Home
News

Tata Sky యూజర్లకు చేదు వార్త!!! ఈ ఛానెల్‌ ప్యాక్‌లను నిలిపివేస్తున్నారు...

భారతదేశంలో డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) రంగంలో అతి పెద్ద యూజర్ బేస్ ను కలిగి ఉన్న ఆపరేటర్ టాటా స్కై తన వినియోగదారులకు ఒక చేదు వార్తను ప్రకటించింది. ఈ ఆపరేటర్ హిందీ లైట్, బెంగాలీ లైట్ మరియు తెలుగు లైట్లతో కలుపుకొని మొత్తంగా 11 టాటా స్కై ప్యాక్‌లను 2020 డిసెంబర్ 19 నుండి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. టాటా స్కై వెబ్ పోర్టల్‌లోని సమాచారం ప్రకారం 11 టాటా స్కై ప్యాక్‌లకు చందాను కలిగి ఉన్న వినియోగదారులు ఆటోమ్యాటిక్ గా "సమీప ఫిట్ ప్యాక్" కి తరలించబడతారు అని పేర్కొంది. ఈ "సమీప ఫిట్" కస్టమ్ ప్యాక్‌లు ప్రస్తుతం అన్ని ఛానెల్‌లను కలిగి ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై నిలిపివేయబడే 11 ప్యాక్‌ల వివరాలు

టాటా స్కై నిలిపివేయబడే 11 ప్యాక్‌ల వివరాలు

టాటా స్కై 2020 డిసెంబర్ 19 నుండి నిలిపివేయబోయే 11 టాటా స్కై ప్యాక్‌లలో గుజరాతీ లైట్, గుజరాతీ లైట్ హెచ్‌డి, హిందీ బచాట్, హిందీ లైట్ హెచ్‌డి, హిందీ స్మార్ట్, కన్నడ లైట్, కన్నడ లైట్ ప్లస్ మరియు ఓడియా లైట్ హెచ్‌డి వంటివి చాలానే ఉన్నాయి. మిగిలిన వివరాలు కింద ఉన్న బాక్స్ లలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్యాక్‌లను వినియోగిస్తున్న చందాదారులు సమీప ఫిట్ ప్యాక్‌కు ఆటోమ్యాటిక్ గా తరలించబడతారు. ప్రస్తుతం వారు చూస్తున్న అన్ని ఛానెల్‌లకు యాక్సిస్ ను కలిగి ఉండడమే కాకుండా అదనంగా కొన్ని ఛానెళ్లకు యాక్సిస్ ను అందిస్తాయి. ఇందులోని ప్యాక్‌లను సవరించడానికి లేదా ఛానెల్‌లను జోడించడానికి / డ్రాప్ చేయడానికి టాటా స్కై మొబైల్ యాప్ లేదా టాటా స్కై వెబ్‌సైట్‌లో సెల్ఫ్‌కేర్‌ను ఉపయోగించి సులభంగా చేయవచ్చు.

 

టాటా స్కై యూజర్లను మళ్లించే కొత్త ప్యాక్‌ల వివరాలు

టాటా స్కై యూజర్లను మళ్లించే కొత్త ప్యాక్‌ల వివరాలు

టాటా స్కై 2020 డిసెంబర్ 19 నుండి నిలిపివేయబోయే ప్యాక్‌లలో ప్రస్తుతం బెంగాలీ లైట్ ప్యాక్‌కు సభ్యత్వం పొందిన వినియోగదారులు "సమీప ఫిట్" బెంగాలీ లైట్ న్యూ ప్యాక్‌కు తరలించబడతారని డిటిహెచ్ ఆపరేటర్ తెలిపింది. అలాగే గుజరాతీ లైట్ మరియు గుజరాత్ లైట్ హెచ్‌డి ప్యాక్‌లోని వినియోగదారులను వరుసగా గుజరాతీ లైట్ న్యూ మరియు గుజరాతీ లైట్ న్యూ హెచ్‌డి ప్యాక్‌లకు మళ్ళించబడతారు.

టాటా స్కై నియరెస్ట్ ఫిట్ ప్యాక్‌ల ఛానెల్‌ల వివరాలు

టాటా స్కై నియరెస్ట్ ఫిట్ ప్యాక్‌ల ఛానెల్‌ల వివరాలు

టాటా స్కై యొక్క వినియోగదారులలో ప్రస్తుతం హిందీ బచాట్, హిందీ లైట్ మరియు హిందీ లైట్ హెచ్‌డికి చందాను కలిగిన వినియోగదారులు హిందీ బచాట్ న్యూ, హిందీ లైట్ న్యూ మరియు హిందీ లైట్ న్యూ హెచ్‌డి ప్యాక్‌లకు ఆటోమ్యాటిక్ గా మళ్ళించబడతారు. అలాగే హిందీ స్మార్ట్, కన్నడ లైట్, కన్నడ లైట్ ప్లస్ చందాను కలిగిన వినియోగదారులు హిందీ స్మార్ట్ న్యూ, కన్నడ లైట్ న్యూ మరియు కన్నడ లైట్ ప్లస్ న్యూలకు మళ్ళించబడతారు.

టాటా స్కై లైట్ ప్యాక్‌ vs  టాటా స్కై నియరెస్ట్ ఫిట్ ప్యాక్‌

టాటా స్కై లైట్ ప్యాక్‌ vs టాటా స్కై నియరెస్ట్ ఫిట్ ప్యాక్‌

టాటా స్కై అందిస్తున్న ప్యాక్‌లలో ప్రస్తుతం నిలిపివేయడానికి షెడ్యూల్ చేసిన ప్యాక్‌లతో పోలిస్తే "నియరెస్ట్ ఫిట్" ప్యాక్‌లు కొద్దిగా అధిక ధరను కలిగి ఉన్నాయి. అయితే కొత్త కస్టమ్ ప్యాక్‌లు ప్రస్తుత ప్యాక్‌లతో పోల్చితే అధికంగా ఛానెల్‌లను అందిస్తున్నాయి. ఉదాహరణకు ప్రస్తుతం రూ.199.4 ధర వద్ద లభించే బెంగాలీ లైట్ ప్యాక్ వినియోగదారులకు ఎనిమిది ఛానెళ్లకు యాక్సెస్ ను అందిస్తున్నది. అయితే కొత్తగా తరలించే "సమీప ఫిట్" బెంగాలీ లైట్ న్యూ ప్యాక్ రూ.210 ధరను కలిగి ఉండి 10 ఛానెల్‌లకు యాక్సిస్ ను ఇస్తుంది.

Best Mobiles in India

English summary
Tata Sky Announced 11 Packs Discontinued on Dec 19 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X