యూట్యూబ్ నే కాదు...ఈ సైట్లనూ చూడండి!

By Madhavi Lagishetty
|

వీడియో స్ట్రీమింగ్ వెబ్ సైట్స్ అనగానే...వెంటనే గుర్తుకువచ్చేది యూట్యూబ్. అయితే గూగుల్ భాగస్వామ్యంలో ఉన్న గో టు వీడియో సైట్ ఫ్లాట్ ఫాంను ఎక్కువ మంది ప్రజలు సెర్చ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రపంచలో అత్యధిక ప్రజాదారణ పొందిన వెబ్ సైట్లలో ఇది ఒకటి. అయితే మీకు ఇప్పటివరకు యూట్యూబ్ గురించి మాత్రమే తెలుసు. కానీ యూట్యూబ్ కు మించిన ఇతర వెబ్ సైట్లు కూడా ఉన్నాయాని మీకు తెలుసా? మీరు యూట్యూబ్ కు బదులుగా 10 ప్రత్యామ్నాయ సెర్చ్ చేసే ఇతర వెబ్ సైట్లను గురించి కూడా తెలుసుకోండి.

 
యూట్యూబ్ నే కాదు...ఈ సైట్లనూ చూడండి!

అయితే ఈ వెబ్ సైట్లో యూట్యూబ్ కంటే బెట్టర్ గా ఉంటాయా? లేదా అనేది అంశం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. అత్యధిక ప్రజాధారణ పొందిన కొన్ని వెబ్ సైట్లను మీకోసం అందిస్తున్నాం. యూట్యూబ్ కు ఇతర వెబ్ సైట్స్ కు ఉన్న తేడాను మీరే తెలుసుకోండి.

Vimeo:

Vimeo:

ఈ వెబ్ సైట్ హై డెఫినిషన్ వీడియోలకు సపోర్ట్ చేస్తుంది. మీకు క్వాలిటీ కంటెంట్ కావాలంటే ఇది మంచి వేదిక అని చెప్పవచ్చు. మీరు ఈజీగా వీడియోలను బ్రౌజ్ చేసేందుకు సులభమైన సెర్చ్ ఆప్షన్ ఉంటుంది.

Metacafe:

Metacafe:

మీరు మెటాకేఫే సైట్ను సందర్శించినప్పుడు, ముఖ్యంగా మీరు గమనించే మొదటి విషయం దాని సాధారణ లేఅవుట్. దీని బ్రౌజింగ్ ఇంటర్పేస్ నేరుగా ముందుకు వెళ్తుంది. అంతేకాదు తక్కువ సైజులో ఉన్న వీడియో అభిమానులు అయితే ...మెటాకాఫ్ మీకు పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది.

Veoh:
 

Veoh:

ఇది ఒక ఇంటర్నెట్ టీవీ కంపెనీ. మిలియన్ల కొద్దీ ఉన్న వీడియోలను ప్రొఫెషనల్స్ చే తయారు చేయబడ్డాయి. అంతేకాదు మీరు ఇందులో పాపులర్ టీవీ షోస్ తోపాటు సీరిస్ కూడా చూడవచ్చు. వీటితోపాటు మీరు మ్యూజిక్ లవర్స్ అయినట్లయితే అన్ని జనరేషన్స్ కు సంబంధించిన మ్యూజిక్ ఇందులో మీరు వినే అవకాశం ఉంటుంది.

ఇంటర్నెట్ ఆర్కైవ్....

ఇంటర్నెట్ ఆర్కైవ్....

ఇంటర్నెట్ ఆర్వైవ్ లో వేల సంఖ్యలో వీడియోలు ఉంటాయి. అంతేకాదు కొంతమంది వినియోగదారులు ఇష్టపడే హిస్టారికల్ విషయాలను భారీగా సేకరిస్తూ...ఆర్కైవ్ లో అప్ లోడ్ చేస్తుంది. మీరెక్కడా యాక్సెస్ చేయని వీడియోలను కూడా ఈ ఇంటర్నెట్ ఆర్కైవ్ లో యాక్సిస్ చేయవచ్చు.

