రోజుకు 3GB డేటాతో వోడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు..... ఆఫర్స్ అదుర్స్


టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఇప్పుడు ఇండియాలో కొత్తగా రెండు రూ.558, రూ.398 ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. వోడాఫోన్ యొక్క రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్‌ ప్రస్తుతం 56 రోజుల చెల్లుబాటుతో చందాదారులకు రోజుకు 3GB హై-స్పీడ్ డేటాను అందిస్తుండగా మరోవైపు రూ.398 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా రోజుకు 3GB డేటా ప్రయోజనాలను అందిస్తుంది అయితే 28 రోజుల చెల్లుబాటుతో.

రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్‌ ప్రయోజనాలు

వోడాఫోన్ కొత్తగా ప్రవేశపెట్టిన రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తున్న ప్రయోజనాల విషయానికి వస్తే ఇది ఏ నెట్‌వర్క్‌కు అయిన అపరిమిత వాయిస్ కాల్స్, 3 జిబి హై-స్పీడ్ డైలీ డేటా మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్ మెసేజ్ లను 56 రోజుల చెల్లుబాటు కాలంతో అందిస్తుంది. ఈ ప్లాన్ అందిస్తున్న అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఇది వోడాఫోన్ ప్లే యొక్క ఒక సంవత్సరం చందాను ఉచితంగా అందిస్తుంది. అలాగే రూ.999ల విలువైన ఒక సంవత్సరం Zee5 చందాను కూడా చందాదారులకు ఉచితంగా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్రస్తుతానికి మధ్యప్రదేశ్ సర్కిల్‌లో మాత్రమే ప్రత్యక్షంగా ఉంది.

వోడాఫోన్ కొత్త Rs.99, Rs.555 ప్రీపెయిడ్ ప్లాన్‌ల ఆఫర్లు ఎలా ఉన్నాయో చూడండి

రూ.398 ప్రీపెయిడ్ ప్లాన్‌ ప్రయోజనాలు

వోడాఫోన్ యొక్క మరో కొత్త రూ.398 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 3GB హై-స్పీడ్ రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. ఈ రూ.398 ప్లాన్ ముంబై, మధ్యప్రదేశ్ సర్కిల్‌లలో మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ముందు ముందు రోజులలో అన్ని సర్కిల్ లకు కూడా వీటిని విస్తరించనున్నారు. ఇది వోడాఫోన్ ప్లే మరియు Zee5 చందా వంటి వాటికి కూడా యాక్సిస్ ను ఉచితంగా అందిస్తుంది.

Dish SMRT Hub & Tata Sky Binge+ సెట్-టాప్-బాక్స్‌ల మధ్య తేడా...

రూ.19 ప్రీపెయిడ్ ప్లాన్

వొడాఫోన్ తన చందాదారులకు మరింత డేటాను అందించడానికి రూ.19 ప్రీపెయిడ్ ప్లాన్ ను కలిగి ఉంది. ఇది ఇప్పుడు 150MB కి బదులుగా 200MB డేటాను అందిస్తున్నది. ఇది ఇప్పటికీ ప్రతి నెట్‌వర్క్ కు అపరిమిత కాల్‌ల ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు కాలం కేవలం 2 రోజుల మాత్రమే. సవరించిన ప్రణాళిక ప్రస్తుతం ముంబై, మధ్యప్రదేశ్ మరియు హర్యానా సర్కిల్‌లలో అందుబాటులో ఉంది.

Most Read Articles

Best Mobiles in India
Read More About: news technology telecom vodafone

Have a great day!
Read more...

English Summary

Vodafone Launched Rs.558, Rs.398 Prepaid Recharge Plans With 3GB Daily Data