మీ ఫోన్‌లో ఫేస్‌బుక్ యాప్‌ను ఓపెన్ చేయకుండా, ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను వాడుకోవటం ఎలా?

స్మార్ట్ కమ్యూనికేషన్ ప్రపంచంలో సరికొత్త ఒరవడికి నాంది పలికిన ఫేస్‌బుక్, మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. ఫేస్‌బుక్ సౌజన్యంతో మన మిత్రులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాం. మిత్రులకు సంబంధించిన పుట్టినరోజు వివరాలను కూడా ఈ మాద్యమం ద్వారానే గుర్తుపెట్టుకోగలుగుతున్నాం.

ఫేస్‌బుక్ యాప్‌ను ఓపెన్ చేయకుండా, ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను వాడుకోవటం ఎలా.?

Read More : ఆన్‌లైన్ బుకింగ్స్ లేవు, మీ ఊరికే Redmi 3S Plus

ఇంతలా ఫేస్‌బుక్ మనలో మమేకమైన నేపథ్యంలో, ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్‌బుక్ యాప్ కనపిస్తోంది. ఫేస్‌బుక్‌లోని ముఖ్యమైన సమాచారాన్ని యాక్సిస్ చేసుకోవాలంటే ఫేస్‌బుక్ యాప్ తప్పనిసరేంకాదు. చీటికి మాటికి ఫేస్‌బుక్ యాప్‌ను ఓపెన్ చేయకుండా వేరే మార్గాల ద్వారా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించిన సమాచారాన్ని మీ స్మార్ట్‌ఫోన్‌లో యాక్సిస్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్ లేకుండా ఫేస్‌బుక్‌ను మీ ఫోన్‌లో పొందాలంటే?

మొబైల్ ఫోన్ కీప్యాడ్ నుంచి *325# డయల్ చేసి మీ ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించిన వివరాలను ఎంటర్ చేసినట్లయితే ఫేస్‌బుక్ యాప్‌తో సంబంధం లేకుండా మీ అకౌంట్‌కు సంబంధించిన న్యూస్2ఫీడ్, అప్డేట్స్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకు ఏ విధమైన డేటా ప్లాన్ కూడా అసవరం ఉండదు.

ఫేస్‌బుక్‌లో పుట్టిన రోజు వివరాలు..

ఫేస్‌బుక్‌లో ఉన్న మీ ఫ్రెండ్స్ పుట్టినరోజులకు సంబంధించిన క్యాలెండర్‌ను మీ ఫోన్‌లోకి ఇంపోర్ట్ చేసుకునేందుకు రకరకాల యాప్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన గూగుల్ క్యాలెండర్ యాప్. ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోని Birthdays URLను కాపీ చేసుకుని గూగుల్ క్యాలెండర్ యాప్‌ను ఓపెన్ చేయండి. డ్రాప్‌డౌన్ మెనూలో కనిపించే other calendars విభాగంలో add by URL ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని అందులో Birthdays URLను పేస్ట్ చేయండి. ఇక పై మీరు ఫేస్‌బుక్ యాప్‌ను ఓపెన్ చేయకుండానే మిత్రులకు సంబంధించిన పుట్టిన రోజు వివరాలను తెలుసుకోవచ్చు.

ఈవెంట్ ఇన్విటేషన్స్

ఫేస్‌బుక్‌లోని ఈవెంట్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రతిసారి యాప్‌ను ఓపెన్ చేయకుండా,ఆ ఈవెంట్స్‌కు సంబంధించిన ఫైల్‌ను ఎక్స్‌పోర్ట్ చేసుకుని ఫోన్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ హోమ్ పేజీ‌లో టాప్‌లెఫ్ట్ కార్నర్‌లో కనిపించే events బటన్ పై క్లిక్ చేయటం ద్వారా మీకు export event ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా మీరు ఎంచుకున్న ఈవెంట్ ఫైల్ ఎక్స్‌పోర్ట్ కాబడుతుంది.

ఫేస్‌బుక్ కాంటాక్ట్స్‌..

ఫేస్‌బుక్ కాంటాక్ట్స్‌ను ఫోన్‌లోకి ఇంపోర్ట్ చేసుకునేందుకు రకరకాల థర్డ్ పార్టీ యాప్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్స్ అండ్ సింక్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. అందులో add an account విభాగంలోకి వెళ్లి మీ ఫేస్‌బుక్ వివరాలను పొందుపరచి ‘Sync' ఆప్షన్ పై క్లిక్ చేయండి.

బ్యాకప్ చేసుకోవాలంటే

మీ ఫేస్‌బుక్ సమాచారాన్ని బ్యాకప్ చేసుకోవాలంటే ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో అందుబాటులో ఉన్న Archive Facebook అనే బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌ను ఉఫయోగించుకోండి.

ఫేస్‌బుక్ చాట్ కాంటాక్ట్స్‌

మీ ఫేస్‌బుక్ చాట్ కాంటాక్ట్స్‌ను వేరొకచోట ఉపయోగించుకునేందుకు అనేక థర్డ్ పార్టీ యాప్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటిలో Adium, Trillian వంటి యాప్స్ మీకు ఉపయోగపడతాయి.

చాట్ హిస్టరీని సేవ్ చేసుకోవాలంటే..?

మీ ఫేస్‌బుక్ చాట్ హిస్టరీని సేవ్ చేసుకునేందుకు అనే బ్రౌజర్ ఎక్స్ టెన్షన్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ప్రముకమైనదని Facebook Chat History Manager extension.

నోటిఫికేషన్స్‌ను మెయిల్స్ రూపంలో పొందాలంటే

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌కు వచ్చే నోటిఫికేషన్స్‌ను మెయిల్స్ రూపంలో పొందాలంటే, అకౌంట్ సెట్టంగ్స్‌లోకి వెళ్లి నోటిఫికేషన్స్ విభాగాన్ని సెలక్ల్ చేసుకోంది. అందులో
email ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని నోటిఫికేషన్స్ సెట్టింగ్స్‌ను ఎడిట్ చేసుకోండి.

నోటిఫికేషన్స్‌ను ఎస్ఎంఎస్ రూపంలో పొందాలంటే..

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌కు వచ్చే నోటిఫికేషన్స్‌ను ఎస్ఎంఎస్ రూపంలో పొందాలంటే అకౌంట్ సెట్టంగ్స్‌లోకి వెళ్లి నోటిఫికేషన్స్ విభాగాన్ని సెలక్ల్ చేసుకోండి. అందులో text message ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ సెట్టింగ్స్‌ను ఎడిట్ చేసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Ways to Use Facebook Without Opening Facebook App on Your Smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot