీవల ఇండియాలో జరిగిన క్వాల్కమ్ సమ్మిట్‌లో రియల్‌మి సరికొత్త క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720G చిప్‌సెట్‌తో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన మొదటి సంస్థ అవుతుందని ప్రకటించింది. క్వాల్‌కామ్ న్యూ డిల్లీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక్కడ చిప్‌మేకర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 460, స్నాప్‌డ్రాగన్ 662 మరియు స్నాప్‌డ్రాగన్ 720G లతో సహా మూడు కొత్త మొబైల్ ప్లాట్‌ఫామ్‌లను ఆవిష్కరించింది.

 

 

ఆపిల్ వాచ్‌లో డెలిట్ చేసిన యాప్‌లను తిరిగి ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

VoWFii ఫీచర్

VoWFii లేదా వాయిస్ ఓవర్ Wi-Fi వినియోగదారులను Wi-Fi నెట్‌వర్క్‌ల ద్వారా కాల్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ కు ఎటువంటి ప్రత్యేకమైన యాప్ అవసరం లేదు. టెలికాం ఆపరేటర్ సర్వీసు అందుబాటులో ఉన్నందున అనుకూల ఫోన్‌లలో ఈ ఫీచర్ ను ఉపయోగించవచ్చు.

 

 

బడ్జెట్ ధరలో హువాయి 5G స్మార్ట్‌ఫోన్‌లు... త్వరలోనే అందుబాటులోకి

ఎయిర్‌టెల్ & జియో

గత నెలలో ఎయిర్‌టెల్ ఈ ఫీచర్ ను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది. ఇది మొదటిసారి డిల్లీ ఎన్‌సిఆర్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. తరువాత ముంబై, కోల్‌కతా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వంటి నగరాలలో కూడా ఈ ఫీచర్ ను తీసుకువచ్చింది. వాయిస్ ఓవర్ Wi-Fi ఇప్పుడు పాన్-ఇండియా ప్రాతిపదికన అందుబాటులో ఉంది. జియో కూడా ఈ నెల ప్రారంభంలో VoWiFi కాలింగ్ సేవను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. జియో వై-ఫై కాలింగ్ సేవకు 150 కి పైగా హ్యాండ్‌సెట్ మోడల్స్ మద్దతు ఇస్తున్నాయని ముంబైకి చెందిన టెల్కో పేర్కొంది.

Best Mobiles in India

English Summary

Realme Smartphones Get Wi-Fi Calling Feature