First Snapdragon 712తో రానున్న వివో స్మార్ట్‌ఫోన్లు, దిగ్గజాలకు చిక్కులే !


ఇండియన్ మొబైల్ మార్కెట్లో సంచలనాలు నమోదు చేస్తున్న చైనా దిగ్గజం వివో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా సరికొత్త ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి అద్భుతమైన మొబైల్స్ ని ప్రవేశపెడుతూ వస్తోంది. ప్రపంచంలోనే తొలిసారిగా first In-Display Fingerprint Scanner, Pop-Up Selfie Camera వంటి స్పెషల్ ఫీచర్లు మొబైల్ మార్కెట్లో సరికొత్త సంచలనాలు నమోదుచేశాయనే చెప్పవచ్చు. అదే ఊపులో ఈ చైనా దిగ్గజం సరికొత్తగా ముందుకు దూసుకువచ్చేందుకు వ్యూహాలు రెడీ చేసింది.

Advertisement

ఇందులో భాగంగానే మునుపెన్నడూ లేని ఫీచర్లతో Z-seriesలో క్వాల్ కామ్ ప్రాసెసర్ ఉండే విధంగా తన కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తోంది. రానున్న vivo Z-series హ్యాండ్ సెట్లు రూ. 20 వేల బడ్జెట్లో all-new Qualcomm Snapdragon 712 chipsetతో తొలిసారిగా మార్కెట్లోకి రానున్నాయి. క్వాల్ కామ్ 700 సీరిస్లో ఇది రెండవది కాగా మూడవదానిపై కూడా కంపెనీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. త్వరలో Snapdragon 845 SoC డిజైన్ తో సరికొత్త ఫ్లాగ్ షిప్ రానుంది.

Advertisement

మ్యాగ్జిమమ్ స్పీడ్

Snapdragon 712 chipsetతో రానున్న మొబైల్ Octa-core CPUతో పాటుగా Qualcomm Kryo 360 coresని ఆఫర్ చేస్తోంది. దీని మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 2.3 GHzగా ఉండనుంది. ఈ Snapdragon 712 CPU లేటెస్ట్ గా వచ్చిన Adreno 616 GPUతో బుల్డ్ అయి రానుంది. దీని ద్వారా గేమింగ్ ఆడే ప్రియులకు మంచి అనుభూతి కలగనుంది. గేమింగ్ పెర్ఫార్మెన్స్ చాలా వేగవంతంగా , స్మూత్ గా ఎక్కడా అంతరాయం కలగకుండా ఈ ప్రాసెసర్ రానుంది

డిస్ ప్లే

ఈ ప్రాసెసర్ 4K displayతో పాటుగా మ్యాగ్జిమమ్ రిజల్యూషన్ 3360x1440 pixelsగా ఉండనుంది. కంపెనీ నుంచి ఇంతకు ముందు వచ్చిన 12nm processors కన్నా వేగవంతమైన పనితీరును ఇది కనపరచనుంది. ఈ ఫీచర్ తో రానున్న Z-series మొబైల్స్ పై ఇప్పుడు మార్కెట్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఈ ఫోన్లు దుమ్మురేపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

కెమెరా పనితీరు

అయితే ఈ ప్రాసెసర్ మీద ఇప్పటిదాకా ఎటువంటి సమాచారం బయటకు రావడం లేదు. అయితే ఫీచర్లు మాత్రం భారీ స్ఠాయిలోనే ఉండనున్నాయని సమాచారం. ముఖ్యంగా కెమెరా సెటప్ లో పాప్ అప్ సెల్పీ కెమెరా విత్ మాసివ్ సెన్సార్ కెమెరా ఫోన్స్ మార్కెట్లో సరికొత్త ఒరవడిని సృష్టించనుంది. vivo V15 Proలో వచ్చిన మాదిరిగానే బడ్జెట్ రేంజులో ఈ ఫోన్లు రానున్నాయి. 32 ఎంపీ సెల్ఫీ కెమెరాను ఇందులో చూడవచ్చు. సాఫ్ట్ వేర్ పరంగా చూస్తే HDR mode, Beautify app, Portrait selfie ఇంకా ఇతర ఫీచర్లు ఉండనున్నాయి.

వివో జ1 ప్రొ

ఇదిలా ఉంటే వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ జడ్1 ప్రొ ను భారత్‌లో అతి త్వరలో విడుదల చేయనుంది. ఇందులో అధునాతన స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 32 మెగాపిక్సల్ ఇన్ డిస్‌ప్లే కెమెరాను అమర్చారు. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని కూడా ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. కాగా ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు. రూ.14,075 ప్రారంభ ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

వివో జ1 ప్రొ ఫీచర్లు

6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

మల్టీమీడియా అనుభూతి

వివో కంపెనీ ఎల్లప్పుడూ వినియోగదారుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని తన ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ నుంచి రానున్న Z-series smartphone కూడా big FHD+ panelతో full-screen multimedia-viewing experienceని కలిగించనుంది. అలాగే ట్రిపుల్ రేర్ కెమెరాతో పాటు wide-angle lensని కూడా ఈ ఫోన్లు ఆఫర్ చేయనున్నాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్, మాసివ్ బ్యాటరీతో మార్కెట్లోకి రానున్నాయి. ఇండియన్ మార్కెట్ ఫోన్లో సత్తా చాటుతున్న Samsung, Xiaomi, Honor, and Asus ఫోన్లకు వివో ఫోన్లు గట్టి పోటీనివ్వనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Best Mobiles in India

English Summary

vivo’s Upcoming Smartphone Will Be the First Snapdragon 712 Powered Handset