జియో యానివర్సరీ ఆఫర్, ఉచిత డేటా,అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్..


సెప్టెంబర్ 2016లో కమర్షియల్‌గా కార్యకలాపాలు మొదలు పెట్టిన Reliance Jio తాజాగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.సెకండ్ యానివెర్సరీ సందర్బంగా యూజర్లకు వరాల జల్లు కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో Jio Celebrations Pack పేరిట తమ వినియోగదారులకు ఒక బహుమతిని తీసుకొని వచ్చింది. ఇప్పుడు జియో యూజర్ రూ.100 తో రీఛార్జి చేసుకుంటే నెలకు 42 జీబీ వరకు డేటా పొందే విధంగా ఏర్పాటు చేసింది.ఈ శీర్షిక లో జియో అందిస్తున్న ఈ స్పెషల్ ఆఫర్ యొక్క మరిన్ని విశేషాలు మీకు తెలుపుతున్నాము. ఓ లుక్కేయండి

రూ.399 ప్లాన్ లో...

ఈ ఆఫర్ జియో రూ.399 ప్లాన్ లో అందుబాటులో ఉంది

అపరిమిత వాయిస్ మరియు 42GB డేటా కోసం...

అపరిమిత వాయిస్ మరియు 42GB డేటా కోసం నెలకు రూ.100 చెల్లిస్తే చాలు. మరియు 126GB డేటా కోసం 3 నెలలకు గాను రూ.299 చెల్లిస్తే చాలు.

రూ.100 క్యాష్ బ్యాక్....

వినియోగదారులకు రూ.100 క్యాష్ బ్యాక్ లబిస్తుంది.ఈ డబ్బులు జీయో ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ లో 50 రూపాయలు,అలాగే ఫోన్ పే లో 50 రూపాయలు జమ అయిపోతుంది.

ఈ ప్లాన్ తో...

ఈ ప్లాన్ తో , వినియోగదారులు 3 నెలల వ్యవధిలో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 126GB మొత్తం డేటాను పొందుతారు.

MyJio యాప్...

చందాదారులు కంపెనీ అధికారిక MyJio యాప్ ఫోన్ పే ద్వారా రీఛార్జ్ చేయాలి.

సెప్టెంబర్ 12నుంచి సెప్టెంబర్ 21 వరకు....

సెప్టెంబర్ 12నుంచి సెప్టెంబర్ 21 ,2018 వరకు ఈ ఆఫర్ లభిస్తుంది .

ఒకసారి మాత్రమే రీడీమ్...

వినియోగదారులు జియో సంస్థ అందిస్తున్న ఆఫర్ ను ఒకసారి మాత్రమే రీడీమ్ చేయవచ్చు.

ఫోన్ పే ఖాతాకు 24 గంటల లోపు ..

ఈ 50 రూపాయల క్యాష్ బ్యాక్ యూజర్ యొక్క ఫోన్ పే ఖాతాకు 24 గంటల లోపు జమ చేయబడుతుంది .

మరొక యానివెర్సరీ ఆఫర్ లో...

మరొక యానివెర్సరీ ఆఫర్ లో , జీయో డైరీ మిల్క్ చాక్లెట్లతో ఉచిత 1GB 4G డేటాను అందిస్తోంది .

ఈ ఆఫర్ డైరీ మిల్క్...

ఈ ఆఫర్ డైరీ మిల్క్ ఫ్రూట్ అండ్ నట్, లిక్కబుల్స్, రోస్ట్ ఆల్మాండ్, క్రాకిల్ , రూ. 5, రూ .10, రూ .20, రూ .40 మరియు రూ .100 ల విలువతో పాటుగా కాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్లతో లభిస్తుంది.


Samsung Galaxy A3

Read More About: reliance jio news smartphones jio
Have a great day!
Read more...

English Summary

Reliance Jio's new anniversary offer; All you need to know.To Know More About Visit telugu.gizbot.com