ప్రమాదంలో గూగుల్ ప్లే స్టోర్, చిక్కుల్లో 400 యాప్స్

గూగుల్ ప్లే స్లోర్‌లోని 400 యాప్స్ 'డ్రెస్‌కోడ్' అనే ప్రమాదకర మాల్వేర్‌‌కు ఎఫెక్ట్ అయినట్లు సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ దిగ్గజం ట్రెండ్ మైక్రో గూగుల్‌ను అప్రమత్తం చేసింది. ఈ మాల్వేర్ దాడికి గురైన ఇన్‌ఫెక్టెడ్ డివైసులను ఏదైనా ఎంటర్‌ప్రైజ్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసినట్లయితే, అటాకర్ ఈ ఇన్‌ఫెక్టెడ్ డివైస్‌ను స్ప్రింగ్‌బోర్డ్‌లా మార్చి సర్వర్‌లోని సెన్సిటివ్ డేటాను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశముందని ట్రెండ్ మైక్రో హెచ్చరిస్తోంది.

Read More : మీకు సామ్‌సంగ్ ఫోన్ ఉందా? రూ.250కే 15జీబి 4జీ డేటా మీ సొంతం

ప్రమాదంలో గూగుల్ ప్లే స్టోర్, చిక్కుల్లో 400 యాప్స్

గేమ్స్, స్కిన్స్, థీమ్స్, ఆప్టిమైజేషన్ బూస్టర్స్ వంటి రీక్రియేషనల్ యాప్స్ ద్వారా ఈ 'డ్రెస్‌కోడ్' వైరస్‌ను ఫోన్‌లలోకి జొప్పిస్తున్నట్లు సదరు సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. యాప్‌లో చాలా కొద్ది భాగాన్ని మాత్రమే ఆక్రమించుకోగలిగే ఈ మాలీషియస్ కోడ్‌ను గుర్తించటం చాలా కష్టమని కూడా సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్రింగ్ యువర్ ఓన్ ప్రోగ్రామ్‌...

బ్రింగ్ యువర్ ఓన్ ప్రోగ్రామ్‌ను ఇంప్లిమెంట్ చేస్తున్న 82శాతం వరకు ఎంటర్‌ప్రైజ్ కంపెనీలు వర్క్ రిలేటెడ్ కార్యకలాపాల్లోకి ఉద్యోగులు పర్సనల్ డివైస్‌లను అనుమతిస్తున్నాయని ఈ సంస్థ విశ్లేషణ చేసింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

‘డ్రెస్‌కోడ్' తరహా మల్వేర్ల ముప్పు..

ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంప్లాయ్ ప్రొడక్టవిటీ పెరిగినప్పటికి కంపెనీలకు ‘డ్రెస్‌కోడ్' తరహా మల్వేర్ల ముప్పు పొంచి ఉండనే ఉందని హెచ్చరించింది. మాల్వేర్స్ దాటికి గురై కాంప్రమైజ్ కాబడిన యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ వెంటనే తొలగించాలని గూగుల్ ప్లేకు ట్రెండ్ నోటిఫై హెచ్చరికలు జారీ చేసింది.

16.6 మిలియన్ల మాల్వేర్ డిటెక్షన్స్‌

ట్రెండ్ మైక్రో ‘మొబైల్ యాప్ రెప్యుటేష్ సర్వీస్' (MARS) ఈ ఏడాది ఆరంభం నుంచి ఆగష్టు వరకు 16.6మిలియన్ల మాల్వేర్ డిటెక్షన్స్‌ను గుర్తించింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

అతి పెద్ద యాప్ స్టోర్..

ప్రపంచంలో అతి పెద్ద యాప్ స్టోర్ ఏదైనా ఉందంటే అది గూగుల్ ప్లే స్టోర్ మాత్రమే. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్ అభివృద్థి చేసిన ఈ యాప్ స్టోర్‌లో లక్షల సంఖ్యలో యాప్స్, గేమ్స్, బుక్స్, మూవీస్ కొలువుతీరి ఉన్నాయి. ఆండ్రాయిడ్ యూజర్లు తమతమ గూగుల్ ప్లే స్టోర్ అకౌంట్‌లలోకి లాగినై వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో గూగుల్ ప్లే స్టోర్‌లో తలెత్తే సమస్యలు విసుగుపుట్టిస్తుంటాయి.

రీబూట్ చేసి చూడండి

మీ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ యాప్ క్రాష్ అయినట్లయితే ట్రబుల్ షూట్ చేసే ముందు ఫోన్‌ను రీబూట్ చేసి చూడండి. దాదాపుగా సమస్య సరిష్కారం కావొచ్చు.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అన్‌ఇన్‌స్టాల్ చేయండి..

