మిరాజ్ 2000 గురించి ప్రపంచానికి తెలియని నిజాలు

పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయడానికి మిరాజ్‌-2000 యుద్ధవిమానాలను భారత వైమానిక దళం ఉపయోగించింది. కాగా 1971 యుద్ధం తర్వాత పాకిస్థాన్‌ గగనతలంలోకి మన యుద్ధవిమానాలు

|

పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయడానికి మిరాజ్‌-2000 యుద్ధవిమానాలను భారత వైమానిక దళం ఉపయోగించింది. కాగా 1971 యుద్ధం తర్వాత పాకిస్థాన్‌ గగనతలంలోకి మన యుద్ధవిమానాలు దూసుకెళ్లడం ఇదే మొదటిసారి. భారత్‌ వద్ద మిరాజ్‌తో పోలిస్తే సుఖోయ్‌-30 ఎంకేఐ, మిగ్‌-29 వంటి ఆధునిక యుద్ధవిమానాలు ఉన్నాయి. అయినా ఈసారి వైమానిక దళం తనకు అత్యంత విశ్వాసపాత్రమైన మిరాజ్‌-2000 వైపే మొగ్గింది.

 
మిరాజ్ 2000 గురించి ప్రపంచానికి తెలియని నిజాలు

తాజా దాడిలో అనేక యుద్ధవిమానాలు, వ్యవస్థలు తోడ్పాటు అందించినప్పటికీ శత్రు భూభాగంలోకి దూసుకెళ్లి, ఉగ్రవాద శిబిరాలపై బాంబులు ప్రయోగించింది ఈ యుద్ధ విమానమే. అందులో ఏముంది , ఆర్మీ దానినే ఎందుకు సెలక్ట్ చేసుకుంది అనే విషయాలను ఓ సారి పరిశీలిస్తే..

బహుళ సామర్థ్యాలు

బహుళ సామర్థ్యాలు

మిరాజ్‌-2000 యుద్ధవిమానాలకు బహుళ సామర్థ్యాలు ఉన్నాయి. ఇందులో థేల్స్‌ ఆర్‌డీవై 2 రాడార్‌ ఉంది. లేజర్‌ మ్యాపింగ్‌ విధానం ద్వారా అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలపై దాడి చేయవచ్చు. ఒక్క నిమిషంలో 1,200 నుంచి 1,800 రౌండ్లు ఫిరంగుల్ని పేల్చగలదు.

లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం

లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం

సుదూరం నుంచే లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఈ యుద్ధవిమానానికి ఉంది. పైలట్ల హెల్మెట్లపైన ఉన్న తెరపైనే డేటాను చూడొచ్చు. దాని ద్వారా దాడిని పసిగట్టడం లేక దాడి చేయడం చాలా తేలిక అవుతుంది.

ఫ్లైబై వైర్‌ నియంత్రణ వ్యవస్థ
 

ఫ్లైబై వైర్‌ నియంత్రణ వ్యవస్థ

ఈ యుద్ధవిమానాల్లో అత్యంత అధునాతనమైన ఫ్లైబై వైర్‌ నియంత్రణ వ్యవస్థ ఉంది. ఇది ఎప్పటికప్పుడు విమాన నియంత్రణ, మార్గనిర్దేశనం, ఆయుధ ప్రయోగంపై వివరాలను అందిస్తుంది.మిరాజ్ 2000లో డిజిటల్ వెపన్ డెలివరీ నావిగేషన్ సిస్టమ్ (WDNS) ఉంటుంది. పగలు, రాత్రి లేజర్‌-గైడెడ్ వెపన్స్ ఫైర్ చేయొచ్చు.

59 వేల అడుగుల నుంచి

59 వేల అడుగుల నుంచి

వివిధ రకాల లక్ష్యాలను ఛేదించేందుకు ఇందులో మైకా క్షిపణులు, మ్యాజిక్‌ క్షిపణులు ఉన్నాయి. ఈ యుధ్ద విమానం 59 వేల అడుగుల నుంచి దాడి చేయగలదు. 2 30 ఎంఎం తుఫాకులు ఈ విమానంలో ఎల్లప్పుడూ ఉంటాయి.

వేగం ప్రయాణ దూరం

వేగం ప్రయాణ దూరం

దీని గరిష్ట వేగం గంటకు దాదాపు 2336 కిలోమటర్లు. టేకాఫ్ తీసుకునే సమయంలో దీని బరువు 17000 కిలోల వరకు ఉంటుంది. ఏకబిగిన 1550 కిలోమీటర్లు ప్రయాణించగలదు.

రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు

రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు

ఇటీవలి కాలంలో రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారం తీవ్ర దుమారం సృష్టించిన సంగతి తెలిసిందే. మిరాజ్‌-2000 యుద్ధవిమానాలను తయారుచేసిన దసో ఏవియేషన్‌ సంస్థే రఫేల్‌నూ ఉత్పత్తి చేయడం విశేషం.

మిరాజ్‌-2000 యుద్ధవిమానాలకు

మిరాజ్‌-2000 యుద్ధవిమానాలకు

ఒకే సీటున్న 36, రెండు సీట్లున్న నాలుగు మిరాజ్‌-2000 యుద్ధవిమానాలకు భారత్‌ 1982లో ఆర్డర్‌ చేసింది. నాడు పాకిస్థాన్‌ అమెరికా నుంచి ఎఫ్‌-16 పోరాట విమానాలను కొనుగోలు చేయడంతో ప్రతిగా భారత్‌ ఈ చర్యను చేపట్టింది.

2004లో మరో 10 మిరాజ్‌లకు

2004లో మరో 10 మిరాజ్‌లకు

మిరాజ్‌ పనితీరుతో తృప్తి చెందిన మన దేశం 2004లో మరో 10 మిరాజ్‌లకు ప్రభుత్వం ఆర్డరిచ్చింది. దసో నుంచి లైసెన్సు తీసుకొని, హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ సంస్థ వీటిని భారత్‌లోనే ఉత్పత్తి చేసింది.

వజ్ర

వజ్ర

భారత్‌ వద్ద ప్రస్తుతం మూడు స్క్వాడ్రన్ల మేర ఈ యుద్ధవిమానాలు ఉన్నాయి. ఇవి గ్వాలియర్‌ కేంద్రంగా పనిచేస్తున్నాయి. భారత వైమానిక దళంలో ఈ యుద్ధవిమానాలను ‘వజ్ర'గా పిలుస్తున్నారు. రూ.20వేల కోట్లతో ఈ యుద్ధవిమానాలను ఆధునికీకరించి, వాటి పోరాట సామర్థ్యానికి మరింత సాన బెట్టారు.

1999లో కార్గిల్ యుద్ధంలో

1999లో కార్గిల్ యుద్ధంలో

MBDA BGL 1000 లేజర్ గైడెడ్ బాంబ్, MBDA AS30L, MBDA ఆర్మాట్ యాంటీ రాడార్ మిస్సైల్, MBDA AM39 Exocet యాంటీ షిప్ మిసైల్, MBDA రాకెట్ లాంఛర్లు, MBDA Apache స్టాండ్ ఆఫ్ వెపన్స్‌ని మోసుకెళ్తుంది. 1999లో కార్గిల్ యుద్ధంలో మిరాజ్ 2000 యుద్ధ విమానం అందించిన సేవలు మర్చిపోలేనివి. ఇప్పుడు అదే మిరాజ్ 2000 యుద్ధ విమానం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపింది.

Best Mobiles in India

English summary
10 Things You Didn’t Know About the Dassault Mirage 2000

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X