మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

|

ప్రపంచ జనాభా, ఆధునిక కమ్యూనికేషన్ అవసరాలకు అనుగుణంగా ఫీచర్ ఫోన్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌గ్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లకు ఎక్కడాలేని క్రేజ్ ఏర్పడింది. ఈ ఓఎస్ ఆధారిత డివైస్‌లను వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తక్కువ ధర. సౌకర్యవంతమైన యూజర్ ఇంటర్‌ఫేస్, అందుబాటులో లెక్కకు మిక్కిలి యాప్స్ వెరిసి ఆండ్రాయిడ్ ఫోన్‌లను అద్భుత స్మార్ట్ కమ్యూనికేషన్ పరికరాలుగా మార్చేసాయి.

Read More : మీ Android పోన్‌‌కు మాది గ్యారెంటీ, బెస్ట్ బ్యాటరీ సేవింగ్ టిప్స్!

మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

ఫీచర్‌ ఫోన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌కు పూర్తిగా భిన్నంగా ఉండే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ రకరకాల యాప్స్‌తో నిండి ఉంటుంది. మొదటిసారి స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించే వారికి ఈ యాప్స్ వాటి ప్రాముఖ్యత గురించి అస్సలు అవగాహన ఉండదు. మొదటిసారి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తోన్న వారి వద్ద ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్ అలానే వాటి అవసరాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.

Read More : డిజిటల్ కెమెరా వద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు!

మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనసరిగా Antivirus యాప్ ఉండి తీరాలి. 360 సెక్యూరిటీ, AVG యాంటీవైరస్, ESET మొబైల్ సెక్యూరిటీ, Kaspersky వంటి ఉచిత యాంటీ వైరస్ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి, వీటిలో ఏదో ఒక యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని, డివైస్ సెక్యూరిటీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోండి.

మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన ముఖ్యమైన యాప్‌లలో Truecaller ఒకటి. ఈ యాప్ గురించి తెలియని స్మార్ట్‌ఫోన్ యూజర్ అంటు ఉండరు. గుర్తుతెలియని నెంబర్‌ల నుంచి వచ్చే మొబైల్ కాల్స్‌ను ట్రేస్ చేయటంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ యాప్ ద్వారా గుర్తు తెలియని కాంటాక్ట్ నెంబర్‌కు సంబంధించి అడ్రస్‌తో సహా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ యాప్స్ పనిచేయాలంటే తప్పనిసరిగా మీ ఫోన్ ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉండాలి.

మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్
 
మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

నేటి ఆధునిక కమ్యూనికేషన్ అవసరాలకు అనుగుణంగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక సంబంధాల యాప్స్ ఉండాలి. వీటి ద్వారా నిరంతరం మీ ఆప్తులతో కనెక్ట్ అయి ఉండొచ్చు.

మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

సంగీతమంటే మీకు ఇష్టమా..? అయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్‌లలో Gaana, Saavn, Wynk Music వంటి మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్ కు చోటివ్వండి. ఈ యాప్స్ పనిచేయాలంటే తప్పనిసరిగా మీ ఫోన్ ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉండాలి.

మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

మీరు తరచూ ప్రయాణాలు చేస్తుంటారా..? అయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్‌లలో ట్రాన్స్‌పోర్ట్ యాప్స్‌కు చోటు ఇవ్వండి. మీ ప్రాధాన్యతను బట్టి Ola, Uber, Shuttl వంటి యాప్స్‌ను మీ ఫోన్‌‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి.

మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

ఆన్‌లైన్ షాపింగ్ రోజురోజుకు విస్తరిస్తోన్న నేపథ్యంలో, మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో Flipkart, Amazon, Snapdeal ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ తప్పనిసరిగా ఉండాలి.

మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

మీరు ఆహార ప్రియులా, తరచూ ఆహారాన్ని ఆర్డర్ చేస్తుంటారా..? అయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో Zomato, Swiggy, FoodPanda వంటి ఫుడ్ ఆర్డర్ యాప్స్ తప్పనిసరిగా ఉండాలి.

మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

రాయితీలతో కూడిన ఆన్‌లైన్ చెల్లింపులకు Paytm, Oxigen వంటి మొబైల్ వాలెట్ యాప్స్ మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండేలా చూసుకోండి.

మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

ఫోన్ ద్వారా చిత్రీకరించే ఫోటోలను ఇన్‌స్టెంట్‌గా ఎడిట్ చేసేందుకు అడోబ్ లైట్‌రూమ్, VSCO Cam, Snapseed, Instagram వంటి ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉండేలా చూసుకోండి.

మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

మీరు గేమింగ్ ప్రియులా, అయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో Angry Birds, Temple Run వంటి గేమిగ్ యాప్స్ మీ ఫోన్‌లో ఉండేలా చూసుకోండి.

Best Mobiles in India

English summary
10 must have apps for your first Android smartphone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X