Home
Apps

మంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొనుటకు పది చిట్కాలు

మీరు ఆండ్రాయిడ్, IOS ఏ వినియోగదారులైనా కావొచ్చు. ప్లేస్టోర్, APPస్టోర్ లలో కుప్పలుతెప్పలుగా అప్లికేషన్లు కనిపిస్తూ ఉంటాయి.

By Chaitanyakumar Ark

మీరు ఆండ్రాయిడ్, IOS ఏ వినియోగదారులైనా కావొచ్చు. ప్లేస్టోర్, APPస్టోర్ లలో కుప్పలుతెప్పలుగా అప్లికేషన్లు కనిపిస్తూ ఉంటాయి. ప్రతిఒక్కటి కంటికిఇంపుగా UI(యూసర్ ఇంటర్ఫేస్) డిజైన్ చెయ్యడంవలన వినియోగదారులు తెలియని,మోసపూరిత అప్లికేషన్లను సైతం డౌన్లోడ్ చేసుకుని తమకే తెలీకుండా SPAM, సైబర్ నేరాల బారినపడుతున్నారు. ఒక అప్లికేషన్ మనసులో ఉంచుకుని సెర్చ్ చేస్తే, దానితోపాటు కొన్ని వందలవేల అప్లికేషన్లు ఎక్కువ ఫీచర్లను కలిగిఉన్నాయి అంటూ భ్రమింపజేస్తూ, వినియోగదారులు ఆకర్షితులయ్యేలా ప్రేరణని కల్పిస్తుంటాయి. ఈమానసిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్లికేషన్స్ ఎంపిక విధానంలో కొన్నిసూచనలను పొందుపరచడం జరిగినది. ఈసూచనల ద్వారా కావలసిన అప్లికేషన్ ను తక్కువ సమయంలో ఎంపిక చేసుకునేలా మరియు మోసపూరిత అప్లికేషన్ల బారినపడకుండా జాగ్రత్తపడేలా చర్యలు తీసుకోవచ్చు.

 Recommendations

Recommendations

ఆండ్రాయిడ్ వినియోగదారులకు ప్లే స్టోర్ లో apps and games విభాగంలో కేటగిరీల వారీగా Recommendations పొందుపరచబడి ఉంటుంది. ఈ రికమెండేషన్ అప్లికేషన్స్ ప్లేస్టోర్లో అత్యధిక వినియోగదారులు డౌన్లోడ్ చేసుకుని ఇచ్చిన రేటింగ్స్ మూలంగా, మీ గూగుల్ ప్లస్ లో ఉన్న మీఫ్రెండ్స్ ఇచ్చిన likesను దృష్టిలో ఉంచుకుని పొందుపరచడం జరుగుతుంది. మీ అభిరుచికి తగినవిధంగా ఉన్న మీస్నేహితుడిని దృష్టిలో ఉంచుకునికూడా అప్లికేషన్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక IOS వినియోగదారులకు అయితే featured screenలో కిందుగానున్న "Games you might like" అనే సెక్షన్లో పొందుపరచబడి ఉంటాయి, ఈ అప్లికేషన్స్ మీరు ఇదివరకు కొన్న అప్లికేషన్ల హిస్టరీని బేస్ చేస్కుని లిస్టు ఇస్తుంది. కావున మీరు ఎన్ని మంచి గేమ్స్ కొంటారో, ఆ గేమ్స్ కి relatedగా, మీ టేస్ట్ కి తగినవిధంగా చూపెడుతుంది.

 users also installed

users also installed

గూగుల్ ప్లేస్టోర్ లో ఏదైనా app గురించి సెర్చ్ చేసి, స్క్రోల్ చేసినప్పుడు users also installed అనే లిస్టు కనిపిస్తుంది. ఈ లిస్టు మీ సర్కిల్స్ లోని ఫ్రెండ్స్ లేదా ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్స్ జాబితాగా ఉంటుంది. అదేవిధంగా IOSలో Related అనే సెక్షన్లో వినియోగదారులు అధికంగా కొన్న అప్లికేషన్ల లిస్టు చూపెడుతుంది.

