ప్రతి భారతీయుని దగ్గర ఉండాల్సిన 15 ప్రభుత్వ యాప్‌లు !

భారతదేశం ప్రభుత్వం ఇండియాని 'డిజిటల్ భారతదేశం' గా మార్చాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే.

By Anil
|

కేంద్ర ప్రభుత్వం ఇండియాని 'డిజిటల్ ఇండియా' గా మార్చాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో వెనక పడిన అనేక గ్రామాల్లో ప్రజలు ఇంటర్నెట్ వినియోగించుకునేలా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు భారీ ఎత్తున ప్రచారం కూడా చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల, mPassport సేవా యాప్ ను ప్రారంభించింది దీని ద్వారా ప్రజలు ఎక్కడి నుంచైనా పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.అలాగే ఎన్నికల కమిషన్ cVigil అని పిలిచే ఒక యాప్ ను కూడా ప్రారంభించింది, దీని ద్వారా ఎన్నికల్లో అక్రమ కార్యకలాపాల చేసే వ్యక్తుల వీడియోలను మరియు ఫోటోలను, అవినీతిని ప్రేరేపించే వ్యాఖ్యలను నేరుగా ఎన్నికల కమీషన్ కి పంపవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక గవర్నమెంట్ యాప్స్ ని కేంద్రప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ శీర్షిక లో భాగంగా ప్రభుత్వ సేవల కోసం ఉపయోగపడే కొన్ని యాప్స్ లిస్ట్ ను మీకు అందిస్తున్నాం. చెక్ చేసుకోండి.

 

Indian Police on Call app:

Indian Police on Call app:

మీరు ఉన్న ప్రదేశంలోని సమీప పోలీసు స్టేషన్ను గుర్తిస్తుంది.దగ్గర లో ఉన్న పోలీసు స్టేషన్ చేరుకోవడానికి మార్గం మరియు దూరం వంటి అన్ని సమాచారాలను ఇస్తుంది . ఇది జిల్లా కంట్రోల్ రూమ్ మరియు SP కార్యాలయాలు ఎన్ని ఉన్నాయో ప్రదర్శిస్తుంది

ePathshala app:

ePathshala app:

ఈ ePathshala app ను స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ వారి మొబైల్ లోనో లేక సిస్టం లోనో యాక్సిస్ చేయవచ్చు . ఈ యాప్ స్టూడెంట్స్ కు మరియు టీచర్స్ కు వాళ్ళ వాళ్లకు సంబందించిన అన్ని పుస్తకాలు ఇందులో పొందవచ్చు.ఈ యాప్ ను HRD మినిస్ట్రీ మరియు NCERT చే డెవలప్ చేయబడింది.

mParivahan app:
 

mParivahan app:

ఈ యాప్ ద్వారా, వినియోగదారులు వారి డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఫోర్ -వీలర్ / టూ -వీలర్ రెజిస్టరరిన్ సర్టిఫికేట్ యొక్క డిజిటల్ కాపీని పొందవచ్చు . సిటిజన్స్ ఇప్పటికే ఉన్న కార్ రిజిస్ట్రేషన్ వివరాలను అలాగే సెకండ్ హాండ్ కార్ల వివరాలను కూడా ఇందులో పొందవచ్చు . సెకండ్ హ్యాండ్ కారుని కొనుగోలు చేయడానికి చూస్తున్న వారికి, వారు వయస్సు మరియు ఇతర వివరాలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.

Startup India:

Startup India:

ఈ యాప్ ద్వారా బిజినెస్ చేయాలనుకునే కొత్త వారు ఏ బిజినెస్ చేస్తే లాభాలు వస్తాయో మరియు ఇతర వివరాలను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. ప్రభుత్వాలు initiative చేసే స్టార్ట్ అప్స్ మరియు ఇంక్యూబేటర్స్ గురించి తెలుసుకోవడానికి ఈ యాప్ చాల ఉపయోగపడుతుంది.

mPassport:

mPassport:

ఈ యాప్ ద్వారా పాస్ పోర్ట్ అప్లికేషన్ స్టేటస్ ను ట్రక్క్ చేయవచ్చు అలాగే దగ్గర లో ఉన్న పాస్ పోర్ట్ సేవ కేంద్రాలను తెలుసుకోవడానికి యాప్ చాలా ఉపయోగపడుతుంది.

 mAadhaar app:

mAadhaar app:

Unique Identification Authority of India (UIDAI) MAadhaar యాప్ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే ఎక్కడైనా, ఏ సేవా కేంద్రం లో అయినా eKYC సమాచారం తెలుసుకోవచ్చు . QR కోడ్ ద్వారా వినియోగదారులు వారి ఆధార్ ప్రొఫైల్ను చూడవచ్చు మరియు భాగస్వామ్యం కూడా చేయవచ్చు.

