మీ ఫేస్ బుక్ అకౌంట్ సురక్షితమేనా? మీకోసమే 5 చిట్కాలు!

Posted By: Madhavi Lagishetty

ఫేస్ బుక్ మన జీవితంలో భాగమైపోయింది. వ్యక్తిగత జీవితంలోనూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. అయితే మనం పంచుకునే విషయాలన్నీ నిజంగా మనకు మాత్రమే పరిమితమా...? మీకు సంబంధించిన రహస్యాలన్నీ పంచుకోవడానికి ఫేస్ బుక్ సురక్షితమా? అంటే కాదనే చెప్పాలి.

మీ ఫేస్ బుక్ అకౌంట్ సురక్షితమేనా? మీకోసమే 5 చిట్కాలు!

ఎందుకంటే మనకు తెలియకుండా హ్యాక్ గురవుతున్నాయి. మరీ మీ ఫేస్ బుక్ అకౌంట్ ను సేఫ్ గా ఉంచుకునుందకు కొన్ని చిట్కాలు మీకోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

HTTPS ను ప్రారంభించు....

మీ కంప్యూటర్ కు సర్వర్ కు మధ్య జరిగిన సంభాషణను భద్రపర్చడానికి HTTPS కు బదులుగా HTTPను ఉపయోగించండి.అంతేకాకుండా సమాచారాన్ని సురక్షితంగా URLలను హైలైట్ చేసే బ్రౌజర్లు అందుబాటులో ఉన్నాయి. HTTPS ను ప్రారంభించడానికి మీ ఫేస్ బుక్ ఖాతాను లాగిన్ చేసి " అకౌంట్ సెట్టింగ్స్" కు వెళ్లండి. ఇప్పుడు అకౌంట్ సెక్యూరిటీని ఎంచుకుని సేఫ్ కనెక్షన్ తో FACEBOOKను బ్రౌజ్ చేయండి.

రెండు దశల్లో ధృవీకరణ...

ఫేస్ బుక్ లాగిన్ కావాలంటే రెండు వెరిఫికేషన్ ధ్రవీకరణలను ప్రవేశపెట్టింది. మీ యూజర్ అకౌంట్ ను , పాస్ వర్డ్ ను, రిజస్టర్డ్ చేసిన మొబైల్ నెంబర్ కు పంపిన కోడ్ ను వెరిఫికేషన్ చేసిన తర్వాతే యూజర్ అకౌంట్ లాగిన్ అవుతుంది. అయితే మీ మొబైల్ కు పంపించిన పాస్ వర్డ్, కోడ్ ను భద్రంగా ఉపయోగించాల్సి ఉంటుంది.

స్ట్రాంగ్ పాస్ వర్డ్ ను క్రియేట్ చేసుకోవడం...

మీ ఫేస్ బుక్ ను సేఫ్ గా ఉంచుకునేందుకు పొడవైన పాస్ వర్డ్ ను క్రియేట్ చేసుకోవాలి. పొడవైన పాస్ వర్డ్ ను క్రియేట్ చేసుకుంటే...హాక్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకునేలా చేస్తుంది. దీంతోపాటు యూజర్ పేరు, పెట్ నేమ్, పుట్టిన తేదీని పాస్ వర్డ్ గా క్రియేట్ చేసుకోవద్దు. వీటి ద్వారా ఈజీగా హ్యాక్ చేసే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ పాస్ వర్డ్ ను మార్చుకోండి.

ప్రైవసీ సెట్టింగ్స్....

సెట్టింగ్స్ పై క్లిక్ చేసి ప్రైవసీ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి. దీనిలో మూడు అంశాలు ఉంటాయి. ఎవరు నా పోస్టింగ్స్ చూడాలి ? ఎవరితో కాంటాక్ట్ లో ఉండాలి?నా అకౌంట్ ఎవరు చూడవచ్చు? స్నేహితులు మాత్రమే మీ అకౌంట్ ను చూడాలి...పబ్లిక్ కాదని నిర్దారించుకోండి.

ఫిషింగ్ ను నివారించండి...

మీ ఫేస్ బుక్ అకౌంట్లో ఎప్పుడూ కూడా స్పామ్ లింక్ లను అవైడ్ చేయండి. ఎందుకంటే చాట్స్ ను ఉపయోగించి డబ్బు స్కామ్స్ తో సహా అనేక దాడులు జరుగుతున్నాయి. మీరు లింక్ ను క్లిక్ చేసిన తర్వాత....నకిలీ వెబ్ సైట్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేయడానికి లేదా మీ డివైస్ ను డ్యామేజ్ చేస్తుంది. అంతేకాదు ఏ వెబ్ సైట్ కు యూజర్ నేమ్, పాస్ వర్డ్ ను ఇవ్వకుండా ఉండటం ఉత్తమం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook is one of the major social networks with millions of account in it. If you search on the Internet, it will show you various ways to hack the account. Today, we are going to tell 5 ways of keeping your account safe and sound.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot