ఈ 10 ట్రిక్స్ గురించి తెలిస్తే టెక్నాలజీ ఇంత సులువా అనేస్తారు!

Posted By: BOMMU SIVANJANEYULU

షార్ట్‌కట్‌లను ఫాలో అవటం ద్వారా టెక్నాలజీని చాలా సింపుల్‌గా హ్యాండిల్ చేయవచ్చు. ఇప్పుడు మేము సూచించబోతోన్న కొన్ని ట్రిక్స్‌ మిమ్మల్ని టెక్నాలజీ ఎక్స్‌పర్ట్‌గా మార్చేస్తాయి. ఇకెందుకు ఆలస్యం, వాటి

గురించి తెలిసేసుకుందాం రండి...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ ట్రిక్‌తో ఫోటో ఎడిటింగ్ చాలా సింపుల్

సాధారణంగా ఏదైనా ఇమేజ్‌ను ఎడిట్ చేయాలంటే ముందుగా ఆ ఫోటోను డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. ఇక పై అలా చేయకుండా ఆ ఇమేజ్‌కు సంబంధించిన URL‌ను కాపీ చేసుకుని నేరుగా Paintలో పేస్ట్ చేసినట్లయితే ఇమేజ్ ఓపెన్ అయిపోతుంది. ఆ ఫోటోను మీరు కావల్సిన విధంగా ఎడిట్ చేసుకునే వీలుంటుంది.

Google Imagesలో సరదా సరదా గేమ్

ఇంటర్నెట్ అందుబాటులో లేనే సమయంలో కనిపించే క్రోమ్ ఎర్రర్ పేజ్ గేమ్‌ను ఆడిఆడి విసిగిపోయారా..? అయితే మీకో సరదా గేమ్ సూచిస్తున్నాం. గూగుల్ ఇమేజెస్‌ (https://images.google.com/) పేజీలోకి వెళ్లి సెర్చ్ బాక్సులో "Atari Breakout" అని టైప్ చేసినట్లయతే స్ర్కీన్ పై ఓ క్లాసిక్ గేమ్ ప్రత్యక్షమవుతుంది.

ఇన్‌స్టాలేషన్ అవసరం లేని బెస్ట్ ఆన్‌లైన్ ఇమేజ్ ఎడిటర్

మార్కెట్లో లభిస్తోన్న బెస్ట్ ఇమేజ్ ఎడిటింగ్ యాప్స్‌లో SumoPaint.com (https://www.sumopaint.com/home/) ఒకటి. ఈ యాప్‌ను ఏ విధమైన ఇన్‌స్టాలేషన్ అవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకుని ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ ఎడిటర్‌ను పెయింటింగ్ అప్లికేషన్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. ఎడిట్ చేసిన ఫోటోలను కంప్యూటర్ హార్డ్‌డ్రైవ్ లేదా క్లౌడ్ స్టోరేజ్‌లో సేవ్ చేసుకునే వెసలుబాటు ఉంటుంది.

ఒప్పో F3 దీపావళి స్పెషల్ ఎడిషన్ లాంచ్, ఫీచర్లు ఇవే..

మీ ఫోన్ నోటిఫికేషన్స్ కంప్యూటర్‌లో కనిపించాలా..?

మీ ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్స్ కంప్యూటర్‌లో డిస్‌ప్లే అవ్వాలా, అయితే Pushbullet.com (https://www.pushbullet.com/)ను ట్రై చేయండి. పుష్ టెక్నాలజీతో పనిచేసే ఈ అసాధారమైన యాప్ ద్వారా కంప్యూటర్‌లోని ఫైల్స్‌ను చిటికెలో మొబైల్ ఫోన్‌లలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దాదాపుగా అన్ని బ్రౌజర్‌లలో pushbullet ఎక్స్‌టెన్షన్‌ వర్క్ అవుతుంది. Pushbullet ఎక్స్‌టెన్షన్‌ ద్వారా నేరుగా మీ కంప్యూటర్ నుంచే మొబైల్ మెసేజ్‌లను పంపుకోవచ్చు. ఫోన్‌కు అందే నోటిఫికేషన్‌లను కంప్యూటర్‌లో చూడొచ్చు. ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేయవచ్చు. లింక్స్ షేర్ చేయవచ్చు.

