ఈ 10 పాపులర్ అండ్రాయిడ్ యాప్‌లకు దూరంగా ఉండండి

గూగుల్ ప్లే స్టోర్ లో ఎన్నో వేల యాప్స్ మీ స్మార్ట్ ఫోన్ హెల్త్ ను బాగుచేస్తామంటూ కుప్పలు తెప్పలుగా యాప్స్ అందుబాటులో ఉంటాయి.

|

గూగుల్ ప్లే స్టోర్ లో ఎన్నో వేల యాప్స్ మీ స్మార్ట్ ఫోన్ హెల్త్ ను బాగుచేస్తామంటూ కుప్పలు తెప్పలుగా యాప్స్ అందుబాటులో ఉంటాయి. అయితే ఈ యాప్స్ ఎంత వరకూ నిజంగా పనిచేస్తాయి అనేది సందేహాస్పదమే. చాలామంది తెలియని యాప్స్ డౌన్లోడ్ చేయడం వల్ల ఫోన్ సమస్యల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. హ్యాకర్లు మీ ఫోన్ ని సులువుగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి యాప్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సందేహాలను తీర్చేందుకే ఈ టాప్ 10 టైం వేస్ట్ యాప్స్ కు మీ స్మార్ట్ ఫోన్ దూరంగా ఉంటే అటు డేటా, మరియు స్పేస్ కలిసి వస్తాయి. అవేంటో చూద్దాం.

షియోమీ కంపెనీ నుంచి రాబోతున్న మరో 3 స్మార్ట్ ఫోన్స్షియోమీ కంపెనీ నుంచి రాబోతున్న మరో 3 స్మార్ట్ ఫోన్స్

క్విక్ పిక్ :

క్విక్ పిక్ :

ఇది మీ ఫోన్లో గ్యాలరీ లాంటిది. మీరు స్టోర్ చేసుకున్న ఫోటోలను చూపిస్తుంది. కానీ పెద్ద మొత్తంలో మెమరీ దీని వల్ల లాస్ అయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకూ ఈ యాప్ కు దూరంగా ఉండటం ఉత్తమం.

ఈఎస్ ఫైల్ ఎక్స్ ప్లోరర్ :

ఈఎస్ ఫైల్ ఎక్స్ ప్లోరర్ :

ఈ యాప్ ఉపయోగకరమైనదే, ఫైల్ ఎక్స్ ప్లోరింగ్ లో ఉపయోగపడుతుంది. కానీ ఈ యాప్ ఫ్రీ వెర్షన్ పూర్తిగా యాడ్స్ తో నిండి ఉంటుంది.

యూసీ బ్రౌజర్ :

యూసీ బ్రౌజర్ :

ఇది యాండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో పాప్యులర్ అయ్యిందే కానీ, ఇందులోని అన్ క్రిప్టెడ్ సర్వీసు వల్ల డేటా చౌర్యం గురయ్యే అవకాశం ఎక్కువ.

క్లీన్ ఇట్ :

క్లీన్ ఇట్ :

దీని ద్వారా ర్యామ్ క్లీన్ చేసినప్పుడల్లా బ్యాటరీ కరిగిపోవడం తప్ప పెద్దగా ఉపయోగమేమి లేదు.

మ్యూజిక్ ప్లేయర్ :

మ్యూజిక్ ప్లేయర్ :

ఇది పూర్తిగా యాడ్స్ తో నిండి ఉంటుంది. మీకు తలనొప్పి రావడం ఖాయం.

డీయూ బ్యాటరీ సేవర్ అండ్ ఫాస్ట్ చార్జ్ :

డీయూ బ్యాటరీ సేవర్ అండ్ ఫాస్ట్ చార్జ్ :

ఈ యాప్ బ్యాటరీని సేవ్ చేస్తున్నట్లు క్లెయిమ్ చేస్తుంది. కానీ నిజానికి ఇది నోటిఫికేషన్ల ద్వారా యాడ్స్ ప్రమోట్ చేయడం తప్ప పెద్దగా యూజ్ లేదు.

డాల్ఫిన్ వెబ్ బ్రౌజర్ :

డాల్ఫిన్ వెబ్ బ్రౌజర్ :

ఇది పేరుకి యాడ్ ఫ్రీ. కానీ మీ యాక్టివిటీస్ అన్నింటిని ట్రాక్ చేస్తుంది. ఇక నీచం ఏమిటంటే మీ ఇన్ కాగ్నిటో మోడ్ ను కూడా ట్రాక్ చేస్తుంది.

ఫోటో కొలేజ్ :

ఫోటో కొలేజ్ :

ఈ యాప్ వల్ల పెద్దగా యూజ్ ఏమి ఉండదు. అవసరం అయినప్పుడు దీన్ని ఇన్ స్టాల్ చేసుకొని, లేని సమయంలో తీసివేయడం వల్ల మీకు స్పేస్ కలిసివస్తుంది.

క్లీన్ మాస్టర్ :

క్లీన్ మాస్టర్ :

ఈ యాప్ బ్యాటరీ సేవర్ అని అలాగే స్పీడ్ బూస్టర్, ఫోన్ ఆప్టిమైజర్ గా క్లెయిమ్ చేసుకుంటుంది. కానీ ఈ యాప్ కు అంత సీన్ లేదు. కేవలం ర్యామ్ పెర్ఫామెన్స్ అంచనా వేయడం ఒక్కటే దీని పని.

యాంటీ వైరస్ యాప్స్ :

యాంటీ వైరస్ యాప్స్ :

నిజానికి యాంటీ వైరస్ యాప్స్ తో పెద్దగా ఉపయోగం ఉండదు. అవసరం లేకపోయినా వీటిని ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా మీ స్పేస్ వేస్ట్ అవుతుంది.

Best Mobiles in India

English summary
There are millions of apps out there. You can literally find an app for everything. We end up downloading an app even for saving battery as if that app won’t be consuming any energy.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X