Jio,Airtel ‘వర్క్ @ హోమ్’ 4G వోచర్ ప్లాన్ లలో సరికొత్త మార్పులు...


COVID-19 యొక్క వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో అన్ని రకాల సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుండి పనిచేయమని ఆదేశించాయి. లాక్ డౌన్ మొదలయి ఇప్పటికే చాలా రోజులు అవుతుండడంతో చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడటంతో దశల వారిగా లాక్ డౌన్ ను ప్రభుత్వం ఎత్తివేయుచున్నారు.

Advertisement

రీఛార్జ్ ప్లాన్లు

ఇప్పటికి దేశంలో జోన్ ల వారీగా విడగొట్టి లాక్ డౌన్ ను ఎత్తివేశారు. ఇన్ని రోజులు ఇంటి వద్ద నుండి పనిచేయడానికి టెలికామ్ సంస్థలు తమ వినియోగదారులకు అన్ని ప్రతేకమైన ప్లాన్ లను కూడా ప్రకటించారు. ఈ రకమైన ప్లాన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నందు వలన వీటిని ఇప్పుడే రీఛార్జ్ చేసుకోవడం ఉత్తమం. ఇందుకంటే లాక్ డౌన్ పొడిగించడం మీద ఇంకా స్పష్టత లేనందున సంస్థలు అందించే ఈ ప్లాన్లు అందించే ప్లాన్లు ఎంతవరకు ఉంటాయో అన్న దాని మీద కూడా సందేహాలు ఉన్నాయి.   Netflix వినియోగదారులకు మరొక ఉచిత ఆఫర్!!!!

Advertisement
ఎయిర్‌టెల్,జియో

భారతి ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో తమ వినియోగదారులకు సంక్షోభం నుండి బయటపడటానికి వీలుగా ఇంటి వద్ద నుండి పనిచేసే వినియోగదారుల అవసరాలను తీర్చడానికి కొత్త ప్రణాళికలను ప్రవేశపెట్టారు. లాక్డౌన్లో ఉండటం అంటే ప్రజలు తమ ఇళ్లలో కూర్చుని తమ పనిని పూర్తి చేసుకోవాలి.  Redmi 10X series: షియోమి నుంచి 5G సపోర్ట్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు!!! ఫీచర్స్ అదుర్స్...

‘వర్క్ @ హోమ్’ 4G డేటా వోచర్లు

వినియోగదారులు వారి యొక్క పనిని పూర్తి చేయడానికి అధికంగా డేటాను వినియోగించవలసి ఉంటుంది. దీనితో పాటుగా వీడియోలను చూడడానికి మరియు ఆన్ లైన్ లో గేమ్ లను ఆడడానికి కూడా డేటాను వినియోగిస్తున్నారు. రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ రెండూ తమ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 50 జీబీ డేటా ప్రయోజనంతో వచ్చే 4G డేటా వోచర్‌లను ప్రవేశపెట్టాయి. ఈ డేటా వోచర్‌ల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

రిలయన్స్ జియో ‘వర్క్ @ హోమ్’ 4G డేటా వోచర్లు

లాక్ డౌన్ సమయంలో ‘వర్క్ @ హోమ్' పేరుతో రిలయన్స్ జియో కొత్తగా మూడు 4G డేటా వోచర్‌లను ప్రకటించింది. ఇందులో భాగంగా అత్యంత ఖరీదైన డేటా వోచర్ రూ.251 ధర వద్ద ఉంది. ఈ వోచర్ 50GB డేటా బెనిఫిట్‌తో వస్తుంది. ఇందులో రోజువారీ వాడకంలో ఎటువంటి క్యాప్ లు లేవు. ఇది 30 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ మీకు డేటా ప్రయోజనాలను తప్ప మీకు ఇతర ప్రయోజనాలను ఏవి అందించవు.

జియో డేటా వోచర్ ప్లాన్

రిలయన్స్ జియో ‘వర్క్ ఫ్రమ్ హోమ్' కేటగిరీ కింద మరో రెండు ప్లాన్‌లను కూడా అందిస్తోంది. వాటిలో చౌకైనది రూ.151 ప్లాన్. ఇది అపరిమిత 30GB డేటా ప్రయోజనంను 30 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తుంది. మూడవ డేటా వోచర్ ప్లాన్ 201 రూపాయల ధర వద్ద లభిస్తుంది. ఈ వోచర్‌తో మీకు 40GB అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్ లభిస్తుంది. ఇది కూడా ఇతర వోచర్‌ల మాదిరిగానే 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ రెండు వోచర్‌లు కూడా కేవలం డేటాను మాత్రమే అందిస్తుంది. Samsung Outdoor TV: కొత్త రకం స్మార్ట్ టీవీకి శ్రీకారం... ఇక మేడ మీద కూడా చూడవచ్చు

భారతీ ఎయిర్‌టెల్ ‘వర్క్ @ హోమ్’ప్లాన్

ప్రపంచ మహమ్మారి సమయంలో భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు 4G డేటా ప్రయోజనాలను అందించడంలో రిలయన్స్ జియోకు సమానంగా అందిస్తున్నది. ఇటీవల ఎయిర్‌టెల్ రూ.251 ధర వద్ద కొత్తగా 4G డేటా వోచర్‌ను ప్రకటించింది. ఈ వోచర్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు 50GB డేటా ప్రయోజనం లభిస్తుంది. ఇది కూడా రోజువారీ డేటా క్యాప్స్ లేకుండా యూజర్ యొక్క బేస్ ప్లాన్ చెల్లుబాటు కాలానికి ఉంటుంది.

ఎయిర్‌టెల్ రూ.251 డేటా వోచర్ లభ్యత

భారతి ఎయిర్‌టెల్ యొక్క రూ.251 డేటా వోచర్ రీఛార్జ్ ప్రస్తుతం పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే వంటి థర్డ్ పార్టీ రీఛార్జ్ పోర్టల్‌ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉందని గమనించండి. విచిత్రమేమిటంటే ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్, ఎయిర్‌టెల్.ఇన్ వెబ్‌సైట్ వంటి అధికారిక ఛానెల్‌ల ద్వారా రూ .251 రీఛార్జిని ఎయిర్‌టెల్ అనుమతించడం లేదు.

ఎయిర్‌టెల్ రూ.98 డేటా వోచర్

భారతీ ఎయిర్‌టెల్ గత కొన్ని రోజులుగా తన ఇతర 4 జి డేటా వోచర్‌లను కూడా అప్ డేట్ చేసింది. వాటిలో ఒకటి రూ .98 డేటా వోచర్. ఇది 6GB 4G డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందించేది. కానీ ఇప్పుడు రూ.98 డేటా వోచర్ 12GB డేటా ప్రయోజనాలతో వస్తుంది మరియు ప్లాన్ యొక్క చెల్లుబాటు యూజర్ యొక్క బేస్ ప్లాన్ లాగానే ఉంటుంది.

Best Mobiles in India

English Summary

Reliance Jio, Airtel Work From Home Plans: Offers and Data Benefits Details