సైన్‌ఇన్ కాకుండా కూడా ఏజ్ రిస్ట్రిక్టెడ్ వీడియోలను చూడటమెలా..?

యూట్యూబ్‌లో ఏజ్ రిస్ట్రిక్టెడ్ వీడియోలను వీక్షించాలంటే ముందుగా వయసును కన్ఫర్మ్ చేయవల్సి ఉంటుంది. వయసును కన్ఫర్మ్ చేసే క్రమంలో తప్పనిసరిగా గూగుల్ అకౌంట్‌లోకి సైన్‌ఇన్ కావల్సి ఉంటుంది. ఇలా చేయకుండానే నేరుగా ఆ వీడియోలను వీక్షించాలంటే youtube.comకు ముందు nsfw అని టైప్ చేయండి.

టీవీ రిమోట్ కంట్రోల్ పనిచేస్తుందో లేదో చెక్ చేయాలంటే..?

మీ టీవీ రిమోట్ కంట్రోల్ వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవాలంటే ఈ సింపుల్ ట్రిక్‌ను ట్రై చేసి చూడండి. ముందుగా మీ ఫోన్ కెమెరాను ఆన్ చేసి రిమోట్ పై ఫోకస్ చేయండి. ఈ సమయంలో మీరు రిమోట్ బటన్ పై ప్రెస్ చేసినట్లయితే కాంతి ప్రసరించబడుతుంది. ఇలా జరిగినట్లయితే మీ టీవీ రిమోట్ చక్కగా పనిచేస్తున్నట్లే.

ఫోటో మీద టెక్స్ట్‌ను తీసేయాలా..?

Project Naptha అనే బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌ ద్వారా ఫోటోల పై కనిపించే టెక్స్ట్‌ను Erase చేయవచ్చు. కావాలంటే ఈ టెక్స్ట్‌ను మాడిఫై కూడా చేసుకోవచ్చు.

కాలిక్యులేటర్‌లో C బటన్ అంటే ఏంటి..? CE బటన్ అంటే ఏంటి..?

కాలిక్యులేటర్‌లో C అలానే CE బటన్‌లను మనం పక్కపక్కన చూస్తుంటాం. C అంటే క్లియర్ అని CE అంటే క్లియర్ ఆల్ ఎంట్రీ అని అర్థం. వీటిలో C బటన్ పై ప్రెస్ చేసినట్లయితే ఎంట్రీలు మొత్తం క్లియర్ అయిపోతయింది. CE బటన్ పై ప్రెస్ చేసినట్లయితే రీసెంట్ ఎంట్రీ మాత్రమే క్లియర్ అవుతుంది.

యూట్యూబ్ వీడియోను “gif” ఫైల్‌గా మార్చాలా..?

యూట్యూబ్ వీడియోను "gif" ఫైల్‌గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారా..? అయితే, youtube.comకు ముందు gifను యాడ్ చేసినట్లయితే ఆ వీడియో కాస్తా జిఫ్ పైల్‌గా మారిపోతుంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ మిస్ అయ్యిందా..?

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను పోగొట్టుకున్నారా? అయితే, ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ సహాయంతో ఆ ఫోన్‌ను ట్రాక్ చేసే వీలుంటుంది. Android Device Manager సహాయంతో మీ ఫోన్‌ను Ring, erase లేదా lock చేసే వీలుంటుంది. రింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసినట్లయితే ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పటికి బెగ్గరగా రింగ్ అవుతుంది. Erase ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా ఫోన్‌లోని డేటా మొత్తం ఎరేజ్ కాబడుతుంది. లాక్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా ద్వారా ఫోన్ మొత్తం లాక్ అయిపోతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here are the most intresting things you can actually do on google, youtube, paint and more.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot