Paytm యాప్ వల్ల 5 లాభాలు
రీఛార్జ్ దగ్గర నుంచి షాపింగ్ వరకు ఇలా అనేక సర్వీసులను Paytm ఆఫర్ చేస్తోంది.
చేతలో డబ్బులు లేకపోయినా పర్వాలేదు ఫోన్‌లో Paytm యాప్ ఉంటే చాలు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో Paytm యాప్ ప్రతిఒక్కరి జీవితంలో భాగమైపోయింది.

Read More : 24 గంటల్లో 10 లక్షల ఫోన్‌లు అమ్మారు!
నిన్నమొన్నటి వరకు ఈ యాప్‌ను చాలా మంది యూజర్లు మొబైల్ రీఛార్జ్ నిమిత్తం ఉపయోగించుకునే వారు. తాజాగా తారుమారైన పరిస్థితుల నేపథ్యంలో Paytm యాప్‌ను అనేక రకాలుగా స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉపయోగించుకుంటున్నారు. పేటీఎమ్ యాప్‌ను మీ ఫోన్‌లో నిక్షిప్తం చేయటం ద్వారా చేకూరే 5 ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం...

ఆకట్టుకునే వాలెట్ ఆఫర్స్...
పేటీఎమ్ వాలెట్ అనేక ఆసక్తికర ఆఫర్లను తమ యూజర్లకు చేరువచేస్తోంది. క్యాష్‌బ్యాక్ కూపన్స్ , డిస్కౌంట్స్ ఇలా అనేక రూపాల్లో ప్రతి లావాదేవీ పై పేటీఎమ్ ఆఫర్ల మోత మోగిస్తోంది.

సినిమా టికెట్ల దగ్గర నుంచి రైల్వే టికెట్స్ వరకు
పేటీఎమ్ యాప్ ద్వారా సినిమా టికెట్ల దగ్గర నుంచి రైల్వే టికెట్స్ వరకు, ఫుడ్
దగ్గర నుంచి ఆన్‌లైన్ షాపింగ్ వరకు అన్ని రకాల సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీ లావాదేవీ ఫెయిల్ అయినట్లయితే Paytm wallet తక్షణమే నగదును రీఫంట్ చేసేస్తుంది. మిగిలిన యాప్స్‌లో ఇటువంటి సదుపాయం లేదు.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

New Nearby పేరుతో
New Nearby పేరుతో సరికొత్త ఫీచర్‌ను Paytm ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ సమీపీంలో Paytm చెల్లింపులను అంగీకరించే వ్యాపార కేంద్రాలను గుర్తించవచ్చు.

పర్‌ఫెక్ట్ షాపింగ్ గేట్ వే..
రీఛార్జ్ దగ్గర నుంచి షాపింగ్ వరకు ఇలా అనేక సర్వీసులను Paytm ఆఫర్ చేస్తోంది. అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు Paytm యాప్‌ను పర్‌ఫెక్ట్ షాపింగ్ గేట్ వేగా అభివర్ణిస్తున్నారు.

30 సెకన్లలో విజయవంతం..
రీఛార్జ్ పేమెంట్ దగ్గర నుంచి షాపింగ్ లావాదేవీల వరకు పేటీఎమ్ యాప్ ద్వారా జరిపే ఎటువంటి transactions అయినా కేవలం 30 సెకన్లలో విజయవంతం కాబడతాయి.

Paytm సర్వీసులను ఉచితంగా..
స్మార్ట్‌ఫోన్‌ను కలిగిఉన్న ప్రతి ఒక్కరు Paytm సర్వీసులను ఉచితంగా ఆస్వాదించవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications