సంచలనం రేపుతున్న టాప్ 5 జియో ప్లాన్స్

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన జియో ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూపోతోంది. దిగ్గజాలను వణికిస్తూ ఉచిత ఆఫర్లతో దూసుకువచ్చిన జియో నాటి నుంచి నేటి దాకా టెలికాం రంగంలో


దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన జియో ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూపోతోంది. దిగ్గజాలను వణికిస్తూ ఉచిత ఆఫర్లతో దూసుకువచ్చిన జియో నాటి నుంచి నేటి దాకా టెలికాం రంగంలో కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటూనే ఉంది. డేటాను అత్యంత చీఫ్ గా మార్చేసిన జియో అత్యంత తక్కువ ధరకే ప్లాన్లను ప్రవేశపెడుతూ వస్తోంది.

Advertisement

ఎప్పటికప్పుడు ప్లాన్లలో పలు మార్పులను చేసుకుంటూ పోతున్న జియో యూజర్ల కోసం మరి కొన్ని ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో జియో ప్రవేశపెట్టిన ప్లాన్లలో టాప్ 5 ప్లాన్లను ఓ సారి పరిశీలిద్దాం.

Advertisement

రోజుకు 1.5GB 4G డేటా :

4జీ డేటా ప్లాన్ (రోజుకు 1.5జీబీ డేటా)పై రిలయన్స్ జియో ఐదు ఆఫర్లు అందిస్తోంది. జియో రీఛార్జ్ ప్యాక్స్ రూ.149, రూ.349, రూ.449, రూ.1699 ఆఫర్ చేస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్లపై రోజుకు యూజర్లు 1.5జీబీ 4జీ డేటాను పొందవచ్చు. ఐదు రీఛార్జ్ ప్యాక్ లపై వ్యాలిడెటీ 28 రోజులు, 70 రోజులు, 84రోజులు, 91రోజులు, 1 ఏడాది పాటు అందిస్తోంది.

రోజుకు 2GB డేటా :

రిలయన్స్ జియో 4జీ డేటాపై ప్రీపెయిడ్ యూజర్లకు రోజుకు 2జీబీ డేటా అందిస్తోంది. ఈ ఆఫర్ పై అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS లు పొందవచ్చు. రీఛార్జ్ ప్లాన్లు వరుసగా రూ.198 (28 రోజులు), రూ.398 (70రోజులు), రూ.448 (84రోజులు), రూ.498 (91రోజులు) అందిస్తోంది.

రోజుకు 3GB డేటా

రిలయన్స్ జియో 4జీ డేటాపై రోజుకు 3జీబీ డేటాను అందిస్తోంది. 28రోజుల వరకు కాలపరిమితి ఉంటుంది. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. రూ.299తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS లు పొందవచ్చు.

రోజుకు 4GB డేటా

రిలయన్స్ జియో అందించే ఆఫర్లలో బెస్ట్ ఆఫర్.. ఇదే.. 4జీ డేటాపై రోజుకు యూజర్లు 4GB డేటా పొందవచ్చు. ఈ ప్యాక్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. రూ.509 తో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ వ్యాలిడెటీ 28 రోజులు కాగా.. 112GB డేటా పొందవచ్చు.

రోజుకు 5GB డేటా

డేటా ఎక్కువగా వాడే యూజర్లుకు ఈ ప్లాన్ ఎంతో బెస్ట్. స్ట్రీమింగ్ సర్వీసులను వీక్షించే యూజర్లకు ఈ ప్లాన్ వర్క్ సరిగ్గా సరిపోతుంది. 4జీ డేటా రోజుకు 5జీబీ కావాలంటే రూ.799తో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే.. రోజుకు 5జీబీ హైస్పీడ్ డేటాను 28 రోజుల కాలపరిమితిపై పొందవచ్చు.

రూ. 98 డేటా ప్లాన్ :

జియో ప్రీపెయిడ్ యూజర్లకు చీపెస్ట్ ప్లాన్ ఇదే.. రూ.98తో రీఛార్జ్ చేసుకుంటే.. 2GB, 4జీ డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకున్న యూజర్లకు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS పొందవచ్చు. అంతేకాదు.. జియో యాప్స్ ను కూడా యాక్సస్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడెటీ 28 రోజుల వరకు ఉంటుంది. హైస్పీడ్ డేటా లిమిట్ ఒకసారి దాటితే.. ఆ తర్వాత డేటా స్పీడ్ తగ్గిపోతుంది.

జియో Top-UP రీఛార్జ్ :

రిలయన్స్ జియో కస్టమర్లు అందరికి 4జీ డేటా పొందే అవకాశం. జియో టాప్ అప్ రీఛార్జ్ చేసుకుంటే.. అన్ లిమిటెడ్ ప్యాక్ పొందవచ్చు. ఈ డేటా స్పీడ్ లిమిట్ దాటితే.. రోజువారీగా డేటా స్పీడ్ క్రమంగా తగ్గిపోతుంది. ఈ ప్లాన్ పై డేటా లిమిట్ దాటినప్పటికీ అదనంగా డేటా పొందేందుకు జియో రెండు టాప్ అప్ రీఛార్జ్ డేటా ప్లాన్లను అందిస్తోంది. రూ.19, రూ.52 రీఛార్జ్ ప్లాన్ పై ఒక రోజు, వారంపాటు ఎంజాయ్ చేయొచ్చు.

 

Best Mobiles in India

English Summary

Top 5 Jio 4G plans: Which one offers more data, longer validity and additional benefits