Crackle:

Crackle:

సోనీ పిక్చర్స్ ఎంటర్ టైన్మెంట్ సొంతం చేసుకున్న ఈ క్రాకెల్ ...వీడియో కంటెంట్ తోపాటు హాలీవుడ్ సినిమాలు, ఫేమస్ టీవీ షోస్ వంటి రెండు ఫీచర్లు ఒకే ఆన్ లైన్ టీవీ ఛానెల్లో వస్తాయి.

బ్యూటీ రికగ్నిషన్ టెక్నాలజీతో Oppo A71, ధర చాలా తక్కువ !బ్యూటీ రికగ్నిషన్ టెక్నాలజీతో Oppo A71, ధర చాలా తక్కువ !

స్ర్కీన్ జాకస్:

స్ర్కీన్ జాకస్:

సినిమాలు, టీవీ సిరీస్లన్నీ ఒరిజినల్ కంటెంట్లో ఉన్నట్లయితే...స్క్రీన్ స్కిన్స్ చెక్ చేయండి. చాలామంది కామోడీ వీడియోలను ఇష్టపడుతుంటారు. వారి కోసం కూడా అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఇతర కళా ప్రక్రియలకు సంబంధించిన వీడియోలు కూడా ఈ సైట్లో ఉన్నాయి.

 మై స్పెస్....

మై స్పెస్....

యూట్యూబ్ మనకు పరిచయం కాకముందు...అత్యధిక ప్రజాధారణ పొందిన సైటుగా చెప్పవచ్చు. ఎప్పుడైతే యూట్యూబ్ ఎంటర్ అయ్యిందో మై స్పెస్ సైట్ కు ఆధరణ తగ్గింది. అయితే ఇప్పటికీ ఈ సైటును చాలామంది ఆధరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ సైట్ కంటెంట్ ఎక్కువ ద్రుష్టిసారించింది. ఇందులో ప్రముఖుల వీడియోలతోపాటు స్పోర్ట్స్ స్టార్స్, సెలబ్రిటీస్ ఇంటర్వ్యూలు చాలా ఉన్నాయి.

ఓపెన్ వీడియో ప్రాజెక్ట్....

ఓపెన్ వీడియో ప్రాజెక్ట్....

ది ఓపెన్ వీడియో ప్రాజెక్ట్...ఈ సైట్ ఎక్కువగా రీసెర్చర్స్, మల్టీమీడియా రిట్రీవల్, డిజిటల్ లైబ్రరీస్ తో కలిసి పనిచేసేవారిని లక్ష్యంగా చేసుకుని వీడియోలను అందుబాటులో ఉంచుతుంది. ఇందులో అప్ లోడ్ చేసిన వీడియోలు నేచర్ ఎడ్యుకేషన్ కు సంబంధించినవి ఉంటాయి. నాసా, క్లాసిక్ కమర్షియల్ యాడ్స్ నుంచి చాలా వీడియోను తీసుకుంటారు.

9gag:

9gag:

ఇందులో ముఖ్యంగా సంస్క్రుతి సంప్రదాయాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఇందులో చాలా వరకు కామెడీ వీడియోలు ఉంటాయి.

Ted:

Ted:

టెక్నాలజీ, బిజినెస్, డిజైన్, గ్లోబల్ ఇష్యూస్ తోపాటు వరల్డ్ ప్రాబ్లమ్స్ సహా అనేక ఇతర అంశాలపై ఎక్కువగా ద్రుష్టి పెడుతుంది. ప్రముఖ వ్యక్తుల వీడియోలు ఈ వెబ్ సైట్లో చాలా ఉన్నాయి. ఈ వీడియోలు చాలా స్పూర్తిదాయకంగా ఉంటాయి. అంతేకాదు భావోద్వేగానికి లోనయ్యే వీడియోలతోపాటు కామెడీని కావాలనుకునేవారికి కోసం అనేక వీడియోలు అందుబాటులో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
YouTube is a go-to video site for the majority of people. But what happens if you can't access YouTube or it stops working temporarily for reason? Here are the 10 video sites that might surprise you.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X