స్మార్ట్ ఫోన్లను ఊపేస్తున్న పది గేమ్స్ ఇవిగో ?

Posted By: Madhavi Lagishetty

గేమింగ్ అనగానే చిన్న పెద్ద ఎవరైనా ఊగిపోతారు. చేతి మునివేళ్లను టపటపా కదుపుతూ డిజిటల్ ప్రపంచంలో విహరిస్తుంటారు.

స్మార్ట్ ఫోన్లను ఊపేస్తున్న పది గేమ్స్ ఇవిగో ?

మరి గేమింగ్ ప్రియులకు ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే కొన్ని వందల వేల గేమ్స్ కళ్లముందు కదలాడుతాయి. వాటిలో ఏవి సెలెక్ట్ చేసుకోవాలో తెలీక తికమక పడుతుంటారు. అలాంటి వారికోసం ఓ పది గేమ్స్ మీ కోసం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రాష్‌లాండ్స్ :

క్రాష్ లాండ్స్ గేమ్ ప్రస్తుతం ట్రెండీ గేమ్‌గా ఉంది. ఇందులో కొత్త స్నేహితులను చేసుకోవడంతో పాటు కొన్ని రహస్యాలను శోధిస్తూ ముందుకు పోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ యాండ్రయిడ్ గేమ్స్ అన్నింటిలో దీని ప్రత్యేకతే వేరు. ఒక ఏలియన్ గ్రహంపై క్రాష్ ల్యాండ్ అయిన స్పేస్ షిప్ లో ఉన్న వ్యోమగాములు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటారో చూపే ప్రయత్నమే ఈ గేమ్

జామెట్రివార్స్ :

ఇందులో వంద లెవెల్స్, 12 బ్యాటిల్ మోడ్స్, అలాగే 15కు పైగా త్రీడీ గ్రిడ్స్ ఉంటాయి. ఇది స్నేహితులతో షేర్ చేసుకుంటూ ఆడొచ్చు. అయితే ప్లే స్టోర్ లో ఇది ఫ్రీ మాత్రం కాదు. దీన్ని 690 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

హార్త్ స్టోన్ :

ఇది ఒక కార్డ్ గేమ్, ఇందులో ప్రత్యర్థుల కన్నా కూడా మీరు ఎంతో చాకచక్యంగానూ మోసపూరితంగానూ బోల్తా కొట్టించేలా ఆడాల్సి ఉంటుంది. అనుక్షణం ఉత్కంఠభరితంగా ఉండే ఈ గేమ్‌లో స్లింగ్ స్పెల్స్, సమ్మన్ మినియన్స్, అలాగే బ్యాటిల్ ఫీల్డ్ మోడ్ ఉంటాయి. అయితే ఈ గేమ్ డౌన్లోడ్ చేసి ఆడాలంటే మాత్రం మీ డివైజ్ లో మినిమం 2 జీబీ స్థలం ఖాళీగా ఉంచాలి.

పోకిమాన్ గో :

ప్రపంచమంతా ఉర్రూతలూగించిన మోస్ట్ అడ్వంచర్ గేమ్ పోకిమాన్ గో ఇది పూర్తిగా వర్చువల్ గేమ్, నిత్య జీవితంలో మన చుట్టూ ఉన్న ప్రపంచమే గేమ్ జోన్, దీన్ని ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 75 కోట్ల మంది డౌన్లోడ్ చేసి ఆడుతున్నారు. గేమ్ డెవలపర్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో బెస్ట్ మొబైల్ గేమ్‌గా పోకిమాన్ గో పేరొందింది. మన చుట్టూ ఉన్న పరిసరాల్లోనే పోకిమాన్ లను గేమింగ్ కమాండ్స్ ద్వారా వెతకాల్సి ఉంటుంది. ఇదే ఈ గేమ్ ప్రత్యేకత.

రాక్‌స్టార్ గేమ్స్ :

రాక్‌స్టార్ అనేది ఒక సెట్ ఆఫ్ గేమ్స్. ఇందులో బాగా పేరొందిన గేమ్స్ గ్రాండ్ థెఫ్ట్ ఆటో త్రీ, వైస్ సిటీ, సాన్ అండ్రియాస్ ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఓ స్కూల్ విద్యార్థి కేంద్రంగా పనిచేసే ఒక గేమ్ ఉంటుంది.

రిప్ టైడ్ జీపీ : రెనెగెడె

ఇది ఒక హైడ్రో జెట్ రేసింగ్ గేమ్, ఇందులో ఎత్తైన జలపాతాలు, అలాగే వెంటాడే పోలీసులు ఉంటారు. ముఖ్యంగా పబ్లిక్ జల మార్గాల గుండా ఈ గేమ్ సింగిల్ ప్లేయర్ ఎనేబుల్డ్ గా ఉంది. ఇందులో కొత్త వెహికిల్స్ మార్చడంతో పాటు స్క్రిన్స్ కూడా మార్చుకునే సౌకర్యం ఉంది. అయితే స్ర్కీన్ స్ప్లిట్ ద్వారా ఒకే సారి నలుగురు ఈ గేమ్ ఆడే వీలుంది.

దిస్ వార్ ఆఫ్ మైన్

ఈ గేమ్‌లో దిగ్బంధం చేసిన ఒక సిటీలోని ప్రజలు తమకు ఎదురైన సవాళ్లతో సవాసం చేస్తూ, ఆహారం లేకుండా, నిద్రలేకుండా స్నైపర్స్, అలాగే దుర్మార్గమైన శక్తులతో కలిసి చేసే పోరాటమే ఈ గేమ్ కాన్సెప్ట్. ఎవరైతే లాంగ్ టర్మ్ తమ శక్తిని కాపాడుకుంటారో వారే ఈ గేమ్ విన్నర్.

టైటాన్ క్వెస్ట్

ఇది రోల్ ప్లేయింగ్ గేమ్ సెటప్ ఉన్న గేమ్, ఈ గేమ్ అంతా ప్రాచీన పురాణాలకు సంబంధించిన బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఖైదు నుంచి పారిపోయిన ఇద్దరు టైటాన్స్ భూమిని నాశనం చేయాలని చూస్తారు. వారి నుంచి భూమిని కాపాడేందుకు పోరాటం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఆర్చరీ, కత్తి విద్య లాంటి ప్రాచీన యుద్ధ విద్యలు ప్రదర్శించే వీలు కలుగుతుంది.

అన్ కిల్డ్ : మల్టీ ప్లేయర్ జాంబీ సర్వైవల్ షూటర్

ఈ గేమ్ లో 5 కేరక్టర్ లు ఉంటాయి. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఒక టీమ్ లో చేరాలి. అక్కడి ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితుల్లో పోరాటం చేయాల్స ఉంటుంది. మల్టీ ప్లేయర్ గేమ్ గా ఉన్న ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

వెయిన్ గ్లోరీ

ఇది మల్టీప్లేయర్ ఆన్‌లైన్ బ్యాటిల్ ఎరీనా ఇందులో లైవ్ ప్లేయర్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జంగిల్ నేపథ్యంలో సాగే ఈ గేమ్ లో ఒకరు లీడ్ తీసుకోవాల్సి ఉంటుంది. వారిని కెప్టెన్ గా చూస్తారు. ఈ గేమ్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Gaming in smartphones has improved a long way with lots intensive and immersive graphic experience, story, game play and much more. Let's have a look at the top 10 games that you can install right now on your mobile.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot