Just In
- 9 min ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 23 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
Don't Miss
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు అవకాశం లేదు.. తేల్చి చెప్పిన మాజీ దిగ్గజం!
- Movies
Pathaan day 2 Collections బాక్సాఫీస్‌పై షారుక్ దండయాత్ర.. కలెక్షన్లు సునామీ.. 300 కోట్లకు చేరువగా!
- News
వైఎస్సార్ స్వాంతంత్ర్య సమరయోధుడా? రిపబ్లిక్ డే సాక్షిగా వైఎస్ షర్మిలకు తప్పని ట్రోల్స్!!
- Finance
Stock Market: బేజారులో దేశీయ స్టాక్ మార్కెట్లు.. అక్కడ అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఎందుకిలా
- Automobiles
XUV400 EV బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా?
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
వేధింపులకు వేదికగా మారిన యాప్స్ , గూగుల్ షాక్!
సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్ పలు ప్రముఖ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించి వేసింది. తన పాలసీలను ఉల్లంఘించే బ్యాడ్ యాప్స్‌కు వ్యతిరేకంగా గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఈ మధ్య బాగా పాపులర్ అయిన సరహ్ మెసేజ్ కూడా ఉంది. సరహ్‌తో పాటు ఇతర పాపులర్ యాప్స్ అమెజాన్ అండర్‌గ్రౌండ్,గ్రూవ్స్ షార్క్, పీఎస్ఎక్స్4డ్రాయిడ్, రష్ పోకర్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో స్థానం కోల్పోయాయి. సరహ్ అనేది తామెవరో తెలిసే అవకాశం లేకుండానే ఎదుటి వారికి సందేశాలు పంపుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీంతో వేధింపులకు ఇదో మాధ్యమంగా మారిపోయింది. దీనిపై యూజర్ల నుంచి కూడా భారీగానే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించేయాలని నిర్ణయించింది.

మొబ్ డ్రో (mobdro)
క్రీడా ఓత్సాహికులకు ఉపయోగపడే యాప్. ఈ యాప్ దాని యూజర్లు cnn వంటి ఛానెల్లో ప్రత్యక్ష క్రీడలను చూసేందుకు అనుమతిస్తుంది. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, వింబుల్డన్, ఫార్మూలా 1 వంటి లైవ్ గేమ్స్ ను లైవ్ టెలికాస్ట్ చేస్తుంది.
ట్యూబ్ మెట్ (tubemate)
ఈ యాప్ యూట్యూబ్ వీడియోలతో పాటు ఆన్ లైన్లో అందుబాటులో ఉన్న పలు వీడియోలను చూడటానికి అనుమతిస్తుంది. ట్యూబ్ మెట్ నుంచి వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవడం చాలా సులభం.

యాడ్ బ్లాకర్ ( Adblock plus)
మీ ఆండ్రాయిడ్ డివైసు నుంచి ఈ యాప్ ప్రకటనలు బ్లాక్ చేస్తుంది. ఈ యాప్ ను కూడా గూగుల్ ప్లేస్టోర్ తొలగించింది. ఎందుకంటే ఈ యాప్ వారి ప్రకటనలను కూడా బ్లాక్ చేసింది.

అమెజాన్ యాప్ స్టోర్ ( amazon app store)
అమెజాన్ యాప్ స్టోర్ నుంచి దాదాపుగా అన్నియాప్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన యాప్ స్టోర్. ఇది గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. 2014లో దీన్ని తొలగించారు . ఎందుకంటే టర్మ్స్ అండ్ కండీషన్స్ ను ఈ యాప్ ఉల్లంఘించింది.

లక్కీ ప్యాచర్ (lucky patcher)
ఈ యాప్ మీ ఆండ్రాయిడ్ డివైసుల్లో ఇన్స్ స్టాల్ చేసి యాప్స్ ను ఎడిట్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ లైసెన్స్ వెరిఫికేషన్ను ఉల్లంఘించడంతో ఈయాప్ ను తొలగించింది.

పాప్ కార్న్ టైం (popcorn time)
మీకు ఇష్టమైన సినిమాలు, టీవీ కార్యక్రమాలు యాడ్స్ లేకుండా ఒక క్లిక్ తో డౌన్ లోడ్ చేసుకునేందుకు ఈ యాప్ అనుమతిస్తుంది. ఈ యాప్ ను కూడా గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించేసింది.

ఎక్స్ పోజ్డ్ ఫ్రేమ్ వర్క్ ( xposed framework)
మీ ఆండ్రాయిడ్ డివైసు...మీరు కోరుకున్న విధంగా అనుకూలీకరించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ యాప్ ఉపయోగించడానికి రూటెడ్ డివైజ్ అవసరమైతుంది.
ఏపికే మిర్రర్ (Apk mirror)
ఏపికే మిర్రర్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో లేని యాప్స్ ఏపికే ఫార్మట్లో డౌన్ లోడ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అన్ని ప్రముఖ యాప్స్ ఏపికే ఫైల్...ఏపికే మిర్రర్లో అందుబాటులో ఉంటాయి. కానీ ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించబడింది.

ఎఫ్ డ్రాయిడ్ (f-droid)
ఇది ఓపెన్ సోర్స్ గా అందుబాటులో ఉన్న అన్ని యాప్స్ కు కేంద్రంగా ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో లేని యాప్స్ ఇక్కడి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
వైపర్ 4 ఆండ్రాయిడ్ ( viper4android)
ఇది ఒక ఈక్వాలైజ్డ్ యాప్ కాదు. ఇది అన్ని యాప్స్ ఫాదర్ గా చెప్పబడుతుంది. ఈ యాప్ ద్వారా మీరు దాదాపు అన్ని యాప్స్ ను కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మ్యూజిక్ లవర్స్ వారి స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ ను కలిగి ఉండాలి. ఈ యాప్ కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్థానం కోల్పోయింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470