సెల్ఫీ తీసుకుంటున్నారా...? ఈ యాప్స్ మీ కోసమే !

గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న పది బెస్ట్ సెల్ఫీ యాప్స్‌...

By Madhavi Lagishetty
|

సెల్ఫీలంటే మీకు ఆసక్తా..?, ఎంతో ఇష్టపడి మీ స్మార్ట్‌ఫోన్ నుంచి క్యాప్చుర్ చేసే సెల్ఫీ అంతగా ఆకట్టుకోవటం లేదా? డోంట్ వర్రీ.. గూగుల్ ప్లే స్టోర్‌లో మీకోసం ఎన్నో యాప్స్ రెడీగా ఉన్నాయి. ఆ యాప్స్ ద్వారా మీరు సెల్ఫీ తీసుకున్నట్లయితే, నలుగురిలో మీ సెల్ఫీ మరింత క్రియేటివ్‌గా కనిపిస్తుంది. ఈ యాప్స్‌లో సెల్ఫీలను నచ్చిన విధంగా ఎడిట్ చేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి వీటిని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న పది బెస్ట్ సెల్ఫీ యాప్స్‌ను ఇప్పుడు చూద్దాం.

స్వీట్ సెల్ఫీ....(SWEET SELFie)

స్వీట్ సెల్ఫీ....(SWEET SELFie)

ఇది బెస్ట్ ఆండ్రాయిడ్ సెల్ఫీ కెమెరా యాప్. మీకు పర్ఫెక్ట్ సెల్ఫీ కావాలంటే ఈ యాప్ నుంచి తీసుకోవచ్చు. దీంట్లో రకరకాలు ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు నచ్చిన విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు. అంతేకాదు ఏమోజీతో పాటు పవర్ ఫుల్ స్ర్రీన్ ఫ్లాష్ ఉంటుంది. వెలుతురు సరిగ్గా లేకున్నా సెల్ఫీ పర్‌ఫెక్ట్‌గా వస్తుంది.

క్యాండీ కెమెరా....(CANDY CAMERA)

క్యాండీ కెమెరా....(CANDY CAMERA)

సెల్ఫీలు ఎక్కువగా తీసుకునే వారికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. సెల్పీ తీసుకునే సమయంలో రియల్ టైమ్ ఎఫెక్ట్ లు, ఫిల్లర్లను అప్లె చేసుకునే సౌకర్యం ఉంటుంది. సెల్ఫీ ఎలా తీసుకున్నా...దాన్ని అందంగా ఆకర్షణీయంగా కనిపించేలా మార్చుకోవచ్చు. ఇందులో బ్యూటీ ఫంక్షన్, కొల్లేజ్ మోడ్ ఫీచర్లను అదనంగా అందిస్తున్నారు.

B612-సెల్ఫీజెనిక్ కెమెరా....

B612-సెల్ఫీజెనిక్ కెమెరా....

ఈ యాప్ ద్వారా తీసుకున్న సెల్ఫీని మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు మీ సెల్ఫీకి ఫన్ స్టిక్కర్స్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫోటో ఎఫెక్ట్ ఎక్సాట్రా కలర్‌తో ఫర్పెక్ట్‌గా కనిపిస్తుంది.

యూకామ్ పర్ ఫెక్ట్..(YOUCAM PERFECT)

యూకామ్ పర్ ఫెక్ట్..(YOUCAM PERFECT)

ఇది బెస్ట్ ఆండ్రాయిడ్ కెమెరా సెల్ఫీ యాప్. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ ఫోన్‌లోకి ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో మీరు స్టన్నింగ్ ఫోటోలు తీసుకోవచ్చు. ఇందులో మొత్తం ఆరు రకాల ఫ్రేమ్స్ ఉంటాయి. స్టిక్కర్స్, ఫన్ సీన్స్ ఉంటాయి. ఇది సెల్ఫీ తీసుకోవాలనుకునేవారికి బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు.

బ్యూటీ ప్లస్( BEAUTY PLUS)

బ్యూటీ ప్లస్( BEAUTY PLUS)

ఈ యాప్‌ను వాడేవారి సంఖ్య వంద మిలియన్లు దాటిపోయింది. ఇది బెస్ట్ సెల్ఫీ యాప్ అని చెప్పొచ్చు. ఫేస్ పై ఎటువంటి మచ్చలు, పింపుల్స్ ఉన్నా వాటిని క్లియర్ చేస్తూ ఫోటో తీసుకోవచ్చు. అంతేకాదు బ్యూటీ ప్లస్‌లో తీసుకున్న ఫోటోస్‌ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ , ట్విట్టర్‌లో షేర్ చేసుకోవచ్చు.

రిట్రీకా( RETRICA-Selfie, STICKER, GIF)

రిట్రీకా( RETRICA-Selfie, STICKER, GIF)

ఈ యాప్‌లో మీకు రకరకాల వింటేజ్‌ విల్లాలు కనిపిస్తాయి. మీకు నచ్చిన విధంగా సెల్ఫీలు తీసుకోవచ్చు. అంతేకాదు ఇందులో వంద రకాల స్టిక్కర్స్ కూడా ఉంటాయి. మీరు తీసుకున్న సెల్ఫీని వీటితో అందంగా డెకరేట్ చేసుకోవచ్చు.

బెస్ట్ మీ సెల్ఫీ కెమెరా(BESTME Selfie camera)

బెస్ట్ మీ సెల్ఫీ కెమెరా(BESTME Selfie camera)

ఈ యాప్‌లో రకరకాల ఫన్నీ స్టిక్కర్స్ ఉంటాయి. ఏమోజీ స్టిక్కర్స్‌తో సెల్ఫీలు తీసుకోవచ్చు.

హెచ్ డి సెల్ఫీ కెమెరా (HD Selfie camera)

హెచ్ డి సెల్ఫీ కెమెరా (HD Selfie camera)

ఈ యాప్ ద్వారా పర్‌ఫెక్ట్ సెల్ఫీ తీసుకోవచ్చు. కలర్ ఎఫెక్ట్స్‌తో పాటు జీపీఎస్ లొకేషన్ కూడా మీరు తీసుకునే సెల్ఫీలకు , సెల్ఫీ వీడియోలకు ట్యాగ్ చేసుకోవచ్చు.

సెల్ఫీ సిటీ (selfie city)

సెల్ఫీ సిటీ (selfie city)

ఈ యాప్‌ను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌లు తయారు చేశారు. మూవీ థీమ్‌తో ఈ యాప్ వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ బ్లర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మేకప్ ప్లస్ (makeup plus)

మేకప్ ప్లస్ (makeup plus)

ఈ యాప్ ఎక్కువగా మహిళలకు ఉపయోగపడుతుంది. మేకప్‌తో సెల్ఫీ తీసుకునేందుకు ఇది బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు.

Best Mobiles in India

English summary
Gone are those when you try to take a good picture with a rear smartphone camera. Skip to the present, we have selfie camera and half of the phone company find its promotion solely on this term -- selfie

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X