ఆధార్ గురించి ఈ న్యూస్ విన్నారా , వింటే దిమ్మ తిరిగాల్సిందే


ఆధార్ చట్టానికి సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రైవేటు సంస్థలు 12 అంకెల ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం తప్పనిసరి అనే నిబంధనను సుప్రీంకోర్టు నిషేధించిన నేపథ్యంలో ఇష్టమైతేనే మొబైల్ నంబర్లకు, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానం చేయవచ్చునని ప్రతిపాదిత బిల్లు చెప్తోంది. ప్రతిపక్షాల ఆందోళనలపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ వ్యక్తిగత గోప్యతను అతిక్రమించేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఈ బిల్లును రూపొందించినట్లు తెలిపారు. ఆధార్‌ సంఖ్యను మొబైల్ నంబరు, బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయడం తప్పనిసరి కాదన్నారు. కాగా డేటా ప్రొటెక్షన్ బిల్లును కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. దీనిని త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే దీనిపై అనేక ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గం ఫేస్‌బుక్ ద్వారా ఆధార్ కార్డు మిస్ యూజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

ఫేస్‌బుక్ ఖాతా సృష్టించుకోవాలంటే

అన్నింటికీ ఆధార్ అనే న‌రేంద్ర‌మోదీ విధానాన్ని సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ కూడా అనుస‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అవును... త్వ‌ర‌లో ఫేస్‌బుక్ ఖాతా సృష్టించుకోవాలంటే ఆధార్‌లో ఉన్న పేరును ఉప‌యోగించేలా ఆ సంస్థ చ‌ర్య‌లు తీసుకోబోతోంది. త‌ప్పుడు పేర్ల‌తో అకౌంట్లు తెరిచి, మోసాల‌కు పాల్ప‌డుతున్న వారిని అరిక‌ట్ట‌డానికే ఇలాంటి ప‌ద్ధ‌తిని ఫేస్‌బుక్ అమ‌లు చేయ‌నుంది.

ప్ర‌యోగ‌ద‌శ‌లో

అంతేకాకుండా ఇలా ఆధార్‌లో ఉన్న పేరుతోనే ఖాతా తెర‌వ‌డం వ‌ల్ల స్నేహితులు గానీ, కుటుంబ స‌భ్యులు గానీ సుల‌భంగా ఫేస్‌బుక్ ఖాతాను గుర్త‌పట్ట‌వ‌చ్చు. ఇప్ప‌టికే ఈ విధానం ప్ర‌యోగ‌ద‌శ‌లో ఉన్న‌ట్లు ఫేస్‌బుక్ వ‌ర్గాలు తెలిపాయి.

ఆప్ష‌న‌ల్‌గా మాత్ర‌మే

భారత్‌లో ఫేస్‌బుక్ వినియోగం అతితక్కువగా ఉన్న ప్రాంతంలో దీన్ని ప్రయోగించినట్లు ఫేస్‌బుక్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విధానాన్ని ఆప్ష‌న‌ల్‌గా మాత్ర‌మే ఉంచ‌బోతున్న‌ట్లు సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు.

త‌ప్ప‌నిస‌రి చేసే అవకాశాలు

అంటే.. ఐచ్చికంగానే ఆధార్‌లో పేరుని ఉప‌యోగించుకోవ‌చ్చ‌న్న‌మాట‌. అయితే ముందుముందు ఈ విధానాన్ని త‌ప్ప‌నిస‌రి చేసే అవకాశాలు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఖాతా తెర‌వ‌డానికి ఆధార్ సంఖ్య అవసరం లేదని, ఆధార్ ప్రకారం పేరు మాత్రమే అవసరం అని స్పష్టం చేశారు.

తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం

అయితే ఫేస్‌బుక్ యూజర్ ఒకవేళ మరణిస్తే అతని ఆధార్ డిలీట కాది తద్వారా అది మిస్ యూజ్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అతను మరణించినా లేక అకౌంట్ డిలీట్ చేసినా ఆధార్ అలానే ఉంటుందని దీన్నిహ్యాకర్లు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం లేకపోలేదని వాదిస్తున్నారు.

Best Mobiles in India

English Summary

You can set Facebook account to delete in case you die, but Aadhaar is forever more News aat Gizbot Telugu