2018లో లైమ్ లైట్ లోకి వచ్చిన బెస్ట్ యాప్స్

|

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్స్ చాల కామన్ అయిపోయింది . ఒక్క సారి ఆండ్రాయిడ్ ఫోన్ లోని గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే చాలు అందులో కొన్ని లక్షల యాప్స్ దర్శనిమిస్తుంటాయి.అయితే వాటిలో కొన్ని మాత్రం ఎప్పుడు టాప్ ఉంటాయి .నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా 2018లో నిలిచిన బెస్ట్ యాప్స్ ను మీకు తెలుపుతున్నాము.అవి మీ మొబైల్లో ఉన్నాయో లేదో ఓ సారి చెక్ చేసుకోండి.

ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన హైఎండ్ స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ ఇదే

TikTok
 

TikTok

2018కిగాను భారతీయులచే అత్యధికంగా అభిమానించబడిన యాప్‌లలో టిక్‌టాక్(TikTok) ఒకటి. Musical.lyకు చెందిన ఈ సోషల్ మీడియా యాప్‌ను ఇటీవలే చైనా యాప్ తయారీదారైన Bytedance కొనుగోలు చేసింది. సిమిలర్ వెబ్ నివేదిక ప్రకారం టిక్‌టాక్ యాప్‌కు భారత్‌లో 1.5కోట్ల మంది యూజర్లు ఉన్నారు.

Google Pay

Google Pay

డిజిటల్ చెల్లింపులకు విపరీతమైన ఆదరణ నెలకున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ ఈ ఆన్‌లైన్ పేమెంట్ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సర్వీస్‌లోకి వెళ్లిన తరువాత యూజర్ తనకు సంబంధించిన క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, గిఫ్ట్ కార్డ్స్ ఇంకా రికార్డ్ కార్డ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని స్టోర్ చేసుకుని వాటిని అన్ని రకాల ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పేమెంట్‌లకు వినియోగించుకునే వీలుంటుంది.

WhatsApp Business

WhatsApp Business

వాట్సాప్ బిజినెస్ యాప్ ద్వారా వ్యాపార సంస్థలు తమ కస్టమర్‌లతో నిరంతరం టచ్ ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా, కస్టమర్‌లు కూడా వాట్సాప్ ద్వారా తమకు కావల్సిన వస్తువు లేదా సర్వీసుకు సంబంధించి ఆయా వ్యాపార సంస్థలతో సంప్రదింపులు జరిపే వీలుటుంది. వాట్సాప్ బిజినెస్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవాలనుకునే వ్యాపారులు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ బిజినెస్ యాప్‌ను తమ స్మార్ట్‌పోన్‌లోకి ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. ఇన్‌స్టాల్ అయిన తరువాత మీ బిజినెస్ మొబైల్ నెంబర్ ద్వారా యాప్‌లోకి లాగిన్ కావల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీ బిజినెస్ వివరాలను ఎంటర్ చేసినట్లయితే ప్రొఫైల్ క్రియేట్ కాబడుతంది.

Amazon Prime Videos
 

Amazon Prime Videos

అమెజాన్ ప్రైమ్ వీడియోస్, అమెజాన్ ప్రైమ్ మేమేబెర్స్ కోసం సబ్స్క్రిప్షన్ - బేస్డ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ . అమెజాన్ నుండి వీడియో స్ట్రీమింగ్ సేవ ప్రత్యేకమైన వెబ్ సిరీస్ మరియు సినిమాలతో మల్టీ లాంగ్వేజ్ కంటెంట్ తో వస్తుంది.

JioTV

JioTV

జియో యాప్ ద్వారా టీవీ ప్రసారాలను ఉచితంగా వీక్షించే సౌలభ్యాన్ని కల్పించింది. అలాగే సినిమాలు, లైవ్ షోలు ఇంకా ఎన్నో ప్రయోజనాలను యాప్ ద్వారా జియో అందిస్తోంది.జియో టీవి తమ ఫ్లాట్ ఫాం మీద 61 ఛానల్స్ ని అందిస్తుంది . ఈ ఛానల్స్ డీటీహెచ్, కేబుల్ ఫ్లాట్ ఫాం మీద అందిస్తున్న వాటికన్నా ఎక్కువ.

Daily hunt

Daily hunt

డైలీ హంట్ అనేది లోకల్ లాంగ్వేజ్ యాప్. ఇంగ్లీష్, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ, బంగ్లా, గుజరాతి, ఉర్దూ, ఒరియా మరియు పంజాబీలలో ప్రముఖ కంటెంట్ భాగస్వాముల నుండి లోకల్ లాంగ్వేజ్ యాప్ .

Files by Google

Files by Google

Google ద్వారా ఫైల్లు స్థలాన్ని ఖాళీ చేయడానికి మరియు ఒక ఫోన్ నుండి మరొక ఫోన్ ఫైల్స్ ను షేర్ చేసుకోవడానికి మీకు సహాయపడే ఫైల్ మేనేజ్మెంట్ యాప్.

Dual Space

Dual Space

డ్యూయల్ స్పేస్ యాప్ , ఇది యాప్ యొక్క మల్టీ అకౌంట్స్ ను ఏకకాలంలో అమలు చేయడానికి స్మార్ట్ ఫోన్లో ఒక సమాంతర స్పేస్ సృష్టిస్తుంది.డ్యూయల్ స్పేస్ యాప్ కలిగిన వినియోగదారులు ఒకే ఫోన్లో రెండు WhatsApp అకౌంట్స్ ను ఉపయోగించవచ్చు.

YouTube Go

YouTube Go

యూట్యూబ్ గో ఎంట్రీ-లెవెల్ స్మార్ట్ ఫోన్ల కోసం తయారు చేయబ్బడ లైట్ వెర్షన్ యాప్ . యూట్యూబ్ గో కాంపాక్ట్ యాప్, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది మరియు వీక్ ఇంటర్నెట్ కనెక్షన్ తో కూడా పనిచేస్తుంది.

JioSaavn

JioSaavn

ప్రముఖ మ్యూజిక్‌ యాప్‌ సావన్‌ ​ మీడియాని రిలయన్స్ సొంతం చేసుకుంది. ఈ యాప్‌లో జియో కస్టమర్లకు ప్రస్తుతం 45 మిలియన్లకు పైగా పాటలు అందుబాటులో ఉంటాయి. ఈ పాటలతో పాటు సావన్ ఒరిజినల్ ఆడియో షోలు, పర్సనలైజ్డ్ మ్యూజిక్ రికమెండేషన్స్ వంటి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను జియో సావన్ యాప్‌లో అందిస్తోంది

Most Read Articles
Best Mobiles in India

English summary
10 apps which hit limelight in 2018.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X