రీబూట్ చేసినప్పటికి మీ ప్లే స్టోర్ యాప్ స్పందింకపోయినట్లయితే ప్లే స్టోర్ సెట్టింగ్స్ నుంచి మునుపటి ప్లే స్టోర్ అప్‌డేట్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఇలా చేయాలంటే.. settings > Apps > Google Play and click on Uninstall updates.

cache dataను క్లియర్ చేయండి..

మీ గూగుల్ ప్లే యాప్‌లోని cache dataను క్లియర్ చేయటం ద్వారా యాప్ తిరిగి పనిచేసే అవకాశముంది. ఇలా చేయాలంటే.. settings > Applications Manager > All > Google Play Store and tap on Clear Data and Clear Cache.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డేట్ అలానే టైమ్ సెట్టింగ్స్..

మీ ఫోన్‌లో డేట్ అలానే టైమ్ సెట్టింగ్స్ సింక్ అవని పక్షంలో గూగుల్ ప్లే యాప్ మోరాయిస్తుంటుంది. కాబట్టి మీ ఫోన్‌లో డేట్ అలానే టైమ్ కచ్చితంగా ఉందో లేదో చెక్ చేసుకోండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫ్యాక్టరీ డేటా రీసెట్‌..

ఫ్యాక్టరీ డేటా రీసెట్‌ను నిర్వహించటం ద్వారా గూగుల్ ప్లే స్టోర్ యాప్ సమస్యలను అధిగిమించవచ్చు. అయితే ప్యాక్టరీ రీసెట్ నిర్వహించే ముందు ఫోన్ డేటాను బ్యాకప్ చేసుకోండి.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్ అకౌంట్‌ను రీసెట్ చేయండి

కొన్ని కొన్ని సందర్భాల్లో గూగుల్ అకౌంట్‌ను రీసెట్ చేసుకోవటం ద్వారా గూగుల్ యాప్ సమస్యలను అధిగమించవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎర్రర్ DF-BPA-09

DF-BPA-09.. ఈ కోడింగ్‌తో ఉన్న ఎర్రర్ సాధారణంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో వస్తుంటుంది. ఈ సమస్య ఇక మీదట మీకు ఎదురైనట్లయితే డివైస్ సెట్టింగ్స్‌లోని అప్లికేషన్ మేనేజర్ విభాగంలోకి వెళ్లి గూగుల్ సర్వీసెస్ ఫ్రేమ్ వర్క్‌ను సెలక్ట్ చేసుకుని క్లియర్ డేటా పై క్లిక్ చేసినట్లయితే సమస్య పరిష్కారమవుతుంది.

ఎర్రర్ Code 194

Code 194...ఈ కోడింగ్‌తో ఉన్న ఎర్రర్ సాధారణంగా మీరు ప్లే స్టోర్ నుంచి గేమ్ లేదా యాప్‌ను డౌన్‌లోడ్ చేసేందుకు ప్రయత్నించినపుడు సంభవిస్తుంటుంది. ఈ సమస్య మీకు ఎదురైనపుడు గూగుల్ ప్లే సర్వీస్ అలానే ప్లే స్టోర్ యాప్స్‌కు సంబంధించిన క్యాచీ డేటాను క్లియర్ చేసినట్లయతే సమస్య పరిష్కారమవుతుంది. క్యాచీని క్లియర్ చేసే క్రమంలో డివైస్ సెట్టింగ్స్‌లోని అప్లికేషన్ మేనేజర్ విభాగంలోకి వెళ్లి గూగుల్ ప్లే సర్వీస్ అలానే ప్లే స్టోర్ యాప్స్‌ను సెలక్ట్ చేసుకుని క్లియర్ డేటా పై క్లిక్ చేస్తే సరి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎర్రర్ Code 941...

Code 941.. ఈ కోడింగ్‌తో ఉన్న ఎర్రర్ సాధారణంగా ఓ యాప్ లేదా గేమ్‌ను అప్‌డేట్ చేసే సమయంలో తలెత్తే ఆటంకం కారణంగా ఏర్పడుతుంది. ప్లే స్టోర్ యాప్‌కు సంబంధించి క్యాచీతో పాటు డేటాను క్లిక్ చేసినట్లయితే సమస్య పరిష్కారమవుతుంది.

ఎర్రర్ కోడ్ 498.

కోడ్ 498... ఈ కోడింగ్‌తో ఉన్న ఎర్రర్‌ను డౌన్‌లోడింగ్ సమయంలో తలెత్తే ఆటంకాల కారణంగా ఫేస్ చేయవల్సి ఉంటుంది. డివైస్‌లోని క్యాచీతో పాటు పనికిరాని అప్లికేషన్‌లను డిలీట్ చేయండి. ఆ తరువాత రికవరీ మోడ్‌లో ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి సమస్య పరిష్కారమవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
400 Google Play Store apps affected with malware: Report. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot