మీ ఫోన్ నిండా డూప్లికేట్ ఫోటోస్ పేరుకుపోయాయా..?
స్మార్ట్‌ఫోన్‌తో వాడకం పెరిగే కొద్ది పనితీరు మందగించటం సహజం. ఫోన్ పనితీరు నిదానించటానికి చాలే కారణాలే ఉన్నాయి.
స్మార్ట్‌ఫోన్‌తో వాడకం పెరిగే కొద్ది పనితీరు మందగించటం సహజం. ఫోన్ పనితీరు నిదానించటానికి చాలే కారణాలే ఉన్నాయి. వాటిలో ఫోన్‌లో పేరుకుపోయి ఉన్న డూప్లికేట్ అలానే బ్లర్రీ ఫోటోస్ కూడా ఒక కారణం కావొచ్చు. ఇటీవల వెల్లడైన ఓ సర్వే ప్రకారం, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోని 50 శాతానికి పైగా స్టోరేజ్ స్పేస్‌ను ఫోటోస్ మాత్రమే ఆక్రమించేస్తున్నాయట.

వీటిలో 10 శాతం ఫోటోలు 'డూప్లికేట్ ఫోటోస్' అయి ఉండటంతో ఫోన్ స్టోరజ్ స్పేస్ పై వీటి ప్రభావం ఎక్కువుగా ఉంటోందట. వాస్తవానికి డుప్లికేట్ ఫోటోలను తొలగించటమనేది పెద్ద సమస్యేమి కాదు అనేది పెద్ద సమస్యేమి కాదు. ప్లే స్టోర్‌లోని కొన్ని యాప్స్ సహాయంతో డూప్లికేట్ ఫోటోలను చాలా సులువుగా రిమూవ్ చేసుకునే వీలుంటుంది. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్ ఫైల్స్ గో (Google Files Go)
గూగుల్ ఫైల్స్ గో యాప్‌లోని ఫ్రీ అప్ స్పేస్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవటం ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని డూప్లికేట్ ఫోటోలను పూర్తిస్థాయిలో డిలీట్ చేసేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఫోన్‌లోని గ్యాలరీని మాత్రమే కాకుండా మొత్తం డివైస్‌నే జల్లెడపట్టి డూప్లికేట్ ఫోటోలను ఫోటోలను రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తుంది. గూగుల్ ఫైల్స్ గో అప్లికేషన్‌ను ప్లేస్టోర్ నుంచి అఫీషియల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

గ్యాలరీ డాక్టర్ - ఫోటో క్లీనర్ (Gallery Doctor – Photo Cleaner)
గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో గ్యాలరీ డాక్టర్ - ఫోటో క్లీనర్ యాప్ వంతులవారీగా పనికిరాని ఫోటోలను డిలీట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ యాప్ ఫోన్ ఫోటో గ్యాలరీలోని నాసిరకం ఫోటోలను పసిగిట్టి వాటిని డివైస్ నుంచి తొలగించేస్తుంది. ఇదే సమయంలో స్ర్కీన్ షాట్స్ అలానే డూప్లికేట్స్‌ను కూడా ఈ యాప్ రిమూవ్ చేస్తుంది.

క్లీన్ మాస్టర్ (Clean Master)
తక్కువ స్టోరేజ్ స్పేస్‌తో కొట్టుమిట్టాడుతోన్న స్మార్ట్‌ఫోన్‌లలో క్లీన్ మాస్టర్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిన యాప్. ఈ యాప్‌లోని ఫోటో సార్టింగ్ అలానే డిలీషన్ ఆప్షన్స్ గ్యాలరీలోని సిమిలర్ ఫోటోస్, బ్లర్రీ ఫోటోస్ అలానే ఐడెంటికల్ ఫోటోలను గురించి వాటిని డిలీట్ చేసేస్తాయి. వాట్సాప్ మీడియా ఫోల్డర్‌లోని జంక్ ఫోటోలను తొలగించే క్రమంలో వాట్సాప్ క్లీనింగ్ టూల్‌ను ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను తీసుకోవచ్చు.

నాక్స్‌క్లీనర్ (NoxCleaner)
క్లీన్ మాస్టర్ యాప్ తరహాతోనే నాక్స్‌క్లీనర్ కూడా డెడికేటెడ్ ఫోటో మేనేజ్‌మెంట్ యాప్ ఏమి కాదు. అయితే, ఈ యాప్ ఆఫర్ చేసే కంప్లీట్ స్కాన్‌లో భాగంగా మన ఫోన్‌లోని సిమిలర్ ఫోటోస్, బ్లర్రీ ఫోటోస్ అలానే ఐడెంటికల్ ఫోటోలకు సంబంధించిన ఓవర్ వ్యూ మనకు తెలిసిపోతుంది. తద్వారా వాటిలో అవసరం లేని వాటిని సెలక్ట్ చేసుసుకుని డిలీట్ చేసుకునే వీలుంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను తీసుకోవచ్చు.

రెమో డూప్లికేట్ ఫోటోస్ రిమూవర్ (Remo Duplicate Photos Remover)
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు రెమో డూప్లికేట్ ఫోటోస్ రిమూవర్ యాప్‌ను వినియోగించుకోవటం ద్వారా ఐడెంటికల్ ఫోటోలకు పూర్తిగా దూరంగా ఉండొచ్చు. దీంతో ఫోన్ స్టోరేజ్ స్పేస్ అనేది ఎప్పటికప్పుడు ఆదా అవుతుంటుంది. ఈ యాప్ ఆఫర్ చేసే కంప్లీట్ స్కాన్‌లో భాగంగా ఫోన్ గ్యాలరీలోని డూప్లికేట్ లేదా సిమిలర్ ఇమేజెస్ సార్ట్ చేయబడతాయి. దీంతో వాటిని సునాయాశంగా డిలీట్ చేసుకునే వీలుంటుంది.


Click it and Unblock the Notifications