ఈ ఏడాది మెరుపులు మెరిపించిన టాప్ టెన్ గేమ్స్

  గేమింగ్ మీద ఆసక్తి ఉన్నవారు ఈ రోజుల్లో చాలామందే ఉన్నారు. ముఖ్యంగా ర్యామ్ ఎక్కువ ఉన్న మొబైల్స్ వచ్చాక ఈ గేమ్ ల మీద చాలామందికి ఆసక్తి బాగా పెరిగింది. గ్రాఫిక్ కార్డు కూడా సపోర్ట్ చేస్తుండటంతో యూజర్లు డెస్క్ టాప్ కన్నా మొబైల్స్ లో గేమ్ ఆడేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో కంపెనీలు కూడా మొబైల్స్ లో గేమింగ్ సపోర్ట్ చేసే ఫీచర్లను ప్రవేశపెడుతున్నాయి. ఈ శీర్షికలో భాగంగా ఈ ఏడాది గేమింగ్ రంగంలో మెరుపులు మెరిపించిన టాప్ టెన్ గేమ్స్ ని ఓ సారి పరిచయం చేస్తున్నాం. ఓ లుక్కేసుకోండి.

  ఈ ఏడాది వాట్సాప్ విడుదల చేసిన 5 బెస్ట్ ఫీచర్లు ఏంటో చూడండి

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  PUBG MOBILE

  ఈ గేమ్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ రెండు ఫ్లాట్ ఫాంల మీద రన్ అవుతుంది. గూగుల్ ప్లే కూడా ఈ ఏడాది బెప్ట్ అవార్డుని ఈ గేమ్ కి అందించింది. ఈ గేమ్ యెక్క ముఖ్య ఉద్దేశం తెలియని చోట యుద్ధం చేయడం. దాదాపు 100 మందితో మీరు యుద్దం చేయవచ్చు. వారెవరో మీకు తెలియదు కూడా. ఇందులో గెలిచిన వారే విన్నర్.

  INTO THE DEAD 2

  ఇందులో మొత్తం ఏడు యాక్షన్ చాప్టర్స్ ఉంటాయి. 60 స్టేజ్ లు 100ల ఛాలెంజ్ లు ఉంటాయి. పవర్ పుల్ ఆయుధాలతో మీరు ఈ గేమ్ ని రక్తికట్టిస్తూ ముందుకు తీసుకెళ్లవచ్చు.

  POKÉMON GO

  పోకిమాన్ గో గేమ్ ఉచితంగా మొబైల్ ప్రదేశం ఆధారంగా ఆడుకొనే సహజ మొబైల్ గేమ్ . దీనిని నిన్ టిక్ ఐ ఓ ఎస్ మరియు ఆండ్రాయిడ్ అధ్వర్యంలో రూపొందించారు. దీనిని వినియోగించుకోవడం కోసం అన్నీ ప్రదేశలలో వచ్చేల ప్రపంచ వ్యాప్తంగా జూలై 2016 నా రూపకల్పన చేసారు. దీనిని ఆడాలంటే ముఖ్యంగా జిపీఎస్ మరియు కెమెరా ఫీచర్స్ మొబైల్ లో కలిగి ఉండాలి. ఈ గేమ్‌ను ఆడాలంటే క‌చ్చితంగా బ‌య‌ట‌కు వెళ్లాల్సిందే. బ‌య‌ట తిరుగుతూ గేమ్‌ను ఆడాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో శ‌రీరానికి వ్యాయామం చేసిన‌ట్ట‌యి క్యాల‌రీలు కూడా ఖ‌ర్చ‌వుతాయి. ఈ గేమ్‌ను నిత్యం 45 నిమిషాల పాటు ఆడ‌డం వ‌ల్ల ఎవ‌రైనా వారానికి 1800 క్యాల‌రీల‌ను ఈజీగా ఖ‌ర్చు చేయ‌వ‌చ్చ‌ట‌. దీంతో బ‌రువు కూడా త‌గ్గుతారు. అందుకే ఈ గేమ్ ఇప్పుడు అంద‌రినీ ఆకట్టుకుంటోంది.

  ASPHALT 9: LEGENDS

  ఇదొక కార్ రేసింగ్ గేమ్. కంపెనీ దీన్ని సరికొత్త ఫీచర్లతో వినియోగదారులకు అందించింది. అన్ని రకాల కార్లు ఈ గేమ్ లో ఉంటాయి.

  DRAGON BALL LEGENDS

  ఇదొక ఫన్ గేమ్. ఇందులో అనేక రకాలైన ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. 3డీ యానిమేషన్ బొమ్మలతో ఈ గేమ్ సాగుతుంది.

  CLASH OF CLANS

  ఈ గేమ్ ని మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని రకాల గేములకు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. రెండు రకాల ప్లాట్ఫాంల మీద ఇది అందుబాటులో ఉంటుంది. ఈ గేమ్ కి మిల్లియన్ల మంది ప్లేయర్లు యూజర్లుగా ఉన్నారు.

   

   

  PRO EVOLUTION SOCCER (PES) 2018

  సాకర్ అభిమానుల కోసం ఈ గేమ్ వచ్చింది. ఆ గేమ్ మీద ఆసక్తి ఉన్నవారు దీనిని ఆడుకోవచ్చు.

  PLANTS VS ZOMBIES 2

  ఇది మెదడుకు పని కల్పించే గేమ్. ఈ గేమ్ ద్వారా మీరు మీ బ్రెయిన్ మరింతగా రాటు దేలుతుంది. చాలా చాకచక్యంగా ఆడాల్సి ఉంటుంది.

  ALTO’S ODYSSEY

  ట్రావెలింగ్ చేసేవారు అమితంగా ఇష్టపడుతున్న గేమ్ ఇది. ప్రయాణంలో మీరు కనపడని దేవాలయాలు అలాగే మిస్టరీ ప్రదేశాలను ఈ గేమ్ లో శోధించాల్సి ఉంటుంది.రెండు రకాల ప్లాట్ఫాంల మీద ఇది అందుబాటులో ఉంటుంది.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Gaming on mobile has become a daily routine for some gaming enthusiasts. Here is an index of some of best mobile games of the year 2018 more News at Gizbot Telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more