గూగుల్ అసిస్టెంట్ మాత్రమే కాదు,ఆశ్చర్య పరిచే ఐదు ఏఐ అసిస్టెంట్స్ ఇవే..!

|

గూగుల్ అసిస్టెంట్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లను అదరగొడుతున్న ఫీచర్ ఇది. ముఖ్యంగా ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యుగంలో ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇక పై మీ అభిరుచుల్ని ఇట్టే పసిగట్టి మీతో కలిసి పనిచేసేందుకు గూగుల్ అసిస్టెంట్ ముందుకు వచ్చింది. అయితే గూగుల్ అసిస్టెంట్ తరహాలోనే యాపిల్ నుంచి సిరి, మైక్రోసాఫ్ట్ నుంచి కోర్టానా, అమెజాన్ నుంచి అలెక్సా, సాంసంగ్ నుంచి బిక్స్ బీ, లాంటి ఇతర ఆర్టిఫిషియల్ అసిస్టెంట్స్ ప్రస్తుతం స్మార్ట్ మొబైల్స్ లో రాజ్యం చేస్తున్నాయి. అయితే వీటితో పాటు యాండ్రయిడ్ ఫోన్లలో పనిచేసే మరిన్ని ఆర్టిఫిషియల్ అసిసెంట్స్ మీ కోసం..

 

మైక్రోసాఫ్ట్, యాపిల్ దోస్తీ.. ఎందుకో తెలుసా ?మైక్రోసాఫ్ట్, యాపిల్ దోస్తీ.. ఎందుకో తెలుసా ?

వర్చువల్ అసిస్టెంట్ డేటా బాట్ :

వర్చువల్ అసిస్టెంట్ డేటా బాట్ :

దీన్ని డేటా బాట్ అని పిలవవచ్చు. ఈ ఫీచర్ ద్వారా పలు అంశాలపై ఈ బాట్ అవగాహన కలిగి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఐన్ స్టీన్ అనే పదం పలికారు అంటే ఇది టెక్స్ట్ అలాగే ఇమేజీలు, వీడియోల రూపంలో మీ ముందు సమాచారాన్ని ఉంచుతుంది. అలాగే దీన్ని మీ పర్సనల్ సెక్రటరీ తరహాలో వాడుకోవచ్చు. ఉదాహరణకు మీ అపాయింట్ మెంట్స్, నోట్స్, అలారం, అలాగే చాలా రకాలుగా ఈ ఫీచర్ ను వాడుకోవచ్చు. ఇది ప్రస్తుతం టెక్ ప్రపంచంలోనే బెస్ట్ డేటా బాట్ గా పనిచేస్తోంది.

లైరా వర్చువల్ అసిస్టెంట్ :

లైరా వర్చువల్ అసిస్టెంట్ :

లైరా దాదాపు మీ పర్సనల్ అసిస్టెంట్ లా పనిచేస్తుంది. మీ సందేహాలు తీర్చడంతో పాటు పలు భాషలు సైతం ఈ అసిస్టెంట్ గుర్తించి సమాధానాలు చెబుతుంది. అంతే కాదు ఇది యాపిల్ సిరి లాగే పనిచేస్తోంది. ఐవోఎస్ లో కూడా పనిచేస్తుంది. అలాగే యాండ్రాయిడ్ లో ఇది సిరి తరహాలోనే పనిచేస్తుంది. అలారం, వెబ్ సెర్చి తో పాటు, యూట్యూబ్ లో పలు వీడియోలను సందర్భానుసారం మీ ఫ్రెండ్స్ కు పోస్ట్ చేస్తుంది. అలాగే మీరు తరచూ అడిగే ప్రశ్నలను నోట్ చేసుకొని సమాధానాలను ప్రిపేర్ చేస్తుంది.

 

 

రాబిన్ - ఎఐ వాయిస్ అసిస్టెంట్ :
 

రాబిన్ - ఎఐ వాయిస్ అసిస్టెంట్ :

ఇది సాధారణంగా ట్రావెలింగ్ లో ఉపయోగపడే అసిస్టెంట్ అని చెప్పవచ్చు. దీని ద్వారా మీరు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ముందే చెబుతుంది. అంతే కాదు మీరు చేరుకునే డెస్టినేషన్ ఎంత త్వరగా వెళ్లాలనుకుంటే దానికి తగ్గట్టు రూట్ డిజైన్ చేస్తుంది. కంప్లీట్ గా వాయిస్ కమాండ్స్ తో పాటు టెక్స్ట్ కమాండ్స్ ఆధారంగా సైతం రాబిన్ పనిచేస్తుంది.

మైక్రో సాఫ్ట్ కొర్టానా - డిజిటల్ అసిస్టెంట్ :

మైక్రో సాఫ్ట్ కొర్టానా - డిజిటల్ అసిస్టెంట్ :

మైక్రోసాఫ్ట్ డివైజెస్ లో తరచూ కనిపించే ఈ కోర్టానా ఎక్కువగా జనాదరణ పొందనప్పటికీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మీ షెడ్యూల్స్ ను రూపొందించడంతో పాటు మీ మెసేజెస్ ను, నోటిఫికేషన్స్ ను మీకు తగినట్లు అందుబాటు ఉంచుతుంది. అలాగే ట్రెండింగ్ న్యూస్, వెదర్ అలర్ట్స్ లాంటి ఫీచర్లతో మైక్రోసాఫ్ట్ కోర్టానా యూజర్ ఫ్రెండ్లీగా మారింది.

ఎక్స్ ట్రీమ్ - పర్సనల్ వాయిస్ అసిస్టెంట్ :

ఎక్స్ ట్రీమ్ - పర్సనల్ వాయిస్ అసిస్టెంట్ :

ఇది అడ్వాన్స్ లెవల్ పర్సనల్ వాయిస్ అసిస్టెంట్ అనే చెప్పవచ్చు. ఇందులో చాలా ఫీచర్స్ గూగుల్ అసిస్టెంట్, సిరిలో లేనివి అనిచెప్పడంలో సందేహం లేదు. ఫేస్ బుక్ స్టేటస్ ఆటో అప్ డేట్, సెల్ఫీ, అలాగే మీకు నచ్చిన యూట్యూబ్ వీడియోలు ప్లే చేయడం లాంటివి ఎన్నో దీని సొంతం. వాట్సప్, స్కైప్ లాంటి ఇతర మెసేజింగ్ యాప్స్ తో కూడా ఎక్స్ ట్రీమ్ కనెక్ట్ అయి కొత్త అనుభూతిని అందిస్తుంది.

Best Mobiles in India

English summary
5 Best Alternatives to Google Assistant For Android 2018 More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X