ఐపీఎల్ అభిమానులకు మినిట్ టూ మినిట్ కిక్కునిచ్చే యాప్స్

Written By:

మండే ఎండల్లో చల్లని ఐస్ క్రీం తింటే ఎలా ఉంటుంది. ఆ ఆనుభూతే వేరుగా ఉంటుంది కదా..అలాంటి అనుభూతిని అందివ్వడానికి సలసలకాగే ఎండల్లో ఐపీఎల్ ఆరంభమవుతోంది. క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించడానికి పొట్టి ఫార్మాట్ రెడీ అయింది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్యన సాగే ఆటను ఆస్వాదించాలంటే మంచి యాప్స్ కావాలి కదా..మరి మినిట్ మినిట్ మనకి అప్ డేట్ అందిస్తూ లైవ్ టెలికాస్ట్ చేసే యాప్స్ ఏమైనా ఉన్నాయా అని చాలామంది వెతుకుతుంటారు. అలాంటి వారికోసం కొన్ని యాప్స్ సిద్ధంగా ఉన్నాయి. ప్రతి ఒక్క అప్ డేట్ ఈ యాప్ ద్వారా యూజర్లు తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కమ్యాచులో హైలెట్ ఏంటీ అనే విషయాలు ఈ యాప్ ద్వారా అభిమానులు తెలుసుకునే అవకాశం ఉంది. అలాంటి యాప్స్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దామా..

జియో IPL ఆఫర్, 102 జిబి డేటా,ఫైనల్ మ్యాచ్ వరకు ఉచిత లైవ్‌లు,లగ్జరీ ఇల్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

CRICBUZZ

ప్రతి ఒక్క క్రికెట్ ప్రేమికుడు ప్రేమించే బెస్ట్ యాప్ ఇది. ఈ యాప్ లో మీకు బాల్ టూ బాట్ బాల్, కామెంటరీ మాత్రమే కాకుండా పాత మ్యాచులను కూడా చూసే అవకాశం ఉంది. ట్రాక్ మ్యాచ్ స్టాట్స్ , ప్లేయర్ స్టాట్స్, రికార్డ్స్, అలాగే మీకు ఇస్టమైన క్రికెట్ ప్లేయర్ ప్రొఫైల్ వారికి సంబంధించిన క్రికెట్ సమాచారం తెలుసుకోవచ్చు.

HOTSTAR

దీని ద్వారా మీరు కూర్చున్న చోటు నుంచే కాకుండా ఎక్కడనుంచైనా ఆట మొత్తాన్ని ఆస్వాదించవచ్చు. ట్రావెలింగ్ సమయంలో మీరు ఆట మొత్తాన్ని చూసే అవకాశం ఉంది. మీరు నెలకి రూ.190 చెల్లిస్తే మీకు exclusive movies and TV shows కూడా లభిస్తాయి. అయితే ఏప్రిల్ నెలలో మాత్రం ఎక్కువ ప్రిపరెన్స్ IPLకే ఉంటుంది.

OFFICIAL IPL 2017 APP

మీరు ఎటువంటి యాడ్స్ లేకుండా ఐపీఎల్ ఆస్వాదించాలనుకుంటే మీకు సరైన యాప్ ఇది. ఇందులో బాల్ టూ బాల్ స్కోరు అలాగే వీడియో హైలెట్స్ తో పాటు ఇతర ఫీచర్లు కూడా లభిస్తాయి. దీంతో పాటు మీకు లైవ్ ఫోటోలు ఇంటర్యూలు కూడా ఇందులో చూడవచ్చు.

ESPNCRICINFO CRICKET

ఇందులో ముఖ్యమైన సమాచారం ఉంటుంది. మీరు కంటెంటె పరంగా చూడాలనుకుంటే ఈ యాప్ వినియోగించుకోవచ్చు. ఇందులో బుక్ మార్క్ తో కూడిన స్టోరీలతో పాటు మ్యాచ్ జరిగే తేదీలు అందుబాటులో ఉంటాయి.

IPL LIVE SCORE

ఇది మీకు ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉన్న సమయంలో బాగా పనిచేస్తుంది. ఎటువంటి అంతరాయం లేకుండా మ్యాచ్ మొత్తాన్ని దీని ద్వారా అభిమానులు చూడవచ్చు. స్లో ఇంటర్నెట్ కనెక్షన్ లో కూడా మీరు మీ స్నేహితులకు మ్యాచ్ గురించిన వివరాలు పంపుకోవచ్చు.

Airtel tv, Jio tv

భారతీ ఎయిర్‌టెల్ త‌న ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌ు ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను ఉచితంగా చూడవచ్చు. ఎయిర్‌టెల్ టీవీ యాప్‌ను క‌స్ట‌మ‌ర్లు ఫోన్ల‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే దాంట్లో ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను లైవ్‌లో ఉచితంగా వీక్షించ‌వ‌చ్చ‌ని ఎయిర్‌టెల్ తెలిపింది.
అలాగే జియో టీవి కూడా తన యాప్ లో ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను అందిస్తోంది. ఏప్రిల్ 7వ తేదీన ఐపీఎల్ ప్రారంభం కానుండగా ఆ తేదీ నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు అన్ని మ్యాచ్‌లను జియో కస్టమర్లు ఉచితంగా చూడాలంటే రూ.251 ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాలి. అనంతరం మై జియో యాప్‌లో క్రికెట్ లైవ్ ప్రసారాలను వీక్షించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
It's our most favourite time of the year. IPL time. The time when we take a walk down the street to the nearest electronic store and stand outside like a bunch of monkeys ogling at the TVs on display.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot