వాట్సప్ పిచ్చి ఎంతలా ముదిరిందంటే..?
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సొంతమైన మెసేజింగ్ యాప్ వాట్సప్ రోజువారీ యూజర్లపరంగా ఒక బిలియన్ (1,00,00,00,000 వందకోట్ల) మార్క్‌ను టచ్ చేసింది.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సొంతమైన మెసేజింగ్ యాప్ వాట్సప్ రోజువారీ యూజర్లపరంగా ఒక బిలియన్ (1,00,00,00,000 వందకోట్ల) మార్క్‌ను టచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడు లేదా ఎనిమిది మందిలో ఒకరు వాట్సప్ యూజర్లుగా నమోదవుతున్నారు.

గత సంవత్సరం (2016, ఫిబ్రవరి)నెలవారీ వినియోగదారులు ఒక బిలియన్ తాకగా ఇపుడు ఇది ఇప్పుడు ప్రతి రోజు వందకోట్లమందిని సొంతం చేసుకుంటోంది. డిజిటల్ కమ్యూనికేషన్స్ వ్యవస్థలో ఫేస్‌బుక్ హవాను ఇది తేట తెల్లం చేస్తోంది.

మరోవైపు ఫేస్‌బుక్ రోజువారీ క్రియాశీల వినియోగదారు సంఖ్యలు అందుబాటులో లేనప్పటికీ ఇన్‌స్ట్రాగ్రామ్, మెసెంజర్, ఫేస్‌బుక్ నెలవారీ యూజర్ల సంఖ్య వరుసగా 700 మిలియన్, 1.2 బిలియన్, 2 బిలియన్ గా ఉంది.


Click it and Unblock the Notifications








