Home
Apps

ఇది వాట్సాప్‌ను తలదన్నే యాప్

ఈ యాప్ ద్వారా ఒక్క చాటింగ్ మాత్రమే కాదు బ్రౌజింగ్ కూడా చేసుకోవచ్చు.

By Sivanjaneyulu Bommu

Google Allo పేరుతో సరికొత్త స్మార్ట్ మెసేజింగ్ యాప్‌ను ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఒక్క చాటింగ్ మాత్రమే కాదు బ్రౌజింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ బహుళ ఉపయోగకర స్మార్ట్ మెసేజింగ్ యాప్ గురించి 10 ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్-బిల్ట్ గూగుల్ అసిస్టెంట్...

ఇన్-బిల్ట్ గూగుల్ అసిస్టెంట్...

Google Allo యాప్‌లో నిక్షిప్తం చేసిన గూగుల్ అసిస్టెంట్ అనేక విధాలుగా మీకు ఉపయోగపడుతుంది. గూగుల్ నౌ ఫీచర్‌కు ఎక్స్‌టెన్షన్‌గా పరిగణింపబడుతున్న ఈ ఫీచర్ ద్వారా విమానాల వివరాలు, రెస్టారెంట్ల వివరాలు తెలుసుకోవచ్చు.

స్మార్ట్ రిప్లై

స్మార్ట్ రిప్లై

Google Allo యాప్‌లో నిక్షిప్తం చేసిన మరో ఫీచర్ స్మార్ట్ రిప్లై. మీరు రిసీవ్ చేసుకున్న చివరి మెసేజ్ ఆధారంగా చేసుకుని ఈ ఫీచర్ కొన్ని రిప్లై సజెషన్స్ మీకు అందిస్తుంది.

Image recognition

Image recognition

Google Allo యాప్‌లో నిక్షిప్తం చేసిన స్మార్ట్ రిప్లై ఫీచర్ టెక్స్ట్ మెసేజ్‌లతో పాటు ఇమెజ్‌లను కూడా స్కాన్ చేసి రిప్లై సజెషన్స్ మీకు అందిస్తుంది. ఇది నిజంగా చాలా అద్బుతం.

 Whisper Shout

Whisper Shout

Google Allo యాప్‌ ద్వారా మీరు పంపే మెసేజ్‌లకు అదనపు హంగులను జోడించుకోవచ్చు. యాప్‌లోని మెసేజ్ సెండ్ బటన్‌ను పైకి స్లైడ్ చేయటం ద్వారా మీ మెసేజ్‌కు ‘shout' ఎఫెక్ట్ వస్తుంది. టెక్స్ట్ సైజ్ పెద్దదవుతుంది. సెండ్ బటన్‌ను క్రిందకు స్లైడ్ చేయటం ద్వారా ‘whisper' ఎఫెక్ట్ వస్తుంది. టెక్స్ట్ సైజ్ చిన్నదవుతుంది.

Doodle on images

Doodle on images

Google Allo యాప్‌ ద్వారా మీరు పంపే ఫోటోల పై బొమ్మలను డ్రా చేయవచ్చు. పదాలను కూడా టైప్ చేయవచ్చు.

End-to-end encryption

End-to-end encryption

 Google Allo యాప్‌ ద్వారా మీరు పంపే మెసేజ్‌లకు End-to-end encryption ఉంటుంది. వీటిని కనీసం గూగుల్ కూడా చదవలేదు.

Incognito Mode

Incognito Mode

 Google Allo యాప్‌‌లో ఏర్పాటు చేసిన Incognito Mode ఫీచర్ ద్వారా ప్రైవేట్ చాట్ సాధ్యమవుతుంది. ఈ మోడ్‌లో చాట్ చేస్తున్నపుడు సెండర్ పేరు మీద నోటిఫికేషన్స్ కూడా డిస్‌ప్లే అవ్వవు.

Set Messages to disappear

Set Messages to disappear

 Google Allo యాప్‌‌లో సెక్యూరిటీకి మరింత పెద్దపీట వేసారు. End-to-end encryption,Incognito Modeల‌తో పాటు కొంత సమయం తరువాత మెసేజ్‌లు వాటంతటకవే డిలీట్ అయిపోయే విధంగా సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు.

More stickers

More stickers

Google Allo యాప్‌‌లో పదాలతో వ్యక్తం చేయలేని కొన్ని భావాలను స్టిక్కర్స్ ద్వారా వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది.

Cross-platform support

Cross-platform support

Google Allo యాప్‌‌ ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌‍లను సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐఓఎస్ యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి యాప్‌‌ను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
10 Cool Things You Should Know About Google Allo. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X