Just In
- 45 min ago OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- 7 hrs ago Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- 8 hrs ago మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- 11 hrs ago Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
Don't Miss
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Movies Hyper Aadi: నిన్ననే సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హైపర్ ఆది.. షోలో వైఫ్ ఫేస్ రివీల్.. మీరూ చూశారా?
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వాట్సప్ వాడటమే కాదు,ఈ తెలియని ఫీచర్లు కూడా గుర్తు పెట్టుకోండి
స్మార్ట్ మెసేజింగ్ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీని సొంతం చేసుకున్న వాట్సప్ సరికొత్త సంచలనాలతో దూసుకుపోతోంది.
స్మార్ట్ మెసేజింగ్ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీని సొంతం చేసుకున్న వాట్సప్ సరికొత్త సంచలనాలతో దూసుకుపోతోంది. ఇందుకు కారణం ఈ యాప్ అందిస్తోన్న వేగవంతమైన సర్వీసులే. ఫోటో మొదలుకుని మ్యూజిక్ ఫైల్ వరకు ఏదైనా వాట్సాప్ ద్వారా క్షణాలో షేర్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్.. విండోస్.. ఐఓఎస్, ఇలా ఏ మోడల్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారైనా వాట్సప్‌ను వినియోగించకుండా ఉండలేరు. వాట్సాప్ అప్లికేషన్‌ను మరింత సమర్థవంతంగా వాడుకునేందకు 10 బెస్ట్ టిప్స్‌ను మీకు సూచిస్తున్నాం.
మీ కంప్యూటర్ మౌస్తో అద్భుతాలు చేయొచ్చు, ఎలాగో చూడండి
స్ర్కీన్ ఆఫ్ సమయంలో నోటిఫికేషన్లు పాపప్ కావాలంటే..?
వాట్సప్ మెసేజ్ అందిన ప్రతిసారి ఫోన్ ను అన్ లాక్ చేయవల్సి వస్తుందా..? ఈ సమస్యకు వాట్సాప్ చక్కటి పరిష్కారం చూపుతోంది. ఫోన్ లాక్ చేసిన ఉన్నప్పటికి వాట్సాప్ మెసేజ్‌లను చూసేందుకు ఇలా చేయండి. సెట్టింగ్స్ లోకి వెళ్లి Notifications > Popup Notifications > Only When Screen Off.
మెసేజ్ ను బుక్క్ మార్క్ చేయదలచినట్లయితే
బుక్ మార్క్ చేయాలనుకుంటున్న మెసేజ్ పై టాప్ చేసి కొద్ది సేపు ఉంచండి. అప్పుడు, టాప్ బార్ పై delete, copy, forward అలానే star iconలు కనిపిస్తాయి. వాటిలో స్టార్ ఐకాన్ పై టాప్ చేసినట్లయితే మెసేజ్ బుక్ మార్క్ కాబడుతుంది.
ఈమెయిల్ కు పంపుకోవటం..
మీ వాట్సాప్ సంభాషణలను అనేక రకాలుగా బ్యాకప్ చేసుకునే వీలుంది. ఉదాహరణకు మీ వాట్సప్ మేసేజ్‌లను ఈమెయిల్లో బ్యాకప్ చేసుకోవాలనుకుంటున్నారు..? అయితే ఇలా ట్రై చేయండి.. ముందుగా మీరు బ్యాకప్ చేయాలనుకుంటున్న పర్సనల్ లేదా గ్రూప్ చాట్ పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు అనేక ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో email chat పై టాప్ చేయండి. ఇప్పుడు కోరుకుంటున్న conversation మొత్తం మీ ఈ మెయిల్ అడ్రస్ లోకి సెండ్ కాబడుతుంది.
డీఫాల్ట్ బ్యాక్‌గ్రౌండ్
మీ వాట్సాప్ అకౌంట్‌కు డీఫాల్ట్‌గా వచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ను చూసి బోర్‌గా ఫీలవుతున్నారా..? అయితే మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌తో వాట్సాప్‌ను తీర్చిదిద్దండి. ఇలా చేయాలంటే స్ర్కీన్ కుడివైపు పై భాగంలో కనిపించే మూడు నిలువు చుక్కల పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లినట్లయితే మీకు వాల్ పేపర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ లోకి వెళ్లినట్లయితే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. వాటిలో మీకు నచ్చిన ఫోటోను బ్యాక్ గ్రౌండ్ గా సెట్ చేసుకోవచ్చు.
