దూసుకొస్తున్న రెడ్‌మి కె 20 ప్రొ,ఇది చాలా హాట్ గురూ !

ప్రపంచ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి దూసుకువస్తోంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సంచలనపు అమ్మకాలను నమోదు


ప్రపంచ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి దూసుకువస్తోంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సంచలనపు అమ్మకాలను నమోదు చేస్తోంది. టాప్ దిగ్గజాలు ఆపిల్, శాంసంగ్ లకు ధీటైన సవాల్ విసురుతూ మొబైల్ మార్కెట్లో రారాజుగా వెలుగొందుతోంది. అదే ఊపులో ఈ కంపెనీ నుంచి ఇప్పుడు మార్కెట్లోకి అదిరే ఫీచర్లతో సరికొత్త ఫోన్ రానుందనే వార్తలు వస్తున్నాయి.

Advertisement

స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ తో పాటు కొత్త ఫీచర్లను జోడించి ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తుందని Redmi general manager Lu Weibing చైనా వెబ్ సైట్ Weibo post ద్వారా కన్ఫర్మ్ చేశారు. రెడ్‌మి ఎక్స్ పేరుతో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుందని తెలిపారు.

Advertisement

రెడ్‌మి కె 20 ప్రొ

అయితే ఇప్పటిదాకా రెడ్‌మి ఎక్స్ పేరుతో ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తుందని అనుకుంటే అది పేరు మార్చుకుని వస్తోందట. రెడ్‌మి కె 20 ప్రొ పేరుతో కంపెనీ దీన్ని మార్కెట్లోకి తీసుకురానుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. క్వాల్ కామ్ స్నాప్డ్ డ్రాగన్ 855, సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్ తో ఈ ఫోన్ రానుందట.

స్నాప్‌డ్రాగన్ 855 ప్రోసెసర్‌

స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 855 ప్రోసెసర్‌తో పాటు సూపర్ వైడ్ యాంగిల్ లైన్స్ కలిగిన అద్భుతమైన కెమేరా కూడా ఉంటుందని చైనా మార్కెట్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీనికి రెడ్‌మి ఎక్స్ లేదారెడ్‌మి కె 20 ప్రొఏదైనా పేరు ఖరారు చేయవచ్చని తెలుస్తోంది.

256 జీబీ ఆన్ బోర్డు స్టోరేజి

చైనాకు చెందిన మీడియా సంస్థ వైబో లో రెడ్‌మి జనరల్ మేనేజర్ లూ వీబింగ్ ఉంచిన పోస్టు ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. రాబోయే రెడ్‌మి ఫ్లాగ్‌షిప్ ఫోను 256 జీబీ ఆన్ బోర్డు స్టోరేజి కలిగి ఉంటుందని, 3.5 ఎంఎం ఇయర్ ఫోన్ ఆడియో జాక్‌తో ఎన్ఎఫ్‌సి సపోర్టు చేస్తుందని వైబో లీకులు చెబుతున్నాయి. 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డి హోల్ పంచ్ డిస్ప్లే ఉంటుందంటున్నారు.

48+13+8 మెగా పిక్సల్స్

అంతేకాకుండా రెడ్‌మి ఫోన్ లో వెనుక భాగంలో 48+13+8 మెగా పిక్సల్స్ మూడు కెమేరాలు ఉంటాయని లీకుల ద్వారా తెలుస్తోంది. ఇందులో 13 ఎంపీ కెమేరా సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉంటుంది. అయితే ఇందులో పాప్అప్ సెల్పీ కెమేరా ఉండక పోవచ్చని చైనా మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

Redmi K20 Pro రూమర్ ఫీచర్లు

6.39 అంగుళాల ఫుల్ హెడ్డీ డిస్‌ప్లే

8 జీబీ ర్యాం / 256 జీబీ ఇంటర్నల్ మెమొరీ

48 ఎంపి +13 ఎంపీ + 8 ఎంపీ సూపర్ వైడ్ యాంగిల్ కెమేరా

20MP pop-up selfie camera

ఎంఐయూఐ 10 విత్ ఆండ్రాయిడ్ పై

4,000mAh battery

27W fast charging support

3.5 headphone jack and NFC connectivity

 

Mi A3, Mi A3 Lite

ఇదిలా ఉంటే కంపెనీ ఎంఐ సీరిస్ లో Mi A3, Mi A3 Lite ఫోన్లను ఇండియాలో లాంచ్ చేయనుంది. ఇవి రెండు ఆండ్రాయిడ్ వన్ సపోర్టుతో మార్కెట్లోకి రానున్నాయి. అలాగే Snapdragon 700 SoCతో పాటు ఆండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ సిస్టంతో రానున్నట్ల సమాచారం. 32 ఎంపి సెల్ఫీ కెమెరా ప్రధాన ఆకర్షణగా ఈ ఫోన్లు సందడి చేయనున్నాయి.

షియోమీ బ్లాక్ షార్క్ 2

షియోమీకి చెందిన బ్లాక్ షార్క్ 2 గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను త్వ‌ర‌లో భార‌త్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. అయితే దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. గేమింగ్ ప్రియుల కోసం ప్ర‌త్యేకంగా ఈ ఫోన్‌ను త‌యారు చేశారు.

షియోమీ బ్లాక్ షార్క్ 2 ఫీచర్లు

6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 12 జీబీ ర్యామ్‌, లిక్విడ్ కూలింగ్ 3.0, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 48 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

 

Best Mobiles in India

English Summary

Xiaomi’s next flagship smartphone Redmi K20 Pro may run on this top-end processor