Postinfo:

Postinfo:

ఈ Postinfo యాప్ ను డిపార్ట్మెంట్ అఫ్ పోస్ట్స్ డెవలప్ చేయబడింది. ఈ యాప్ ద్వారా పార్సెల్ ను ట్రాక్ చేయవచ్చు అలాగే మీకు దగ్గర లో పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందొ అని సెర్చ్ చేయవచ్చు,అలాగే భీమా ప్రీమియం క్యాలిక్యులేటర్ మరియు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ గురించి తెలుసుకోవచ్చు.

Swachh Bharat Abhiyaan:

Swachh Bharat Abhiyaan:

మీ నగరం మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ యాప్ ద్వారా, వారి సమస్యలకు సంబంధించిన చిత్రాలను క్లిక్ చేసి ఇందులో పోస్ట్ చేయవచ్చు లేదా మునిసిపల్ అధికారులకు పంపవచ్చు . అన్ని పట్టణ స్థానిక సంస్థలు ఈ యాప్ ను లింక్ చేయబడింది.

BHIM :

BHIM :

Bharat Interface for Money (BHIM) డిజిటల్ లావాదేవీలకు ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో వినియోగదారులు UPI చెల్లింపు అడ్రస్, ఫోన్ నంబర్లు లేదా QR కోడులు ఉపయోగించి డబ్బును పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు.

IRCTC:

IRCTC:

ప్రభుత్వంచే అత్యంత ప్రాచుర్యం పొందిన యాప్ ఇది.ఈ యాప్ ద్వారా ఐఆర్సిటిసి రైలు టిక్కెట్ల మరియు ఆన్ లైన్ బుకింగ్ చేసుకోవచ్చు . IRCTC ఇ-వాలెట్ తో ట్రాన్సక్షన్స్ చాలా త్వరగా చేసుకోవచ్చు.

Kisan Suvidha app:

Kisan Suvidha app:

ఈ యాప్ రైతుల తో డెవలప్ చేయబడినది.ఈ యాప్ ద్వారా రైతులు వాతావరణ రిపోర్టులు , మార్కెట్ ధరలు, మొక్కల సంరక్షణ చిట్కాలు ఇతర విషయాలు తెలుసుకోవచ్చు.

DigiSevak app:

DigiSevak app:

పలు ప్రభుత్వ రంగ పనులకు వాలంటీర్‌ సర్వీసులు అందజేయడానికి ఈ యాప్ ఉపయోగ పడుతుంది.

GST Rate Finder:

GST Rate Finder:

GST గురించి తెలియని వారు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది .పలు ఉత్పత్తులు, సర్వీసులు వాటి సంబంధిత జీఎస్టీ రేట్లను తెలుసుకోవడం కోసం జీఎస్టీ రేటు ఫైండర్‌ యాప్‌ ఉపయోగపడుతుంది.

UMANG:

UMANG:

UMANG (Unified Mobile Application for New-age Governance) ఈ యాప్ అన్ని ప్రభుత్వ రంగ డిపార్ట్‌మెంట్లను, వాటి సర్వీసులను ఒకే వేదికపైకి తీసుకొని వస్తుంది . ఆధార్‌, డిజిలాకర్‌, పేగవర్న్‌మెంట్‌ వంటి సర్వీసులను ఇది అందజేస్తుంది.

Incredible India app:

Incredible India app:

ఇది ప్రభుత్వ టూరిజం యాప్‌.ఈ యాప్ ద్వారా టూర్‌ ఆపరేటర్లు, రిజిస్ట్రేషన్‌ సర్వీసు ప్రొవైడర్లు వంటి వారి వివరాలను తెలుసుకోవచ్చు

Best Mobiles in India

Read more about:
English summary
20 useful government apps every Indian should download.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X