షార్ట్ కట్
మీ వాట్సాప్ అకౌంట్ లోని కాంటాక్ట్స్ కు షార్ట్ కట్ లను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే, ఇలా చేయండి. షార్ట్ కట్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్న కాంటాక్ట్ పై టాప్ చేయండి. ఇప్పుడు అనేక ఆప్షన్ప్ స్ర్కీన్ పై పాపప్ కాబడతాయి. వాటిలో మొదటి ఆప్షన్ అయిన ‘add chat shortcut'ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మీ కాంటాక్ట్ కు షార్ట్ కట్ క్రియేట్ కాబడుతుంది.
Media auto-download
వాట్సాప్ అకౌంట్లో నిత్యం అనేక మీడియా ఫైల్స్ షేర్ అవుతుంటాయి. వీటిని ఆటోమెటిక్‌గా మీ వాట్సాప్ అకౌంట్ డౌన్లోడ్ చేసుకుంటుంది.ఈ కారణంగా బోలెడంత మొబైల్ డేటా ఖర్చవుతుంటుంది. అయితే, ఈ డేటా ఖర్చును కంట్రోల్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పిస్తోంది. అకౌంట్ సెట్టింగ్స్ లో వెళ్లి Media auto-download ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవటం వల్ల మీకు నచ్చిన డేటాను మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే వెసలబాటు ఉంటుంది.
వాట్సప్ వెబ్ ఫీచర్
వాట్సప్ వెబ్ ఫీచర్ అందుబాటులోకి రావటంతో వాట్సాప్ అకౌంట్లను డెస్క్‌టాప్ పీసీల పై హ్యాండిల్ చేయగలుగుతున్నాం. మీ వాట్సాప్ అకౌంట్, వాట్సాప్ వెబ్‌కు అనుసంధానించుకోవాలంటే ముందుగా మీ డెస్క్‌టాప్ వెబ్‌బ్రౌజర్‌లోని web.whatsapp.comలోకి వెళ్లండి. ఓ క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఇపుడు మీ ఫోన్ కుడి వైపు కార్నర్లో కనిపించే మూడు చుక్కలు పై క్లిక్ చేసి WhatsApp Web ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయండి. ఇలా చేయాలంటే తప్పనిసరిగా రెండు డివైజ్ లు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉండాలి.
లాస్ట్ సీన్
మీ వాట్సాప్ అకౌంట్లో లాస్ట్ సీన్ ఆప్షన్‌ను డిసేబుల్ చేయాలనుకుంటే Settings > Account > Privacy > Last Seen, and select ‘Nobody'
25 మంది మిత్రులకు ఒకేసారి బల్క్ సందేశాలను
వాట్సాప్‌లో డీఫాల్ట్‌గా 25 మంది మిత్రులకు ఒకేసారి బల్క్ సందేశాలను పంపుకునే వీలుంది. మాన్యువల్‌గా కాపీ, పేస్ట్ చేసినట్లయితే 52 మందికి ఒకేసారి ఎస్ఎంఎస్ను షేర్ చేయవచ్చు.ముందుగా మీ వాట్సాప్ అప్లికేషన్‌లోని యాక్టివ్ చాట్స్ పేజీని ఓపెన్ చేయండి. ఆ తరువాత మెనూ సాఫ్ట్ ‘కీ'ని ప్రెస్ చేసి More option పై ట్యాప్ చేయండి.మోర్ ఆప్షన్ మెనూలోని Broadcast messageను సెలక్ట్ చేసుకోండి.తదుపరి చర్యలో భాగంగా మీరు ఎస్ఎంఎస్ పంపాలనకుంటున్న మిత్రల కాంటాక్ట్‌లను టిక్ మార్క్ చేయండి.ఇప్పుడు Broadcast message బాక్సులో ఎస్ఎంఎస్ను టైప్ చేసి సెండ్ బటన్ పై ప్రెస్ చేయండి. అవసరమనుకుంటే తరువాతి బ్యాచ్‌కు ఆ ఎస్ఎంఎస్ను పంపేందుకు కాపీ చేసుకోండి.వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్లను పంపుకునే Broadcast message ఫీచర్ అన్ని ఫ్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి చూడండి మరి.
బ్రౌజర్ క్లోజ్ చేసి ఉన్నప్పటికి
వాట్సాప్ డెస్క్‌టాప్ నోటిఫికేషన్స్ క్రోమ్ ప్లగిన్‌ను ఇన్స్‌స్టాల్ చేసకోవటం ద్వారా మీ వాట్సాప్ అకౌంట్నో కు సంబంధించిన నోటిఫికేషన్లను డెస్క్‌టాప్ పై పొందవచ్చు. బ్రౌజర్ క్లోజ్ చేసి ఉన్నప్పటికి నోటిఫికేషన్ అలర్ట్స్ మీకు కనిపిస్తాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470