Instagram ద్వారా మీ వ్యాపారాన్ని పెంచుకునేందుకు 5 చిట్కాలు..

సోషల్ నెట్‌వర్కింగ్ విభాగంలో అగ్రగామి ఫోటో ఇంకా వీడియో షేరింగ్ సోషల్ నెట్‌వర్క్‌గా అవతరించిన ఇన్‌స్టాగ్రామ్, వ్యాపారాల ఎదుగుదలకు మరింతగా తోడ్పడుతోంది.

|

సోషల్ నెట్‌వర్కింగ్ విభాగంలో అగ్రగామి ఫోటో ఇంకా వీడియో షేరింగ్ సోషల్ నెట్‌వర్క్‌గా అవతరించిన ఇన్‌స్టాగ్రామ్, వ్యాపారాల ఎదుగుదలకు మరింతగా తోడ్పడుతోంది. 2012లో ఈ సంస్థను ఫేస్‌బుక్ కొనగోలు చేసిన నాటి నుంచి విప్లవాత్మక మార్పులు ఈ ప్లాట్‌ఫామ్‌లో చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో స్టోరీస్ పేరుతో ఓ సరికొత్త ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసింది.ఈ ఫీచర్‌ను పరిచయం చేసిన దగ్గర నుంచి ప్రభావంతమైన మార్కెటింగ్ ప్లేస్‌గా ఇన్‌స్టాగ్రామ్ మారిపోయింది. Instagram ద్వారా మీ వ్యాపారాన్ని పెంచుకునేందుకు 5 సులువైన చిట్కాలను ఇక్కడ సూచించటం జరుగుతోంది.

రూ.10 వేల కేటగిరిలో బెస్ట్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్రూ.10 వేల కేటగిరిలో బెస్ట్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్

ప్రభావితదారులను సులువుగా యాక్సిస్ చేసకోవచ్చు..

ప్రభావితదారులను సులువుగా యాక్సిస్ చేసకోవచ్చు..

భారీ సంఖ్యలో యూజర్లను కలిగి ఉన్న సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రభావితదారుల(influencers)ను సులువుగా యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభావితదారులను సెర్చ్ చేసేందుకు హ్యాష్‌ట్యాగ్స్ అనేవి తోడ్పడుతాయి. మీ వ్యాపారానికి రిలేట్ అయి ఉన్న స్పెసిఫిక్ వర్డ్స్‌ను హ్యాష్‌ట్యాగ్స్ రూపంలో మలచటం వల్ల ఎక్కువ మంది కస్టమర్స్‌కు రీచ్ అయ్యే వీలుంటుంది.

ఇతర బ్రాండ్‌ల మార్కెటింగ్ ప్రొఫైల్స్‌ను ఫాలో అవుతూ..

ఇతర బ్రాండ్‌ల మార్కెటింగ్ ప్రొఫైల్స్‌ను ఫాలో అవుతూ..

500 మంది కంటే తక్కువ ఫాలోవర్లను కలిగి ఉన్న ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు కూడా తమ మార్కెటింగ్ మెసేజ్‌ను ప్రోపగేట్ చేసుకోవచ్చు. మీకంటే ముందు నుంచే మార్కెటింగ్ ప్రచారాలను నిర్వహిస్తోన్న వారు ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్‌ను ఫాలో అవుతూ మీ బ్రాండ్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి.

కంటెంట్ క్రియేట్ చేసే విషయంలో ప్రభావితదారులకు మరింత స్వేచ్ఛనివ్వండి..

కంటెంట్ క్రియేట్ చేసే విషయంలో ప్రభావితదారులకు మరింత స్వేచ్ఛనివ్వండి..

మీ వ్యాపార ప్రయోజనాల నిమిత్తం ప్రభావితదారులకు నగదు పే చేయటమనేది రైసింగ్ ట్రెండ్‌గా భావించాలి. ప్రస్తుతం నెలకున్న పరిస్థితులను మనం పరిశీలించినట్లయితే చాలా వరకు బ్రాండ్‌లు కంటెంట్ క్రియేషన్ పనిని ప్రభావితదారుల చేతుల్లో పెట్టేస్తున్నాయి. కంటెంట్ క్రియేట్ చేసే విషయంలో ప్రభావితదారులకు మరింత స్వేచ్ఛను ఇవ్వటం ద్వారా బ్రాండ్ వాల్యూ మరింతగా పెరిగే అవకాశముంది.

కంటెంట్‌ను క్రియేట్ చేసే విపయంలో ఎటువంటి అవరోధాలు ఉండకూడదు..

కంటెంట్‌ను క్రియేట్ చేసే విపయంలో ఎటువంటి అవరోధాలు ఉండకూడదు..

ఇన్‌స్టాగ్రామ్ అనేది ఓ షార్ట్ ఫార్మాట్ కంటెంట్ ప్లాట్‌ఫామ్ కావటంతో ఎక్కువ మంది యూజర్లను అట్రాక్ట్ చేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో చాలా సులువుగా కంటెంట్‌ను క్రియేట్ చేసుకునే వీలుంటుంది. ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోగలిగే ప్రభావితదారుల ఫ్రీక్వెంట్‌గా కంటెంట్‌ను క్రియేట్ చేస్తుండటం వల్ల ఫలితాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి.

ఉచిత అనలిటిక్స్..

ఉచిత అనలిటిక్స్..

ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు నిర్వహించే సోషల్ క్యాంపెయిన్‌కు సంబంధించి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌సైట్స్ ద్వారా ఎప్పపటికప్పుడు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ ఉచిత అనలిటిక్స్ టూల్ ద్వారా మీ పోస్టులకు సంబంధించిన రీచ్, వ్యూస్ అలానే వెబ్‌సైట్ క్లిక్స్‌ను తెలుసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Facebook bought the photo-and-video sharing social network Instagram in 2012 and five years later, introduced stories, a USP of Snapchat till then. This led to a spike of social users on the platform, as was the intent.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X