IOS లో Related సెక్షన్స్ లో

IOS లో Related సెక్షన్స్ లో

మీఅభిరుచులకు తగినవిధంగా ఫీచర్లను పొందుపరచిన అప్లికేషన్స్ లో ఎక్కువగా డౌన్లోడ్ చెయ్యబడినవి లేక కొనుగోలుచేయబడినవి ఏవి అనునది ప్రామాణికం. వీటిని ఎంచుకొనుటలో ప్లేస్టోర్ లో users also installed, IOS లో Related సెక్షన్స్ లో నిక్షిప్తం చెయ్యబడినవే ప్రామాణికం అవ్వొచ్చు.

అప్లికేషన్స్ కింద స్కోర్స్

అప్లికేషన్స్ కింద స్కోర్స్

చాలామంది వినియోగదారులు అప్లికేషన్స్ కింద స్కోర్స్ ఇచ్చి, రివ్యూలు రాస్తుంటారు. వాటిలో అన్నీ నిజం అని అనుకోవడానికి లేదు. కావున ఒకటికి పది రివ్యూలు చదివి డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. కొందరు కస్టమర్స్ కావాలనే రేటింగ్ ఎక్కువ ఇస్తుంటారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకోవడం మంచిది.

లింక్డ్ అప్లికేషన్స్

లింక్డ్ అప్లికేషన్స్

కొన్ని అప్లికేషన్లకు లింక్డ్ అప్లికేషన్స్ కూడా ఉండడం సహజం. ఉదాహరణకు ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసుకుంటే మెసెంజర్ కూడా ఇన్స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. అందువలన డెవలపర్ చేసిన మిగిలిన అప్లికేషన్లను కూడా గమనించడం మంచిది.

ప్లేస్టోర్, appస్టోర్ లలో ..

ప్లేస్టోర్, appస్టోర్ లలో ..

డెవెలపర్ సపోర్ట్ అప్లికేషన్ కు ఉందా అనేది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది అప్లికేషన్లని ప్లేస్టోర్, appస్టోర్ లలో ఉంచుతారు కాని కొంతకాలానికి అప్డేట్స్ ఆపివేయడమో లేక సపోర్ట్ నిలిపివేయడమో చేస్తుంటారు. ఆ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకున్నా ఉపయోగం ఉండదు.

best అప్లికేషన్స్ ను

best అప్లికేషన్స్ ను

గూగుల్, ఆపిల్ స్టోర్స్ రెండింటిలో వినియోగదారుల డౌన్లోడ్స్ దృష్ట్యా best అప్లికేషన్స్ ను home పేజి లోనే చూపడం జరుగుతుంది.ఆయా అప్లికేషన్స్ మీ అభిరుచులకు తగ్గట్లుగా ఉన్నాయో లేదో చూసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు

రిలేటెడ్ గా అనేక అప్లికేషన్స్

రిలేటెడ్ గా అనేక అప్లికేషన్స్

ఒక అప్లికేషన్ కు రిలేటెడ్ గా అనేక అప్లికేషన్స్ ఉంటాయి. ఎంత ఎక్కువ browse చేస్తే అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. దీని ఆధారంగా ఫిల్టర్ చేసుకుని అప్లికేషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు.సెర్చ్ చెయ్యడంలో మెదడుకి పదును పెట్టాలి. ఉదాహరణ కి సోషల్ మీడియా apps కోసం సోషల్ నెట్వర్క్ అనే కీవర్డ్ వాడొచ్చు.

 తెలివే మన సెక్యూరిటీ

తెలివే మన సెక్యూరిటీ

మన తెలివే మన సెక్యూరిటీ. ఇష్టానుసారంగా తెలియని అప్లికేషన్లు డౌన్లోడ్ చెయ్యడం చివరికి ఉనికికే ప్రమాదం కావొచ్చు.

Best Mobiles in India

English summary
Whether you're on Android or iOS you have a mind boggling number of apps at your fingertips.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X