గూగుల్‌కు షాక్, Play Storeలో ప్రమాదకర వైరస్

వన్నాక్రై ర్యాన్సమ్ వేర్ సృష్టించిన భీబత్సం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోన్న ప్రపంచదేశాలను తాజాగా 'Judy' మాల్వేర్ కలవరపెడుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లే లక్ష్యంగా..

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లే లక్ష్యంగా ప్రోగ్రామ్ కాబడిన ఈ మాల్వేర్, గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్స్ ద్వారా ఫోన్‌లలోకి చొరబడుతోంది. ఈ మాల్వేర్‌ను చెక్ పాయింట్ రిసెర్చర్లు కనుగొన్నారు.

గూగుల్ డిటెక్షన్ మెకనిజం

వాస్తవానికి గూగుల్ ప్లే స్టోర్‌లో యాడ్ అయ్యే ప్రతి యాప్‌ను గూగుల్ డిటెక్షన్ మెకనిజం క్షుణ్నంగా పరిశీలిస్తుంది. ఒకవేళ ఆ యాప్‌లో ఏమైనా వైరస్ లు డిటెక్ట్ అయినట్లయితే వాటిని అడ్డుకుని, డెవలపర్స్‌కు వార్నింగ్ మెసేజ్‌లను పంపుతుంది.

గూగుల్ మెకనిజం పసిగట్టలేక పోయింది...

ప్రస్తుతం నెలకున్నపరిస్థితిని బట్టి చూస్తుంటే 'Judy' మాల్వేర్ ను నిలువరించటంలో గూగుల్ డిటెక్షన్ మెకనిజం విఫలమైందని తెలుస్తోంది.

ఆటో క్లిక్కింగ్ యాడ్‌వేర్

చెక్ పాయింట్ రిసెర్చర్స్ చెబుతోన్న దాని ప్రకారం 'Judy' మాల్వేర్ అనేది ఒక ఆటో క్లిక్కింగ్ యాడ్‌వేర్.

మాల్వేర్ అటాక్ అయిన డివైసెస్‌లో...

ఈ మాల్వేర్ అటాక్ అయిన అన్ని డివైసెస్ నుంచి భారీ సంఖ్యలో నకిలీ యాడ్ క్లిక్స్ జనరేట్ చేస్తుంటాయి. యాడ్ క్లిక్స్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం మాల్వేర్‌ను సృష్టించిన వారి అకౌంట్లలోకి వెళ్లిపోతుంది.

41 యాప్స్‌లో 'Judy' మాల్వేర్

ప్రస్తుతానికి ఈ మాల్వేర్‌ను కలిగి ఉన్న 41 యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్‌లో గుర్తించినట్లు చెక్ పాయింట్ తెలిపింది. ఈ యాప్‌లను కొరియన్ కంపెనీ అభివృద్ధి చేసింది.

18 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారా..?

ఈ మాల్వేర్‌ను కలిగి ఉన్న యాప్‌లను ఇప్పటి వరకు 4 మిలియన్ల నుంచి 18 మిలియన్ల మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసుకుని ఉండొచ్చని చెక్ పాయింట్ రిసెర్చర్లు అంచనా వేస్తున్నారు.

3.6 కోట్ల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు ముప్పు..

వీటి ద్వారా 3.6 కోట్ల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోకి ఈ మాల్వేర్ వ్యాపించి ఉండొచ్చని తెలుస్తోంది. 'Judy' మాల్వేర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోకి చొరబడిన తరువాత ప్రమాదకరమైన ప్రోగ్రామ్‌లను డౌన్‌లోడ్ చేసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ప్లే స్టోర్స్ నుంచి యాప్స్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుంది. గేమింగ్ యాప్స్ డౌన్‌లోడ్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
36.5 million Android smartphones reportedly infected with Judy malware. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot